Bihar Election Results 2025

ETV Bharat / offbeat

రాత్రి మిగిలిన అన్నంతో - పొద్దున్నే ఇలా "దోశలు" వేయండి! - సూపర్ టేస్ట్!

- చద్దన్నంతో క్రిస్పీ అండ్ సూపర్ సాఫ్ట్ "దోశలు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే రెడీ!

Soft Dosa Recipe with Leftover Rice
Soft Dosa Recipe with Leftover Rice (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2025 at 3:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Soft Dosa Recipe with Leftover Rice : సాధారణంగా చాలా మంది ఇళ్లలో రాత్రి వండిన అన్నం మిగిలిపోతుంటుంది. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ మార్నింగ్ చద్దన్నం ఎవరు తింటారని దానితో తాలింపు వేసుకోవడం, ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి వెరైటీగా రాత్రి మిగిలిన అన్నంతో బ్రేక్​ఫాస్ట్​లోకి ఇలా "దోశలు" వేసుకోండి.

చద్దన్నంతో చేసిన ఈ దోశలు చాలా సాఫ్ట్​గా, మంచి రుచికరంగానూ ఉంటాయి. ఇంటిల్లిపాదికీ చాలా బాగా నచ్చుతాయి. పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తినేస్తారు. పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ టైమ్ కూడా పట్టదు. తక్కువ ఇంగ్రీడియంట్స్​తో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. మరి, చద్దన్నంతో రుచికరమైన దోశలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Dosa Recipe with Leftover Rice
అన్నం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మిగిలిన అన్నం - నాలుగు కప్పులు
  • బియ్యప్పిండి - రెండు కప్పులు
  • గోధుమపిండి - ఒక కప్పు
  • పెరుగు - రెండు కప్పులు
  • వంటసోడా - రెండు టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - కొద్దిగా(దోశపై వేసుకోవడానికి)

ఉప్మా రవ్వతో "గుంత పొంగనాలు" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - పల్లీ చట్నీతో కిర్రాక్​!

Dosa Recipe with Leftover Rice
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ దోశ రెసిపీ కోసం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి.
  • ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో అన్నం, బియ్యప్పిండి, గోధుమపిండి, పుల్లని పెరుగు వేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు వాటర్​ని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ పిండి అంత సులువుగా మెత్తగా గ్రైండ్ అవ్వదు. జిగురుతో ఆగిపోతుంటుంది. కాబట్టి, మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ కొద్దికొద్దిగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా గ్రైండ్ చేసుకోవాలి.
Dosa Recipe with Leftover Rice
గోధుమపిండి (Getty Images)
  • పిండిని ఆ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత అందులో వంటసోడా, రుచికి తగినంత ఉప్పు, అవసరం మేరకు తగినన్ని నీళ్లను పోసుకుని బాగా కలుపుతూ దోశకు కావాల్సిన విధంగా గరిటె జారుగా పిండిని రెడీ చేసుకోవాలి.
  • పిండి మిశ్రమాన్ని సరైన కన్సిస్టెన్సీలో సిద్ధం చేసుకున్నాక గిన్నెపై మూత ఉంచి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ లైట్​గా వేడెక్కాక ఐదారు డ్రాప్స్ ఆయిల్ వేసి వన్ సైడ్ కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయతో బాగా రుద్ది పెనంను బాగా వేడి కానివ్వాలి.
Dosa Recipe with Leftover Rice
ఉప్పు (Getty Images)
  • పాన్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద గరిటెడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసి మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే అట్టులా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి.
  • కాస్త మందపాటి దోశలా స్ప్రెడ్ చేసుకున్నాక అంచుల వెంట, మధ్యలో కొద్దిగా నూనె వేసి మీడియం ఫ్లేమ్​లో నిదానంగా కాలనివ్వాలి.
  • అది వన్​సైడ్ మంచిగా కాలిన తర్వాత గరిటెతో తిప్పేసి మరో వైపు కూడా ఒకట్రెండు నిమిషాలు లైట్​గా కాల్చుకోవాలి.
  • అలా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, మిగిలిన అన్నంతో సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ "దోశలు" మీ ముందు ఉంటాయి!
Dosa Recipe with Leftover Rice
పెరుగు (Getty Images)

చిట్కాలు :

  • ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతో మాత్రమే కాకుండా అప్పటికప్పుడు వండిన రైస్​తో కూడా రెడీ చేసుకోవచ్చు.
  • ఇక్కడ సాధ్యమైనంత వరకు పుల్లటి పెరుగును మాత్రమే వాడుకోవాలి. అప్పుడే దోశలు మంచిగా వస్తాయి. అలాగే, ఫ్రిడ్జ్​లో ఉంచిన చల్లని పెరుగును వాడకపోవడమే మంచిది.
  • ఈ దోశలను మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే వేసుకోవాలి. అలాగే, ఇవి కాలడానికి రెగ్యులర్​ వాటి కంటే కొద్దిగా ఎక్కువగానే టైమ్ పడుతుంది.

ఉలవలతో కరకరలాడే "దోశలు" - రెగ్యులర్​ వాటిని మించి టేస్టీగా!

మొక్కజొన్నతో గారెలు రొటీన్ - ఇలా "బూరెలు" చేయండి! - తియ్య తియ్యగా అద్దిరిపోతాయి!