ETV Bharat / offbeat

పచ్చి మామిడి, పచ్చి కొబ్బరి - 5 నిమిషాల్లోనే అద్దిరిపోయే తాజా "చట్నీ" - ఈ సీజన్​పోతే దొరకదు! - SUMMER SPECIAL CHUTNEY

- వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే పచ్చడి - ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు!

COCONUT MANGO CHUTNEY
Summer Special Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 7, 2025 at 7:08 PM IST

Updated : April 10, 2025 at 6:13 PM IST

2 Min Read

Summer Special Pachadi in Telugu : రొటీన్ చట్నీతో బోర్ కొట్టేవాళ్లకు సూపర్ చట్నీ అందుబాటులో ఉంది. అదే, "మామిడికాయ కొబ్బరి చట్నీ". సరిగ్గా ప్లాన్ చేస్తే పది నిమిషాల్లోనే ఇది పూర్తవుతుంది. ముద్దగా ఉండి అన్నంలో కలుపుకొని తింటుంటే ఈ చట్నీ భలే టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికీ ఎంతో మేలు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి తయారీపై ఓ లుక్కేద్దాం.

టిప్స్ ​:

  • ఈ చట్నీలో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఎండుమిర్చి వేసుకుంటే పల్లీలలతో పాటు వాటి వేయించి తీసుకోవాలి.
  • అలాగే, పల్లీలు పచ్చడి రుచిని పెంచుతాయి. కానీ, మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేస్తే టిఫెన్స్ పచ్చడిగా మారిపోతుందని గుర్తుంచుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు :

  1. మామిడికాయ ముక్కలు కప్పు
  2. పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు
  3. పల్లీలు 2 స్పూన్లు
  4. పచ్చిమిర్చి 7
  5. వెల్లుల్లి రెబ్బలు - 7
  6. జీలకర్ర - అర స్పూన్
  7. కొత్తిమీర - చిన్న కట్ట
  8. ఉప్పు - సరిపడా

ఈ పద్ధతిలో "టమాటా చట్నీ" చేసుకోండి - నోట్లోకి వెళ్తుంటే నాలుక నాట్యమాడాల్సిందే!

సింపుల్​గా తయారు చేసుకోండిలా :

  • స్టౌ పైన పాన్ పెట్టి పల్లీలను చక్కగా వేయించుకొని, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • పచ్చిమామిడికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, కొత్తిమీర, కాస్త వాటర్ పోసి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • చివరగా మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి బౌల్​లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.

పోపు కోసం :

  1. నూనె - మూడు స్పూన్లు
  2. ఆవాలు - అర స్పూన్
  3. మినప్పప్పు - ఒక స్పూన్
  4. పచ్చిశనగపప్పు - ఒక స్పూన్
  5. తురిమిన అల్లం - ఒక స్పూన్
  6. ఎండుమిర్చి - రెండు
  7. పసుపు - ఆర స్పూన్
  8. జీలకర్ర - అర స్పూన్
  9. ఇంగువ - అర స్పూన్
  10. కరివేపాకు - రెండు రెబ్బలు
  • స్టౌ పైన కడాయి పెట్టి ​నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ముక్కలుగా వేయాలి.
  • తర్వాత జీలకర్ర, అల్లం తురుము, ఇంగువ, కరివేపాకు వేసి మరికాసేపు ఫ్రై చేయాలి. చివరగా పసుపు వేసుకుని స్టౌ ఆఫ్​ చేయాలి.
  • ఆ తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసి మొత్తం కలుపుకోవాలి.
  • అంతే కమ్మని "మామిడికాయ కొబ్బరి "పచ్చడి మీ ముందు ఉంటుంది.

పాల్వంచ టిఫెన్ సెంటర్​​ "పల్లీ చట్నీ" - చట్నీ కోసమే అక్కడ టిఫెన్ తింటారు! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

పల్లీలు, కొబ్బరి, చింతపండు లేకుండానే - టిఫెన్స్​లోకి సూపర్ "చట్నీ"! - గ్యాస్ సమస్యకు బెస్ట్ ఆప్షన్!

Last Updated : April 10, 2025 at 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.