ETV Bharat / offbeat

ఇంట్లో ఒక్క కూరగాయలేకున్నా - నిమిషాల్లో సూపర్ "కర్రీ"! - ఇలా చేసుకోండి - EASY AND TASTY PERUGU CURRY

నోరూరించే కమ్మని "మసాలా పెరుగు కూర" - నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Curd Curry
Delicious Curd Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 7, 2025 at 4:09 PM IST

Updated : April 10, 2025 at 7:11 PM IST

2 Min Read

Make Delicious Curd Curry at Home : భోజనం సమయానికి ఇంట్లో తగిన కూర లేకపోతే ఎంతో చిరాగ్గా ఉంటుంది. మళ్లీ కర్రీ చేయాలంటే అదో పెద్ద కష్టం. ఇలాంటి సందర్భాల్లో వెంటనే చేసుకునే రెసిపీ ఉంది. అదే కమ్మని "పెరుగు కర్రీ". మరి, కూరగాయలు లేకుండానే చేసే ఈ కర్రీ ఎలా తయారవుతుందో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెరుగు - ఒక కప్పు
  • శనగపిండి - ఒక స్పూన్
  • నూనె - మూడు స్పూన్లు
  • పసుపు - పావు స్పూన్
  • ధనియాల పొడి - అర స్పూన్
  • కారం - ఒక స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • గరం మసాలా - పావు స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - తగినంత

రుబ్బిన దోశ/ఇడ్లీ పిండిని ఎన్ని రోజులు వాడాలో మీకు తెలుసా? - ఎక్కువగా పులియకూడదంటే ఈ టిప్స్​ బెస్ట్​!

తయారీ విధానమిలా :

  • కడాయిలో నూనె వేసి, వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడే దాకా చూడాలి.
  • ఇప్పుడు శనగపిండిని వేసుకొని, ఉండలు కట్టకుండా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి.
  • ఇప్పుడు స్టౌ సిమ్​లో పెట్టి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, మసాలా వేసుకోవాలి.
  • మసాలాలన్నింటినీ నూనెలో చక్కగా కలపాలి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​కి పెంచి, పెరుగు వేసి, ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి.
  • పెరుగు వేశాక కూర చిక్కబడటం మొదలవ్వుద్ది. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే దాకా ఉడికించాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర చల్లి, స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నోరూరించే "కమ్మని పెరుగు కూర" సిద్ధమై పోతుంది.
  • నచ్చితే తప్పుకుండా ట్రై చేయండి. చపాతీ, అన్నం, రోటీలోకి చాలా బాగుంటుంది.

టిప్స్ :

  • ఇక్కడ పెరుగును చెప్పిన పరిమాణంలో కంటే కాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అయితే, పెరుగు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది.
  • అలాగే, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవడం వద్దనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కూర మంచి కలర్​ఫుల్​గా కనిపించడానికి ఇది తోడ్పడుతుంది.
  • ఇక్కడ శనగపిండిని వేయించేటప్పుడు కలుపుతూ ఉండడం చాలా ముఖ్యం. లేదంటే పిండి అడుగంటుకుపోతుందని గుర్తుంచుకోవాలి.
  • చివర్లో కొత్తిమీర తరుగు వేయడం వల్ల కూరకు మంచి రుచి, సువాసన వస్తుంది.

ఈ సమ్మర్​లో చారు ఉండాల్సిందే - ఈ పద్ధతిలో చేయండి - ఏకంగా రసం తాగేస్తారు!

ఆడవాళ్లు తప్పక తినాల్సిన "స్వీట్" - వెయిట్​ లాస్​కి బెస్ట్ ఆప్షన్! - అమ్మమ్మల పద్ధతిలో ఇలా రెడీ చేసుకోండి!

Last Updated : April 10, 2025 at 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.