ETV Bharat / offbeat

ఎప్పుడూ రొటీన్​ లస్సీ ఏం బాగుంటుంది! - ఓసారి "చాక్లెట్​, డ్రైఫ్రూట్స్​" ఫ్లేవర్లు ట్రై చేయండి! - అద్దిరిపోతాయి! - SUMMER SPECIAL DRY FRUITS LASSI

-ఒక్కసారి చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు! -పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు!

Summer Special Dry Fruits Lassi
Summer Special Dry Fruits Lassi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2025 at 12:58 PM IST

2 Min Read

Summer Special Dry Fruits Lassi : చాలా మంది ఇష్టపడే డ్రింక్స్‌లో లస్సీ కూడా ఒకటి. మండే ఎండల్లో చల్లచల్లగా ఒక్క గ్లాస్​ తాగితే వచ్చే ఆ కిక్​ వేరే లెవల్​. ఇక దీని తయారికీ ఉపయోగించే పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది సమ్మర్​లో కూల్‌డ్రింక్స్​ బదులు ఇది తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే లస్సీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా, రకరకాల ఫ్లేవర్స్​తో తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మీకోసం కొన్ని రకాల ఫ్లేవర్డ్​ లస్సీ రెసిపీ తీసుకోచ్చాం. వీటి టేస్ట్​ చాలా బాగుంటుంది. కేవలం పెరుగు రెడీగా ఉంటే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా శరీరానికి చలువ చేసే తియ్యని రుచికరమైన రకరకాల లస్సీలను ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.

Curd
Curd (Getty Images)

డ్రైఫ్రూట్స్​ లస్సీ:

కావాల్సిన పదార్థాలు:

  • చిక్కని, చల్లటి గడ్డ పెరుగు - 1 కప్పు
  • పిస్తా - 2 టేబుల్​స్పూన్లు
  • బాదంపప్పులు - 2 టేబుల్​స్పూన్లు
  • అంజీర్​ - 1
  • పంచదార - 2 టేబుల్​స్పూన్లు
  • కుంకుమపువ్వు ఫుడ్​ కలర్​ - పావు టీస్పూన్​
  • డ్రైఫ్రూట్స్​ పలుకులు - కొద్దిగా
Dry Fruits
Dry Fruits (Getty Images)

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి చల్లగా, చిక్కగా ఉన్న గడ్డ పెరుగు తీసుకుని విస్కర్​ సాయంతో పలుకులు లేకుండా బాగా బీట్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి చిక్కటి పెరుగు, పిస్తా పలుకులు, బాదం పప్పులు, అంజీరా, పంచదార, కుంకుమపువ్వు ఫుడ్​ కలర్ వేసి మధ్యమధ్యలో ఆపుకుంటూ స్మూత్​గా బ్లెండ్​ చేసుకోవాలి.
  • సుమారు 5 నిమిషాల పాటు హైస్పీడ్​లో గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా ప్రిపేర్​ చేసుకున్న డ్రింక్​ను ఓ గ్లాస్​లో పోసుకుని పైన డ్రైఫ్రూట్స్​ పలుకులతో సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ డ్రైఫ్రూట్స్​ లస్సీ రెడీ.

చాక్​లెట్​ లస్సీ:

కావాల్సిన పదార్థాలు:

  • చిక్కని, చల్లటి గడ్డ పెరుగు - 1 కప్పు
  • చాక్లెట్​ సిరప్​ - 3 టేబుల్​స్పూన్లు
  • పంచదార - 2 టేబుల్​స్పూన్లు
Chocolate Syrup
Chocolate Syrup (Getty Images)

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి చిక్కటి గడ్డ పెరుగు తీసుకుని విస్కర్​ సాయంతో పలుకులు లేకుండా బాగా బీట్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి చిక్కటి పెరుగు, చాక్లెట్​ సిరప్​, పంచదార వేసి హై స్పీడ్​ మధ్యమధ్యలో ఆపుతూ సుమారు 5 నిమిషాల పాటు బ్లెండ్​ చేసుకోవాలి.
  • ఇలా ప్రిపేర్​ చేసుకున్న డ్రింక్​ను ఓ గ్లాస్​లో పోసుకుని పైన చాక్లెట్​ సిరప్​తో గార్నిష్​ చేసి సర్వ్​ చేస్తే సూపర్​ టేస్టీ చాక్లెట్​​ లస్సీ రెడీ.

పంజాబీ లస్సీ:

కావాల్సిన పదార్థాలు:

  • చిక్కటి, చల్లని గడ్డ పెరుగు - 1 కప్పు
  • పంచదార - 2 టేబుల్​స్పూన్లు
  • యాలకుల పొడి - అర టీస్పూన్​
Cardamom
Cardamom (Getty Images)

  • మిక్సీజార్​లోకి చిక్కటి పెరుగు, పంచదార, యాలకుల పొడి వేసి హై స్పీడ్​ మధ్యమధ్యలో ఆపుతూ సుమారు 5 నిమిషాల పాటు బ్లెండ్​ చేసుకోవాలి.
  • ఇలా ప్రిపేర్​ చేసుకున్న డ్రింక్​ను ఓ గ్లాస్​లో పోసుకుని సర్వ్​ చేస్తే సూపర్​ టేస్టీ పంజాబీ లస్సీ రెడీ.

మండు వేసవిలో మజానిచ్చే "తాటి ముంజల షర్బత్​" - రెండే నిమిషాల్లో రెడీ - ఒక్క గ్లాస్​ తాగితే ఫుల్​ రిఫ్రెష్​!

ఒంటికి చలువ చేసే కమ్మని "పాయసం" - పెసరపప్పు, సగ్గుబియ్యం కాంబినేషన్​లో అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.