ETV Bharat / offbeat

మామిడి కాయలతో "సూపర్​ టేస్టీ పూరీలు" - జిందగీలో తిని ఉండరు! - బెలూన్​లా పొంగుతాయి - SNACK RECIPE MANGO POORI

- మామిడితో ఎంతో రుచికరమైన పూరీలు! - ఒక్కసారి చేసుకుంటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు!

Snack Recipe Mango Poori
Snack Recipe Mango Poori (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 23, 2025 at 1:11 PM IST

2 Min Read

Snack Recipe Mango Poori: పూరీలు అంటే చాలా మందికి ఇష్టం. బెలూన్ల మాదిరి పొంగి, సాఫ్ట్​గా ఉండే వీటిని మెజార్టీ పీపుల్​ ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో తయారు చేసుకోవడం లేదంటే హోటల్స్​ నుంచి తెప్పించుకోవడం చేస్తుంటారు. ఇక పూరీలు చేయడం అంటే పిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి రోల్​ చేసి డీప్​ఫ్రై చేయడం. ఇది అందరికి తెలిసిందే. పైగా ఇవి కొంచెం ఉప్పగా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా ఓసారి ఉలా మ్యాంగో పూరీలు చేసుకోండి. సీజనల్​గా లభించే మామిడిపండ్లతో పూరీలు చేసుకుంటే టేస్ట్​ అద్దిరిపోతాయి. పైగా చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ పూరీలు పొంగడంతో పాటు గంటలపాటు సాఫ్ట్​గా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా మామిడికాయ పూరీలు ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమపిండి - 2 కప్పులు
  • ఉప్పు - చిటికెడు
  • మామిడి పండు - 1
  • యాలకులు పొడి - 1 టీస్పూన్​
  • బొంబాయి రవ్వ - పావు కప్పు
  • బెల్లం పొడి - పావు కప్పు
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
Mangoes
Mangoes (Getty Images)

తయారీ విధానం:

  • మామిడి పండును శుభ్రంగా కడిగి పై చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి మామిడి పండు ముక్కలను తీసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకుని ఓ బౌల్​లోకి తీసుకోవాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి గోధుమ పిండి, ఉప్పు, యాలకుల పొడి, బెల్లం పొడి, బొంబాయి రవ్వ వేసి ఓసారి బాగా కలపాలి.
  • ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న మ్యాంగో మిశ్రమం వేసుకుని పిండిని బాగా కలపాలి. ఇక్కడ పిండిని మామిడి గుజ్జుతో మాత్రమే కలిపేలా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మీ దగ్గర ఇంకా మామిడి పండ్లు ఉంటే గ్రైండ్​ చేసి వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకున్నా సరిపోతుంది.
Mango Poori
Mango Poori (ETV Bharat)
  • పిండిని మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. ఇలా మిక్స్​ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టాలి.
  • 20 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రై సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
Mango Poori
Mango Poori (ETV Bharat)
  • ఆయిల్​ హీట్​ అయ్యే లోపు చపాతీ పీట మీద ఓ ఉండను ఉంచి లైట్​గా ఆయిల్​ అప్లై చేసుకుంటూ పూరీలుగా రోల్​ చేసుకోవాలి.
  • ఇలా చేసుకున్న పూరీని కాగుతున్న నూనెలో వేసి లైట్​గా ప్రెస్​ చేస్తే మంచిగా పొంగుతుంది. ఇలా ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి.
Mango Poori
Mango Poori (ETV Bharat)
  • ఇలా పూరీ రెండు వైపులా కాలిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా ఒక్కో ఉండను పూరీలుగా వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి.
  • ఇలా కాల్చుకున్న పూరీలను విడిగా లేదంటే మామిడి గుజ్జుతో కలిపి తిన్నా అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
Mango Poori
Mango Poori (ETV Bharat)

టిప్స్​:

  • గోధుమపిండిని జల్లించి తీసుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్​గా వస్తాయి.
  • బెల్లం పొడి బదులు పంచదారను గ్రైండ్​ చేసుకున్న వేసుకున్న సరిపోతుంది.
  • నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పూరీలను కాల్చుకోవాలి. లేదంటే నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది.

మైదా పూరీలు వద్దండి - ఇలా 'రాగి పిండి'తో చేసుకోండి - నూనె పీల్చకుండా పొంగుతాయి!

హనుమంతుడికి "గుమ్మడి పూరీలు" - స్వామి జయంతికి అద్భుత ప్రసాదం! - అనాస పాయసం కూడా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.