ETV Bharat / offbeat

వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు హాయిగా తినొచ్చు!

సమ్మర్​లో ఆరోగ్యానికి మేలు చేసే "కీరా దోస ఆవిరి కుడుము విత్ చట్నీ" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

Summer Healthy Breakfast Recipe
Healthy Breakfast Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2025 at 7:36 PM IST

4 Min Read
Choose ETV Bharat

Summer Healthy Breakfast Recipe : ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఒంటికి చలువ చేసే పదార్థాలు తీసుకుంటుంటారు. అలాంటి వారికోసమే ఒక హెల్దీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాం. ఇది వేసవిలో ఒంటికి చలువ చేస్తూ, కడుపునిగా ఉంచుతుంది. అంతేకాదు, ఈ రెసిపీని బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవాళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా హాయిగా తినొచ్చు. ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్నిచ్చే బహు గొప్ప రెసిపీ ఇది. అదే "కీరా దోస ఆవి కుడుములు విత్ కీరా చట్నీ". ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మరి, ఈ సమ్మర్ స్పెషల్ హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :

  1. అల్లం ముక్క - అంగుళం సైజ్​ది
  2. పచ్చిమిర్చి - 3
  3. పచ్చికొబ్బరి ముక్కలు - ఒక కప్పు
  4. కీరా దోసకాయలు - రెండు
  5. జొన్న ఇడ్లీ రవ్వ - ఒక కప్పు

కన్నడ స్పెషల్ "నుచ్చినుండే" - పేరు మాత్రమేకాదు, టేస్ట్ కూడా సరికొత్తగా అద్దిరిపోతుంది!

తయారీ విధానం :

  • ఈ హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలోకి ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో సన్నని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తుంపలు, సన్నగా కట్ చేసిన పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు కీర దోసకాయలను తీసుకొని చివర్లు కట్ చేసి పీలర్​ సహాయంతో పైన చెక్కు తొలగించుకోవాలి.
  • ఆపై శుభ్రంగా కడిగి సన్నని హోల్స్ ఉన్న గ్రేటర్​తో ఒక ప్లేట్​లోకి కీరదోసని తురుముకోవాలి.
  • అనంతరం కీరా తురుముని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం, సన్నని జొన్న ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
  • ఇక్కడ చుక్క నీరు వేయకుండానే కీరాలో ఉండే వాటర్ పిండి కలుపుకోవడానికి సరిపోతుంది.
  • పిండి మిశ్రమం కొద్దిగా జారుగా అనిపించినట్లయితే మరో రెండు మూడు స్పూన్లు జొన్న ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకోవచ్చు.
  • జొన్న రవ్వ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక మూతపెట్టి పావుగంట పాటు పక్కనుంచాలి. ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి.

చట్నీ కోసం తీసుకోవాల్సినవి :

  • కీర దోసకాయలు - 2
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • మెంతులు - 10 నుంచి 15
  • శనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి - 10(కారానికి తగినంత)
  • జీలకర్ర - అరటీస్పూన్
  • పచ్చికొబ్బరి ముక్కలు - అర కప్పు
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇందుకోసం ముందుగా కీర దోసకాయలను తొడిమలు కట్ చేసుకొని శుభ్రంగా కడగాలి.
  • ఆపై చెక్కును అలాగే ఉంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మెంతులు, పచ్చిశనగపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి.
  • అవి సగం వేగాక ఎండుమిర్చి, జీలకర్ర వేసి కలుపుతూ మరికాసేపు వేయించాలి. అవి చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద అవి కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
  • కీరా ముక్కలు మగ్గిన తర్వాత అందులో పసుపు, పచ్చికొబ్బరి ముక్కలు వేసి మరో నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ఉడికించి చల్లార్చుకున్న కీరా దోస ముక్కలను వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే, కీర దోస చట్నీ రెడీ!
  • ఈ చట్నీ కేవలం కుడుములలోకే కాకుండా ఇడ్లీ, దోశలలోకి కూడా చాలా బాగుంటుంది.
  • ఇప్పుడు కీరా దోస కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసి గిన్నెపై జాలి స్టాండ్ ఉంచి దానిపై తడి కాటన్ వస్త్రాన్ని గిన్నెపైన ఉంచి అంచుల కింద దారంతో టైట్​గా కట్టాలి.
  • అనంతరం చక్కగా నానిన జొన్న రవ్వ కీరా మిశ్రమాన్ని మరోసారి చేతితో బాగా కలపాలి.
  • ఆ తర్వాత గిన్నెలో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు క్లాత్​పై కలిపి పెట్టుకున్న పిండిని సరిపడా వేసి చేతిని తడి చేసుకొని అప్పం మాదిరిగా క్లాత్ మొత్తం ఈక్వల్​గా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆపై స్టవ్ మీద ఉంచిన గిన్నెకు సరిపడా మరో బౌల్​ను మూతలా బోర్లించి మీడియం ఫ్లేమ్​లో 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక సారి మూత తీసి అది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక స్పూన్​తో గుచ్చి తీస్తే క్లీన్​గా వస్తే సరిగా ఉడికిందని తెలుసుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకట్రెండు నిమిషాలు ఆగి దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఆపై కీర కుడుముని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీరా దోస చట్నీతో కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "కీరా దోస కుడుము విత్ చట్నీ" రెడీ!
  • మిగిలిన పిండిని ఇదే ప్రాస్​స్​లో వీలైనన్ని ఆవిరి కుడుములు చేసుకొని కీరా దోస చట్నీతో కలిపి సర్వ్ చేసుకోవాలి.

అప్పటికప్పుడు టిఫెన్​ కావాలంటే - రెండే రెండు పదార్థాలతో "రవ్వ అప్పం" రెడీ - బ్రేక్​ఫాస్ట్​లోకి సూపర్!

పెరుగు, సోడా, పప్పు, నూనె లేకుండా - మెత్తని దూది లాంటి "దోశలు" - టమాటా చట్నీతో కిర్రాక్!