ETV Bharat / offbeat

మీ ఇడ్లీలు గట్టిగా ఉంటున్నాయా? - పిండిలో ఈ ఒక్కటి కలపండి చాలు - దూదిలా వస్తాయి! - HOW TO MAKE SOFT IDLI AT HOME

- ఇడ్లీలు సాఫ్ట్​గా, టేస్టీగా రావాలంటే సూపర్ టిప్ - ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి

How to Make Soft Idli at Home
How to Make Soft Idli at Home (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2025 at 2:01 PM IST

3 Min Read

How to Make Soft Idli at Home: ఇడ్లీలు చాలా మంది ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్. లైట్​గా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుండటంతో ఎక్కువ మంది వీటిని తినడానికే మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలోనే మెజార్టీ ఇళ్లల్లో ఇడ్లీలను ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే ఇంతవరకు బానే ఉన్నా వచ్చిన చిక్కంతా ఇడ్లీ తయారీలోనే ఉంది. ఎందుకంటే వీటిని పర్ఫెక్ట్​గా తయారు చేయడం చాలా మందికి రాదు. గట్టిగా రావడం, సరిగ్గా ఉడకకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు పిండిని ప్రిపేర్​ చేసే సమయంలో ఈ ఒక్కటీ కలిపితే పిండి బాగా పులిసి ఇడ్లీలు చాలా సాఫ్ట్​గా, అలా నోట్లే వేసుకోగానే ఇలా కరిగిపోయేలా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేసి ఆ సీక్రెట్​ ఏంటో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు:

  • మినప గుండ్లు - 1 కప్పు
  • సగ్గుబియ్యం - పావు కప్పు
  • ఇడ్లీ రవ్వ - రెండున్నర కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి మినప గుండ్లు, సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే చాలా మంది పప్పు ఎక్కువ నానితే పిండి అంత బాగుంటుందని అనుకుంటారు. కానీ పప్పు ఎక్కువసేపు నానితే అందులోని జిగురు పోయి ఇడ్లీలు గట్టిగా అవుతాయి. కాబట్టి 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • మరో గిన్నెలోకి రవ్వను కూడా తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి కలిపి దీనిని 5 గంటల సేపు నానబెట్టాలి.
  • ఇక్కడి వరకూ అందరూ చేసేదే. ఇడ్లీలు మెత్తగా రావాలంటే వీటితో పాటు మరో పదార్థాన్ని కూడా నానబెట్టుకోవాలి. అదే సోయా బీన్స్​. పప్పు, రవ్వతో పాటు ఓ గిన్నెలోకి ఓ టేబుల్​ స్పూన్​ సోయా బీన్స్​ తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి.
  • పప్పు, రవ్వ, సోయా బీన్స్​ నానిన తర్వాత మరోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
  • మిక్సీజార్​లోకి నానబెట్టిన సోయా బీన్స్​, మినప గుండ్లు మిశ్రమాన్ని వడకట్టి వేసుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న పిండిని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి.
  • ఇప్పుడు మినప పప్పు, ఇడ్లీ రవ్వను కలిపి ఓ 5 నిమిషాల పాటు చేతితో బీట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత పెట్టి సుమారు 8 గంటల పాటు రూమ్​ టెంపరేచర్​ వద్ద ఉంచాలి.
  • పిండి బాగా పులిసిన తర్వాత మూత తీసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్​లో నీటిని మరిగించుకోవాలి.
  • ఈలోపు ఇడ్లీ ప్లేట్స్​కు నూనె లేదా నెయ్యి అప్లై చేసుకుని పిండిని వేసుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్​ను పాత్రలో పెట్టి మూత పెట్టి మీడియం టూ హై ఫ్లేమ్​లో ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఓ 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్​ చేసుకుని పల్లీ చట్నీ, కారం పొడితో సర్వ్​ చేసుకుంటే ఎంతో సాఫ్ట్​గా ఉండే ఇడ్లీలు రెడీ. నచ్చితే ఓసారి ఇలా ట్రై చేయండి. ​

దోశ పిండితో సూపర్​ సాఫ్ట్​ "ఇడ్లీలు" - ఇలా చేసుకుంటే రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

రేషన్​ బియ్యంతో 'ఇడ్లీ రవ్వ' - ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండిలా! - ఇడ్లీలు సాఫ్ట్​గా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.