ETV Bharat / offbeat

"సెమీ గ్రేవీ చేపల వేపుడు" - ఒక్క సారైనా ఇలాంటి రుచి ఆస్వాదించాల్సిందే - చేప ముక్క భలే రుచిగా ఉంటుంది! - SEMI GRAVY FISH FRY

"ఫిష్​ ఫ్రై" అందరూ చేస్తారు - కానీ, కొత్తగా ఇలా చేయండి రుచి అద్దిరిపోతుంది!

Semi Gravy Fish Fry in Telugu
Semi Gravy Fish Fry in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 1, 2025 at 12:05 PM IST

3 Min Read

Semi Gravy Fish Fry in Telugu : నాన్​వెజ్​ ప్రియులు ఫిష్​ పులుసు ఎంత ఇష్టంగా తింటారో చేపల వేపుడు ఓ పట్టు పట్టేస్తారు. చేపల పులుసు కోసం వాటిని మ్యారినేట్ చేసిన తర్వాత మంచి ముక్కలను పాన్​లో కాస్త నూనె వేసి ఫ్రై చేస్తుంటారు. కారం, మసాలాలతో ఈ ఫిష్​ ఫ్రై అలాగే తింటుంటారు. అయితే, ఈ చేప ముక్కలను ఫ్రై చేసిన తర్వాత ఇలా గ్రేవీతో వేపుడు చేయండి. టేస్ట్​ వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది. ఈ సెమీ గ్రేవీ చేపల వేపుడు ఒక్కటి ఉంటే చాలు అన్నం తృప్తిగా తినొచ్చు. పైగా ఈ చేపల వేపుడు చేయడం కూడా చాలా ఈజీ. మరి సింపుల్​గా సెమీ గ్రేవీ చేపల వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

హోటల్​ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!

Fish
Fish (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • చేప ముక్కలు - కేజీ
  • 6 టేబుల్​స్పూన్లు - ఆయిల్
  • ఉప్పు, కారం - రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు - 3
  • కరివేపాకు - 4
  • టీస్పూన్ - అల్లం వెల్లుల్లి పేస్ట్
  • అరటీస్పూన్ - పసుపు
  • టీస్పూన్ - ధనియాలపొడి
  • టీస్పూన్​ - జీలకర్ర పొడి
  • పచ్చిమిర్చి - 3
Semi Gravy Fish Fry
Semi Gravy Fish Fry (ETV Bharat)

మ్యారినేషన్ మసాలా ప్రిపేర్​ చేయడం కోసం

  • 2 టీస్పూన్లు - అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • రుచికి సరిపడా కారం, ఉప్పు
  • టీస్పూన్ - పసుపు
  • ధనియాలపొడి - టేబుల్​స్పూన్​
Semi Gravy Fish Fry
Semi Gravy Fish Fry (ETV Bharat)

తయారీ విధానం

  • ముందుగా చేప ముక్కలు ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆపై రెండుమూడు సార్లు నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేపలను ఉప్పు, నిమ్మరసంతో కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి.
  • మసాలా ప్రిపేర్​ చేయడం కోసం ఒక ప్లేట్లో 2 టీస్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, ఉప్పు, టీస్పూన్ పసుపు, ధనియాలపొడి టేబుల్​స్పూన్​ వేసి కొద్దిగా నూనె వేసి పేస్ట్​లాగా కలుపుకోవాలి. పేస్ట్ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్​ వేసి కలుపుకోవచ్చు.
Semi Gravy Fish Fry
Semi Gravy Fish Fry (ETV Bharat)
  • ఈ మసాలా పేస్ట్​ని చేప ముక్కలకు పట్టించాలి. మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీ చేపల ఫ్రైలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి 6 టేబుల్​స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఈ గ్రేవీకి ఆయిల్​ కాస్త ఎక్కువగానే పడుతుంది.
Semi Gravy Fish Fry
Semi Gravy Fish Fry (ETV Bharat)
  • ఆయిల్​ వేడయ్యాక స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు వేడివేడి నూనెలో చేప ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • చేప ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేయండి. చేప ముక్కలు ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపు తిప్పి కాల్చుకోవాలి. చేపలను క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు పాన్​లోని అదే నూనెలో గ్రైండ్ చేసిన ఆనియన్​ పేస్ట్ వేసి నిమిషంపాటు ఫ్రై చేసుకోవాలి.
Semi Gravy Fish Fry
Semi Gravy Fish Fry (ETV Bharat)
  • ఆపై టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, టీస్పూన్ ధనియాలపొడి, టీస్పూన్​ జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలపాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి నిదానంగా కలుపుకోవాలి. చివరిగా చేపల ఫ్రైలో కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్​ టేస్టీగా గ్రేవీతో ఉండే చేపల వేపుడు మీ ముందుంటుంది.
  • ఈ సెమీ గ్రేవీ ఫిష్​ ఫ్రై తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి!

కరకరలాడే "అలసంద వడలు" - పిండి ఇలా కలిపితే టేస్టీ మరియు క్రిస్పీ!

చేపల పులుసు కమ్మగా ఉండాలా - ఈ "మసాలా దినుసులు" యాడ్​ చేస్తే అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.