Siblings Day 2025 : మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, లవర్స్ డే ఉన్నట్లే తోబుట్టువుల దినోత్సవం కూడా ఉందని మీకు తెలుసా? ఎన్నో రకాల దినోత్సవాలు ఉన్నట్టే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న 'తోబుట్టువుల దినోత్సవం' (Siblings Day) ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో తోబుట్టువుల పాత్ర వెలకట్టలేనిది. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరు కలిసి మెలసి ఉంటారు. కష్టాల్లో ఉన్నపుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఆనందాలు కలిసి పంచుకుంటారు.
"టాటూ వేసుకుంటే రక్తదానం చేయకూడదా? - షుగర్ పేషెంట్లు రక్తం ఇవ్వొచ్చా?!"
"సిబ్లింగ్స్ డే" సందర్భంగా మీ తోబుట్టువులతో మీకున్న అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకోవడమే కాదు మీ బంధం జీవితాంతం దృఢంగా కొనసాగాలని కోరుకుంటూ ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన కొటేషన్ సెలెక్ట్ చేసుకొని పంపించండి.

- "తల్లిలా ప్రేమ, అప్యాయతలను పంచేది అక్కా చెల్లెల్లు! తండ్రిలా భుజాలపై బాధ్యతలు మోసేది అన్నా తమ్ముళ్లు ఇలాంటి వారందరికీ.." -హ్యాపీ సిబ్లింగ్స్ డే 2025
- "డబ్బుంటే ఎంతో మంది బంధువులు వస్తారు. వారి అవసరాలు తీరేవారకూ ఎంతో ప్రేమగా నటిస్తారు. కానీ, డబ్బులతో సంబంధం లేకుండా కలకాలం ప్రేమ, అప్యాయతలను పంచే వారే తోబుట్టువులు.." - హ్యాపీ సిబ్లింగ్స్ డే
- "బాధలో అయినా, సంతోషంలో అయినా, ఎవరు నీతో ఉన్నా, లేకున్నా కలకాలం నీ వెంట నేను ఉంటా" - హ్యాపీ సిబ్లింగ్స్ డే
- "అమ్మ కడుపు నుంచి ప్రాణం పోసుకున్న మన బంధం ప్రాణం పోయే వరకూ కొనసాగాలని కోరుకుంటూ" - తోబుట్టువుల దినోత్సవ శుభాకాంక్షలు
- "నా బాధలు నీతో పంచుకుంటే మాయమైపోతాయి, నా సంతోషం నీతో షేర్ చేసుకుంటే డబుల్ అయిపోతుంది. - హ్యాపీ సిబ్లింగ్స్ డే
ఏప్రిల్ 10 తోబుట్టువుల జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైంది. ఇది అతి ముఖ్యమైన, తోబుట్టువుల అనుబంధాన్ని స్మరించుకునే రోజు. ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు జీవితంలోని మొదటి స్నేహితులు కాబట్టి వారు కలిసి పెరిగి, చిన్ననాటి జ్ఞాపకాలనూ, కష్టసుఖాలనూ పంచుకుంటారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అల్లరి మాటలు, గొడవలు ఎంత నిజమో అంతే వేగంగా మళ్లీ కలిసిపోతారన్నదీ అంతే నిజం. తల్లిదండ్రుల తర్వాత మనకు అతి దగ్గరయ్యే వారు మన తోబుట్టువులే అని గుర్తుంచుకోవాలి.

జాతీయ తోబుట్టువుల దినోత్సవం మన అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ముళ్ల అనుంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, వారిని గౌరవించేందుకు ఇదొక చక్కని అవకాశం. ఈ రోజున ప్రజలు తమ తోబుట్టువులకు చిన్నచిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు వాళ్లతో సమయాన్ని గడుపుతూ, తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు అనే విషయంలో ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాలు జరిగినా చిన్న పిల్లలపట్ల సానుభూతి చూపుతారని, ఈ కారణంతో ఇంట్లో చిన్నవారే ఎక్కువగా గారాబంగా తయారవుతారని తేల్చాయి.
భార్య, భర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నారా? - తెలుసుకోవడం ఎలాగంటే!
కంటి కింద నలుపొస్తే కారణం అదే - నల్లని వలయాలు పోగొట్టుకునే చిట్కాలివే!