WHO DONATE BLOOD : టాటూ వేయించుకున్న వాళ్లు, చెవి కుట్టించుకున్న వాళ్లు రక్తదానం చేయకూడదా? డయాబెటిస్ పేషెంట్లు, బీపీ తో బాధపడుతున్న వారు, పొగతాగే అలవాటు ఉన్న వారు రక్తదానానికి అనర్హులా? అనే అనే విషయంలో ఎన్నో అపోహలున్నాయి. వాస్తవానికి రక్తదానం విషయంలో ఉన్న అనేక అపోహలు, అనేకానేక సందేహాలకు సమాధానం కోసం వెతుకున్నట్లయితే మీరు ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
"భార్య పక్కనే ఉన్నా అదే ధ్యాస!" - మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న "ఫబ్బింగ్"
అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు, లక్షన్నర మరణాలు నమోదవుతున్నాయి. అధిక శాతం క్షతగాత్రులు తీవ్ర రక్తస్రావంతో, సమయానికి రక్తం అందక కన్నుమూస్తున్నారు.
ఇక రక్తహీనత సమస్య, అధిక రక్తస్రావం కావడంతో ఎందరో గర్భవతులు కాన్పు సమయంలో చనిపోతున్నారు. ఇక తలసేమియా వ్యాధి గ్రస్తులకు జీవితాంతం తరుచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రక్తదానం ఆవశ్యకత, అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం.

రక్తంలో ముఖ్యంగా మూడు రకాల రక్త కణాలు (ఎర్ర, తెల్ల, ప్లేట్‌లెట్లు) ఉంటాయి.
ఎర్ర రక్త కణాలు (Red Blood Cells లేదా RBCs)ను ఎరిత్రోసైట్లు అని కూడా అంటారు. ఇవి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి.
తెల్ల రక్త కణాలు (White Blood Cells లేదా WBCs)ను ల్యూకోసైట్లు అని కూడా అంటారు. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిచడంతో పాటు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారి నుంచి దేహానికి రక్షణగా ఉంటాయి. ఇవి న్యూట్రోఫిల్స్, లింఫోసైట్లు, మోనోసైట్లు, ఇసినోఫిల్స్, బాసోఫిల్స్ అని మరికొన్ని రకాలుంటాయి.
ఇక మూడో రకమైన రక్త ఫలకికలు (Blood Platelets)ను థ్రోంబోసైట్లు అని కూడా అంటారు. ఇవి రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో గాయాలైనప్పుడు రక్తస్రావం ఆగడానికి సహాయపడతాయి.

ఎవరు రక్తదానం చేయకూడదో తెలుసా?
- ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయో వృద్ధులు తప్ప మిగిలినవారంతా రక్తం దానం చేయవచ్చని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
- 18నుంచి 65 ఏళ్ల లోపు వయస్సున్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయొచ్చు.
- హీమోగ్లోబిన్ శాతం 12.5 గ్రాములకు మించి ఉన్నవారు రక్తదానం చేయొచ్చు.
- రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు (హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి) వ్యాధులు లేనివారు రక్తదానం చేయడానికి అర్హులు.
- గుండె సంబంధిత లేదా క్యాన్సర్ వంటి ఇతర తీవ్ర అనారోగ్యాలు లేని వారు, ధూమపానం చేసే వారు కూడా రక్తదానం చేయవచ్చు.
- దీర్ఘ కాలిక జబ్బులకు మందులు వాడుతున్న వారు రక్తదానానికి అర్హులా, కాదా? అనే విషయాన్ని మాత్రం వైద్యులు నిర్ణయిస్తారు.

సురక్షితమైన సూదితో పచ్చబొట్టు (టాటూ) వేసుకున్న వారు రక్తదానం చేయొచ్చు (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కానీ, అసురక్షిత పద్ధతుల్లో, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో తెలిసే వరకు అంటే కనీం 3 నెలల నుంచి సంవత్సరం వరకు వేచి చూడడం మంచిది.
- మధుమేహానికి మందులు వాడుతున్నవారు తమకు ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేకపోతే రక్తదానం చేయవచ్చు. కానీ, ఇన్సులిన్ తీసుకుంటున్న వారు రక్తదానం చేయడానికి అనర్హులు.
- డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్, పోలియో ఇంజెక్షన్, హెచ్‌పీవీ టీకాలు తీసుకుంటే రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చు.
టాటూ, చెవి కుట్టించుకుంటే రక్తదానం చేయకూడదనేది అపోహ మాత్రమే. లైసెన్స్ ఉన్న షాప్‌ల్లో మీరు టాటూ వేయించుకున్నా, ముక్కు, చెవి కుట్టించుకున్నా రక్తదానం చేయడానికి కొంత సమయం తీసుకోవాలి. టాటూ కోసం ఉపయోగించే సూదులు లేదా పరికరాలు స్టెరైల్‌గా ఉండటం చూసుకోవడం చాలా అవసరం. రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రహీతలకే మాత్రమే కాకుండా దాతలకూ ఇది మేలు చేస్తుంది. ప్రాణాల్ని కాపాడేందుకు ప్రతి రక్తపు చుక్కా ముఖ్యమైనదే. - డాక్టర్ అంజలీ హజారికా
ఎన్ని రోజులకు ఒకసారి రక్త దానం చేయవచ్చు?
- సహజంగా రక్తదాతల నుంచి ఒక యూనిట్ (350 మి.లీ.) రక్తం సేకరిస్తుంటారు.
- ఆరోగ్యవంతులైన పురుషులు 3 నెలలకు, మహిళలు 4 నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. ప్లేట్‌లెట్లు ప్రతీ వారం చొప్పున సంవత్సరానికి 24 సార్లు దానం చేయవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఆరుబయట పండ్లరసాలు తాగితే గొంతు నొప్పిగా ఉంటోందా? - అయితే, "అదే కారణం" కావచ్చంటున్న వైద్యులు!
ఎక్కువ దూరం నడవాల్సిన అవసరమే లేదు! - "సిద్ధ నడక" స్టెప్ ఫాలో అయితే చాలు!