ETV Bharat / offbeat

అప్పటికప్పుడు చేసుకునే కమ్మని "మసాలా వడలు" - తక్కువ నూనెతో కరకరలాడుతాయి!

- తోటకూర, స్వీట్​ కార్న్​తో అద్దిరిపోయే 'స్నాక్' రెసిపీ - పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా లాగిస్తారు!

Simple Snack Recipe for Kids
Simple Snack Recipe for Kids (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 31, 2025 at 6:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Simple Snack Recipe for Kids : సాయంకాలం టైమ్​లో వేడివేడిగా స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. అలాగే, బడి నుంచి వచ్చే పిల్లలూ ఈవెనింగ్ ఇంటికి రాగానే తినడానికి ఏమైనా ఉన్నాయా మమ్మీ అని అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు బయట నుంచి కొని తెచ్చియకుండా అప్పటికప్పుడు పిల్లలకు నచ్చేలా, నోటికి రుచిగా చేసుకునే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ ఉంది. అదే, తోటకూర, మొక్కజొన్న గింజలతో కరకరలాడే "మసాలా వడలు". వీటినే మసాలా గారెలు అని కూడా అంటారు. ఇవి మంచి రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎప్పుడూ మిర్చీ బజ్జీలు, పునుగులు, పకోడీ, బోండాలు వంటివి కాకుండా కాస్త వెరైటీగా ఈ మసాలా వడలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు అంటే ఇష్టపడని చిన్నారులకూ ఇవి నచ్చేస్తాయి. నూనెను కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! మరి, ఈ సూపర్ టేస్టీ మసాలా గారెలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Thotakura Corn Masala Vada
తోటకూర (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • తోటకూర కట్టలు - రెండు(చిన్న సైజ్​వి)
  • స్వీట్ కార్న్ - రెండు కప్పులు(పేస్ట్​ కోసం)
  • పచ్చిమిర్చి - నాలుగైదు
  • నాలుగు టేబుల్​స్పూన్లు - స్వీట్ కార్న్ గింజలు
  • ఉల్లిపాయలు - రెండు(మీడియం సైజ్​వి)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
  • కారం - రుచికి తగినంత
  • పసుపు - అరటీస్పూన్
  • జీలకర్ర పొడి - ఒకటీస్పూన్
  • గరంమసాలా - ఒకటీస్పూన్
  • శనగపిండి - నాలుగు టేబుల్​స్పూన్లు
  • బియ్యప్పిండి - ఐదు టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

ఘాటు ఘాటుగా "అల్లం చారు" - ఈ సీజన్​లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Thotakura Corn Masala Vada
మొక్కజొన్న గింజలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ స్నాక్ తయారీ కోసం ముందుగా తాజా తోటకూరను తీసుకొని వేర్ల భాగం కట్ చేసుకోవాలి. ఆపై సన్నగా తరుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడకట్టి పక్కనుంచాలి.
  • అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్​ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అంటే, ఒకట్రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది.
Thotakura Corn Masala Vada
పచ్చిమిర్చి (Getty Images)
  • తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో స్వీట్ కార్న్ గింజలు, సన్నగా కట్​ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నని కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  • అలాగే, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, శనగపిండి, బియ్యప్పిండి, రుచికి తగినంత ఉప్పు ఇలా ఇంగ్రీడియండ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ చక్కగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. తోటకూరలో ఉన్న తేమనే సరిపోతుంది. ఒకవేళ మరీ లూజుగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి లేదా శనగపిండిని యాడ్ చేసుకొని పిండిని మెత్తని ముద్దలా రెడీ చేసుకోవాలి.

అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!

Thotakura Corn Masala Vada
ఉల్లిపాయలు (Getty Images)
  • ఇప్పుడు కలిపిన పిండిలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో చిన్న చిన్న మసాలా వడల్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్​లో పెట్టుకొని పక్కనుంచాలి. ఇలానే పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మంటను తగ్గించి ముందుగా రెడీ చేసుకున్న వడలు లేదా గారెలను పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకోవాలి.
Thotakura Corn Masala Vada
ఉల్లిపాయలు (Getty Images)
  • సరిపడినన్ని వేసుకున్నాక వెంటనే కదపకుండా కొద్దిగా కాలనిచ్చి ఆపై చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
  • అంతే, మొక్కజొన్న, తోటకూర కాంబోలో పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా రుచికరమైన "మసాలా వడలు" మీ ముందు ఉంటాయి!
Thotakura Corn Masala Vada
బియ్యప్పిండి (Getty Images)

సీజన్ స్పెషల్ : నోరూరించే "మొక్కజొన్న మెంతికూర కర్రీ" - వేడివేడి అన్నంలోకి అద్భుతం!