ETV Bharat / offbeat

"వెల్లుల్లి కారం బొరుగులు" చిటికెలో చేసుకోండి - ఈవెనింగ్​ స్నాక్స్​కు బెస్ట్​ ఆప్షన్​ - పిల్లలైతే ఇష్టంగా తింటారు! - EASY SNACK RECIPE FOR KIDS

సండే స్పెషల్ పిల్లల కోసం సూపర్ స్నాక్ రెసిపీ - ఇలా చేసి పెట్టారంటే రోజూ కావాలని అడగడం పక్కా!

Special Snack Recipe for Kids
Special Snack Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 6, 2025 at 11:55 AM IST

2 Min Read

Special Snack Recipe for Kids : పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి స్నాక్స్ కావాలి. కానీ, బజ్జీలు, బోండాలు చేయాలంటే వెంటనే సాధ్యం కాదు. ఇలాంటప్పుడు వెంటనే పూర్తయ్యే బ్రహ్మాండమైన స్నాక్ రెసిపీ మీకోసం తెచ్చాం. అదే, "వెల్లుల్లి కారం బొరుగులు". దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

SPICY GARLIC MURMURA
Putnalu (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • బొరుగులు - రెండు కప్పులు
  • పల్లీలు - మూడు స్పూన్లు
  • నూనె - మూడు స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • పుట్నాల పప్పు - కొద్దిగా
  • కారం - రెండు స్పూన్లు
  • జీలకర్ర - ఒక స్పూన్
  • పసుపు - కొద్దిగా
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఉప్పు - సరిపడా

అన్నం మిగిలిపోతే తాలింపన్నం కాదు - ఇలా "మంచూరియా" చేసుకోండి! - ఫాస్ట్​ ఫుడ్ సెంటర్​ను మించిన టేస్ట్​తో!

Special Snack Recipe
murmura (Getty Images)

సింపుల్​గా తయారు చేసుకోండిలా :

  • ముందుగా స్టౌ మీద మందపాటి కడాయిని పెట్టి, బొరుగులను వేసుకొని, క్రిస్పీగా మారే వరకు వేయించాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్​లోకి వేసుకోండి.
  • పొట్టు తీసిన వెల్లుల్లిని మిక్సీ​లో వేసుకొని, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకొని, కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద బొరుగులు వేయించిన కడాయి పెట్టి, ఆయిల్ వేసుకోవాలి. పల్లీలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి, పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత అదే ఆయిల్​లో కరివేపాకు వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
SPICY GARLIC MURMURA
Pallilu (Getty Images)
  • ఇప్పుడు అదే ఆయిల్​లో జీలకర్ర, ఆ తర్ఆవాత వెల్లుల్లి కారం మిశ్రమం వేసుకోవాలి.
  • లో-ఫ్లేమ్​లో పచ్చి వాసన పోయే దాకా వేయించి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. చివరగా పుట్నాల పప్పు వేసి నిమిషం వేయించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అన్నిటినీ బొరుగుల గిన్నెలో వేసి కలిపేయాలి. అంతే, అద్దిరిపోయే స్నాక్ రెడీ.
  • వాటిని గాలి చొరబడని గాజు సీసాలో దాచుకుంటే దాదాపు నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి.
  • తినే ముందు నిమ్మకాయ రసం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
Special Snack Recipe for Kids
Karivepaku (Getty Images)

ఈ టిప్స్​తో భలే రుచి :

  • ఇక్కడ బొరుగులను వేయించడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
  • కారం అనేది ఇక్కడ చెప్పిన కొలత ప్రకారమే కాకుండా మీ రుచికి తగిన విధంగా ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు.
  • ఈ బొరుగులు తినేటప్పుడు లైట్​గా నిమ్మరసం పిండుకుంటే మరింతి రుచికరంగా ఉంటాయి.

ఇవాళ పండగని మాంసం తేలేదా? - ఇలా "వెజ్ చికెన్" కర్రీ చేసుకోండి - సూపర్​ టేస్ట్​!

ఆడవాళ్లు తప్పక తినాల్సిన "స్వీట్" - వెయిట్​ లాస్​కి బెస్ట్ ఆప్షన్! - అమ్మమ్మల పద్ధతిలో ఇలా రెడీ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.