ETV Bharat / offbeat

సేమియాతో పాయసం రొటీన్​ - ఇలా "దద్దోజనం" చేసుకోండి - 5 నిమిషాల్లో సిద్ధం - బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​కు పర్ఫెక్ట్​! - TASTY AND HEALTHY SEMIYA CURD BATH

-అద్దిరిపోయే టేస్టీ సేమియా దద్దోజనం -అతి తక్కువ సమయంలో ప్రిపేర్​ చేసుకోవచ్చు!

Healthy Semiya Curd Bath
Healthy Semiya Curd Bath (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2025 at 7:11 PM IST

3 Min Read

Tasty and Healthy Semiya Curd Bath: "దద్దోజనం" - తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. పండగలు, పూజలు, వ్రతాల సమయంలో ఎక్కువ మంది దీనిని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ప్రిపేర్​ చేసుకుని తింటుంటారు. అయితే సాధారణంగా దద్దోజనం చేయాలంటే అన్నం వండి అందులో పెరుగు కలిపి పోపు పెడుతుంటారు. అయితే ఎప్పుడూ అన్నంతో కాకుండా ఓసారి సేమియాతో చేయండి. టేస్ట్​ చాలా బాగుంటుంది. ఏంటీ సేమియాతో దద్దోజనం అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. సేమియాతో ఎప్పుడూ పాయసం, పులిహోర, ఉప్మా కాకుండా ఇలా దద్దోజనం చేసుకోండి. ఎన్నడూ తినని రుచితో అద్దిరిపోతుంది. పైగా ప్రిపేర్​ చేసుకోవడం చాలా సులభం. మరి లేట్​ చేయకుండా ఈ సేమియా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • సేమియా - 1 కప్పు
  • పెరుగు - 250ml
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - కొద్దిగా
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • శనగపప్పు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు - 1 టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 1
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కీర దోసకాయ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - అర చెంచా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • దానిమ్మ గింజలు - కొన్ని
Semiya Curd Bath
Semiya Curd Bath (ETV Bharat)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి సుమారు లీటర్​ నీళ్లు పోసి వేడి చేయాలి. వాటర్​ బాగా మరుగుతున్నప్పుడు సేమియా వేసి జస్ట్​ 1 నిమిషం ఉడికించి తీసేయాలి.
  • ఇలా ఉడికించిన సేమియాను జల్లెడలో పోసి వడకట్టాలి. ఆపై వెంటనే చల్లని నీళ్లు పోసి వడకట్టి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు కీర దోసకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి సన్నగా తురుమి పక్కన ఉంచాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా సన్నగా కట్​ చేసుకోవాలి.
Semiya Curd Bath
Semiya Curd Bath (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
  • తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
Semiya Curd Bath
Semiya Curd Bath (ETV Bharat)
  • ఓ గిన్నెలోకి పెరుగు, కీర దోస తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్​ చేసుకోవాలి. ఆపై అందులోకి ఉడికించిన సేమ్యా వేసి మరోసారి కలపాలి.
  • చివరగా తాలింపు మిశ్రమం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలు, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలిపి సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీగా ఉండే సేమియా దద్దోజనం రెడీ. ఇది బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​కు పర్ఫెక్ట్​గా సూట్​ అవుతుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Semiya Curd Bath
Semiya Curd Bath (ETV Bharat)

చిట్కాలు:

  • వాటర్​ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే సేమియా వేయాలి. అలాగే సేమియాను మరీ మెత్తగా ఉడికించకుండా కేవలం 80 శాతం ఉడికిస్తే సరిపోతుంది.
  • తాజా పెరుగు అయితే దద్దోజనం రుచి బాగుంటుంది. పుల్లటి పెరుగు అస్సలు వాడొద్దు. అలాగే సేమియా ఎంత తీసుకుంటే దానికి డబుల్​ క్వాంటిటీలో పెరుగు తీసుకోవాలి.
  • మిరియాల పొడిని అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి. ఒకవేళ అలా కుదరకపోతే తాలింపులో మిరియాలు వేసి ఫ్రై చేసుకోవచ్చు.
  • కేవలం కీరదోస తురుము మాత్రమే కాకుండా క్యారెట్​ తురుము కూడా కలుపుకోవచ్చు.
Semiya Curd Bath
Semiya Curd Bath (ETV Bharat)

ఈ పొడి ఉంటే క్షణాల్లో "సోంపు షర్బత్​" - వేసవిలో ఒక్క గ్లాస్​ తాగితే ఫుల్​ రిలీఫ్ ​- ప్రిపరేషన్​ వెరీ ఈజీ!

కమ్మని "మ్యాంగో పాయసం" - నిమిషాల్లో రెడీ - ఒక్కసారి తింటే జిందగీ ఫుల్​ ఖుష్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.