ETV Bharat / offbeat

ఎండ వేడికి త్వరగా అలసిపోతున్నారా? - ఈ "చల్లచల్లటి డ్రింక్​"ను ఒక్క గ్లాసు తాగారంటే రేసుగుర్రంలా ఉరకలేస్తారు! - SUMMER SPECIAL DRINK RECIPE

రాగి పిండితో ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ డ్రింక్ - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Summer Special Healthy Drink
Healthy Drink (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 9, 2025 at 2:48 PM IST

3 Min Read

Summer Special Healthy Drink : ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల శీతల పానియాలను ఆశ్రయిస్తుంటారు. కానీ, ఇవి తాగడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది! ఎందుకంటే కొన్ని రకాల శీతల పానీయాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. కాబట్టి, అలాకాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ హెల్దీ డ్రింక్​ని ప్రిపేర్ చేసుకొని తాగండి. రాగి పిండితో ప్రిపేర్ చేసుకునే ఈ జ్యూస్ సమ్మర్​లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రాగుల్లో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, బి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, రాగిపిండితో తయారు చేసుకునే ఈ డ్రింక్ వేసవిలో ఆరోగ్యానికి అనేక విధాలుగా తోడ్పడుతుంది. పైగా పది నిమిషాల్లో అప్పటికప్పుడు సింపుల్​గా ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించవచ్చు. సూపర్ టేస్టీగా ఉండి పొట్టకి ఎంతో హాయినిస్తుంది. మరి, ఈ చల్ల చల్లని రాగి పిండి జ్యూస్​ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్ తెలుసుకోవాలి :

  • ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ కోసం మీరు కాస్త స్వీట్ ఇష్టపడేవారు అయితే బెల్లాన్ని కాస్త పెంచి తీసుకోవచ్చు.
  • ఇక్కడ రాగి పిండిని ముందుగానే కలిపి ఉడికించుకోవడం వల్ల ఎక్కడా ఉండలు లేకుండా పిండి అనేది సాఫ్ట్​గా ఉడుకుతుంది.
  • ఈ జ్యూస్​కి కలర్ అవసరం లేదనుకుంటే బీట్ రూట్ ముక్క వేసుకోకున్నా సరిపోతుంది.
RAGI FLOUR DRINK
RAGI FLOUR DRINK (Getty Images)

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  1. అర కప్పు - పచ్చికొబ్బరి ముక్కలు
  2. అర కప్పు - రాగిపిండి
  3. అర కప్పు - బెల్లం తురుము
  4. పదిహేను నుంచి ఇరవై - బాదంపప్పులు
  5. ఒక టేబుల్​స్పూన్ - సబ్జా గింజలు
  6. చిన్న బీట్​రూట్ ముక్క(కలర్ కోసం)
  7. చిటికెడు - యాలకుల పొడి
  8. కొద్దిగా - డ్రైఫ్రూట్ పొడి(గార్నిష్ కోసం)
  9. కొద్దిగా - ఐస్ క్యూబ్స్
  10. రెండు కప్పులు - వాటర్

పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

RAGI FLOUR DRINK
RAGI FLOUR DRINK (Getty Images)

సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా :

  • ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో సబ్జా గింజలను తీసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే, మరో గిన్నెలో బాదం పలుకులను తీసుకొని వేడి వాటర్ పోసుకుని పావుగంట పాటు నానబెట్టాలి.
  • బాదంను వేడి వాటర్​లో నానబెట్టుకోవడం ద్వారా పొట్టు ఈజీగా వస్తుంది. అవి నానిన తర్వాత పొట్టు తీసుకొని పక్కనుంచాలి.
  • ఇవి నానేలోపు ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా పిండి ముద్దలు లేకుండా చెంచా లేదా విస్కర్ సహాయంతో బాగా బీట్ చేయాలి.
RAGI FLOUR DRINK
RAGI FLOUR DRINK (Getty Images)
  • పిండి చక్కగా మిక్స్ చేసుకున్నాక ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి దగ్గర పడే వరకు మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ చేసుకొని గిన్నెను దించి పిండిని కాస్త చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించి చల్లార్చుకున్న రాగి పిండి ముద్ద, సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, పొట్టు తీసుకున్న బాదం, బెల్లం తురుము, యాలకుల పొడి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై జ్యూస్​ మంచి కలర్​లో కనిపించడానికి ఒక స్లైస్ బీట్​రూట్ ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాడనికి వీలుగా తగినన్ని వాటర్(200ఎంఎల్) వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం, బాదం పలుకులు కనిపించకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి.
RAGI FLOUR DRINK
RAGI FLOUR DRINK (Getty Images)
  • ఇక్కడ జ్యూస్ కన్సిస్టెన్సీ చిక్కగా లేదా పల్చగా కావాలన్నా దాని ప్రకారం నీళ్లు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
  • బీట్​రూట్ ముక్క వేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకున్నాక జ్యూస్ గులాబీ రంగులోకి మారిపోతుంది.
  • చక్కగా మిక్సీ పట్టుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక బౌల్​లోకి వడకట్టుకోవాలి. అనంతరం ఆ డ్రింక్​ని ఒకసారి కొద్దిగా రుచి చూసి అందుకు తగినట్లుగా వాటర్ లేదా చల్లని పాలు యాడ్ చేసుకోవచ్చు.
  • అలాగే, ఈ టైమ్​లోనే స్వీట్​ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువగా ఉందనిపిస్తే కొద్దిగా బెల్లం లేదా చక్కెర వేసుకొని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో నానబెట్టుకున్న సబ్జాగింజలు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కలుపుకోవాలి.
  • చివరగా ఆ మిశ్రమాన్ని గ్లాసులలో పోసుకొని పైన కొద్దిగా సన్నని డ్రైఫ్రూట్స్​ పలుకులతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే, టేస్టీ అండ్ హెల్దీ "రాగి పిండి జ్యూస్" రెడీ!
Healthy Drink
Drink (ETV Bharat)

మండుటెండల్లో హాయినిచ్చే "పానకం షర్బత్" - ఒక్క గ్లాసు తాగారంటే ఎండ వేడిమి, డీహైడ్రేషన్ ఔట్!

పచ్చిమామిడితో "చల్లని డ్రింక్" - మండుటెండల్లో గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.