ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "వెజ్​ కీమా పులావ్​" - నాన్​వెజ్​ తిన్న ఫీలింగ్, ప్రిపరేషన్​ ఈజీ​!

-మీల్​మేకర్​తో ఎప్పుడూ కూరలే కాదు, ఇలా పులావ్​ చేసుకోండి, అద్దిరిపోతుంది!

Soya Kheema Pulao
Soya Kheema Pulao (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 9, 2025 at 5:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Soya Kheema Pulao: పులావ్​ అంటే అందరికీ ఇష్టమే. దీనికి సెపరేట్​ ఫ్యాన్​ బేస్​ ఉంటుంది. స్పైసీ స్పైసీగా ఉండే ఈ పులావ్​ను కమ్మని రైతాతో కలిపి తింటుంటే వచ్చే ఆ కిక్కే వేరు. ఇక పులావ్​లో చికెన్​, మటన్​, ప్రాన్స్​ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక మీల్​మేకర్లతో కూడా పులావ్​ చేసుకుంటుంటారు. మరి మీరు ఎప్పుడైనా వెజ్​ కీమా పులావ్​ తిన్నారా? లేదంటే మాత్రం ఓసారి ట్రై చేయండి. సూపర్​ టేస్టీగా ఉండి అద్దిరిపోతుంది. ఇప్పుడు శ్రావణమాసంలో నాన్​వెజ్​ తినని వారికి పర్ఫెక్ట్​. ప్రిపేర్​ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. మరి లేట్​ చేయకుండా సూపర్​ టేస్టీ అండ్​ స్పైసీ వెజ్​ కీమా పులావ్​ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Rice
బాస్మతీ బియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • సోయా గ్రాన్యుల్స్​- అర కప్పు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకు - 1
  • లవంగాలు - 4
  • యాలకులు - 3
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​స్పూన్​
  • టమాట - 1
  • ఉప్పు - సరిపడా
  • కారం - తగినంత
  • మిరియాల పొడి - అర టీస్పూన్​
  • గరం మసాలా - అర టీస్పూన్​
  • పుదీనా ఆకులు - కొన్ని
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • బాస్మతీ బియ్యం - 1 కప్పు
Soya Granules
సోయా గ్రాన్యుల్స్​ (ETV Bharat)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా వాటర్​ పోసి సుమారు అరగంట సేపు నానబెట్టాలి.
  • మరో గిన్నెలోకి రెండు కప్పుల వేడి నీరు తీసుకుని సోయా గ్రాన్యుల్స్​ వేసి కొద్దిసేపు నానబెట్టాలి. ఈలోపు పులావ్​కు అవసరమయ్యే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కనుంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి ఓ నిమిషం వేయించాలి.
Spices
బిర్యానీ దినుసులు (Getty Images)
  • ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి కుక్​ చేసుకోవాలి.
  • అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించాలి. అల్లం మగ్గిన తర్వాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  • టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యుల్స్​ను కొద్దికొద్దిగా తీసుకుంటూ నీళ్లు లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి.
Onions
ఉల్లిపాయలు (ETV Bharat)
  • ఆపై అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఒకటి ముప్పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో మరిగించుకోవాలి.
  • వాటర్​ బాయిల్​ అవుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి ఓసారి కలిపి మూత పెట్టి సిమ్​లోనే ఉడికించుకోవాలి.
  • పులావ్​ ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మూత తీసి పైన కొద్దిగా నెయ్యి, మరికొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఓ 5 నిమిషాలు వదిలేయాలి.
  • ఆ తర్వాత వేడివేడిగా ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుని రైతాతో తింటే సరి, ఎంతో రుచికరంగా ఉండే సోయా కీమా పులావ్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Soya Kheema Pulao
సోయా కీమా పులావ్​ (ETV Bharat)

చిట్కాలు:

  • సోయా గ్రాన్యుల్స్​ అన్ని సూపర్​ మార్కెట్స్​, కిరాణా షాపుల్లో లభిస్తాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీల్​మేకర్లను మిక్సీజార్​లో వేసి బరకగా గ్రైండ్​ చేసినా సరిపోతుంది.
  • ఈ పులావ్​ కోసం నార్మల్​ రైస్​ అయినా ఉపయోగించవచ్చు. ఒకవేళ నార్మల్​ రైస్​ వాడితో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్​ పోసుకోవాలి. అదే బాస్మతీ అయితే ఒక కప్పుకి ఒకటీ ముప్పావు కప్పు పోసుకోవాలి. అంటే పావు కప్పు తగ్గించి తీసుకోవాలి.

జొన్న పిండితో కమ్మని "పాన్​ కేక్స్​" - పావుగంటలో రెడీ - సూపర్​ టేస్టీ!

వరలక్ష్మీ వ్రతం కొబ్బరి చిప్పలతో - అద్దిరిపోయే "పచ్చడి" చేసుకోండి!