ETV Bharat / offbeat

మండే ఎండల్లో మజానిచ్చే "జామకాయ ఐస్​క్రీమ్​" - తక్కువ సమయంలోనే అద్దిరిపోయే రుచి! - SUMMER SPECIAL GUAVA ICE CREAM

-జామకాయలను నేరుగా తినడం కాకుండా -ఇలా ఐస్​క్రీమ్​ చేసుకోండి టేస్ట్​ అద్దిరిపోతుంది

Summer Special Guava Ice Cream
Summer Special Guava Ice Cream (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 29, 2025 at 10:32 AM IST

2 Min Read

Summer Special Guava Ice Cream: ఎండాకాలంలో మెజార్టీ జనాలు చల్లటి పదార్థాల వైపు మొగ్గు చూపుతుంటారు. కూల్​కూల్​గా ఐస్​క్రీమ్​, లస్సీ, కుల్ఫీ, మిల్క్​ షేక్ అంటూ తినడం,​ తాగడం చేస్తుంటారు. మండే ఎండల్లో చల్లచల్లగా ఉన్న వీటిని తింటుంటే హాయిగా ఉంటుంది. అయితే ఐస్​క్రీమ్​లో ఎన్నో రకలా ఫ్లేవర్లు ఉన్నాయి. కాగా ఎప్పుడూ వెనీలా, బటర్​స్కాచ్​ అంటూ తింటే బోర్​ కొడుతుంది. కాబట్టి ఓసారి ఇలా జామకాయ ఐస్​క్రీమ్​ను ప్రిపేర్​ చేసుకోండి. వెరైటీగా ఉండి టేస్ట్​ అద్దిరిపోతుంది. పైగా అతి తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Guava
Guava (Getty Images)

నిజానికి జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఫైబర్​, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు బరువు తగ్గడం, డయాబెటిస్​ కంట్రోల్​, చర్మంపై ముడతలు తగ్గించడం లాంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. మరి లేట్​ చేయకుండా జామకాయ ఐస్​క్రీమ్​ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Misri
Misri (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • జామకాయలు - 4
  • పాలు - అర కప్పు
  • బీట్​రూట్​ జ్యూస్​ - 4 చుక్కలు
  • పటిక బెల్లం - 3 చెంచాలు
  • ఉప్పు - చిటికెడు
  • పాల పొడి - 1/3 కప్పు
  • డ్రైఫ్రూట్స్​ పలుకులు - కొద్దిగా
Milk
Milk (Getty Images)

తయారీ విధానం:

  • పాలను బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత అరగంట సేపు ఫ్రిజ్​లో ఉంచాలి. మీ దగ్గర అంతకుముందే కాగబెట్టి ఫ్రిజ్​లో పెట్టిన పాలు ఉంటే వాడుకోవచ్చు.
  • జామకాయలను బాగా కడిగి, తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటి పైభాగాన్ని అంటే కాడలు ఉన్నవైపు కొద్దిగా కట్ చేయాలి.
  • స్పూన్ సహాయంతో జామకాయల లోపలి గుజ్జు, గింజలు తీసి, వాటిని ఒక బౌల్‌లో వేయాలి.
  • మిక్సీజార్​లోకి జామకాయ గుజ్జు, కాచి చల్లార్చిన చిల్డ్​ మిల్క్, బీట్​రూట్​ జ్యూస్ డ్రాప్స్​ వేసి మెత్తగా గ్రైండ్​ చేయాలి.
  • ఆ తర్వాత అందులోకి పటిక బెల్లం, ఉప్పు, పాలపొడి వేసి మరోసారి బ్లెండ్​ చేసుకోవాలి.
  • ఈ జ్యూస్​ను ఓ బౌల్​లోకి తీసుకోవాలి. అనంతరం డ్రైఫ్రూట్స్​ పలుకులు వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జామకాయలలో నింపి, వాటి పైభాగాలను మూసివేయాలి.
  • ఈ జామకాయలను ఫ్రీజర్​లో 6 -7 గంటలు ఉంచి ఆ తర్వాత బయటికి తీసి పొడుగ్గా కట్​ చేసుకుని తేనె, డ్రైఫ్రూట్స్​తో గార్నిష్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే సరి.
  • సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ జామకాయ ఐస్​క్రీమ్​ రెడీ. కావాలంటే మీకు నచ్చిన షేప్​లో కట్​ చేసుకోవచ్చు జామకాయలను.

టిప్స్​:

  • జామకాయ ఐస్‌క్రీమ్‌ను మరింత రుచికరంగా చేయడానికి, మీరు కొద్దిగా యాలకుల పొడి లేదా రోజ్ ఎసెన్స్ యాడ్​ చేసుకోవచ్చు.
  • పటిక బెల్లం లేకపోతే రుచికి తగినట్లుగా పంచదారను యాడ్​ చేసుకోవచ్చు.
  • ఐస్‌క్రీమ్ మరింత క్రీమీగా ఉండాలంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు.
Guava Ice Cream
Guava Ice Cream (ETV Bharat)

నాన్​వెజ్​ కంటే రుచికరంగా "జామకాయ మసాలా కర్రీ" - అన్నం, రోటీ, పులావ్​లోకి సూపర్ కాంబో!

జామకాయ, నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? - చలికాలంలో అవి తినకూడదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.