ETV Bharat / offbeat

పిల్లలు స్నాక్స్​ కావాలని గోల చేస్తున్నారా? - ఇలా "బియ్యప్పిండి చెగోడీలు" చేయండి- నూనె పీల్చకుండా గుల్లగా, ఎక్ట్స్రా క్రిస్పీగా! - RICE FLOUR CHEGODILU

ఇంట్లోనే స్వీట్​ షాప్​ స్టైల్​ చెగోడీలు - ఇలా చేస్తే కరకరలాడుతూ టేస్ట్​ అద్దిరిపోతాయి!

Rice Flour Chegodilu
Rice Flour Chegodilu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 9, 2025 at 11:18 AM IST

3 Min Read

Rice Flour Chegodilu: ప్రస్తుతం పిల్లలకు హాఫ్​ డే స్కూల్స్​ రన్​ అవుతున్నాయి. ఇక స్కూల్​ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్​ పెట్టమని గోల చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది అమ్మలు బేకరీ, బయట షాప్స్​ నుంచి పలు రకాల స్నాక్స్​ కొని తీసుకొస్తుంటారు. అయితే అవి పట్టుమని పది రోజులు ఉండవు. ఇలా ఊరికే కొనాలంటే డబ్బులు ఎక్కువ మొత్తంలో కావాలి. పైగా అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాంటి క్రమంలో ఇంట్లోనే ఎంతో రుచికరమైనవి చేసుకుంటే ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తినొచ్చు. అందుకే మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే చెగోడీలు.

సాధారణంగా బయట లభించే చెగోడీలు మైదా, డాల్డాతో తయారవుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇవేమి లేకుండా కేవలం ఇంట్లో లభించే అతి తక్కువ పదార్థాలతో క్రిస్పీ అండ్​ టేస్టీ బియ్యప్పిండి చెగోడీలు చేసుకోవచ్చు. ఇవి స్నాక్స్​గా,​ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, పండగల సమయాల్లో చేసుకునేందుకు బెస్ట్​ ఆప్షన్​. పైగా ఇవి టేస్ట్​లో స్వీట్​ షాప్​ స్టైల్​ను మించి ఉంటాయి. మరి, లేట్​ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యప్పిండి - 2 కప్పులు
  • పెసరపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • శనగపిండి - 2 టేబుల్​ స్పూన్లు
  • నీళ్లు - 2 కప్పులు
  • కారం - 1 టీ స్పూన్​
  • వాము - 1 టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్​ సోడా - పావు టీ స్పూన్​
  • నూనె లేదా బటర్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
Rice Flour
Rice Flour (Getty Images)

తయారీ విధానం:

  • ఓ ప్లేట్​లోకి బియ్యప్పిండి తీసుకోవాలి. అయితే ఇందుకోసం రెడిమేడ్​గా లభించేది కాకుండా, ఇంట్లోనే తయారు చేసుకున్నది వాడితే చెగోడీలు రుచికరంగా వస్తాయి. అందుకోసం బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకుని, మెత్తగా గ్రైండ్​ చేసి తీసుకోవాలి.
  • బియ్యప్పిండి తీసుకున్న ప్లేట్​లోకి శనగపిండి వేసి కలిపి పక్కన ఉంచాలి.
  • ఆ తర్వాత పెసరపప్పును శుభ్రంగా కడిగి ఓ అరగంట సేపు నానబెట్టుకోవాలి.
  • ఈ పదార్థాలన్నీ రెడీగా ఉన్న తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నీళ్లు అనేవి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి.
  • నానబెట్టిన పెసరపప్పును వేసి కలుపుకోనావి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, బేకింగ్​ సోడా, నూనె లేదా బటర్​ వేసి బాగా కలిపి మరిగించుకోవాలి.
  • నీరు మరగడం స్టార్ట్​ అయినప్పుడు అందులోకి బియ్యం పిండి వేసి స్టవ్​ ఆఫ్​ చేసి బాగా కలుపుకోవాలి.
Rice Flour Chegodilu
Rice Flour Chegodilu (ETV Bharat)
  • అనంతరం మూత పెట్టి చల్లారే వరకు పక్కన ఉంచాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ పిండి కలిపేటప్పుడు పొడిపొడిగా అనిపిస్తే చేతికి తడి చేసుకుని కలుపుకుంటే పిండి మెత్తగా వస్తుంది.
  • ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకోవాలి. ఆపై మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టాలి.
  • ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉండను ఏదైనా టేబుల్​ లేదా చపాతీ పీట మీద పెట్టి అరచేతితో నలుపుతూ ఒకే సైజ్​లో పొడుగ్గా చేసుకోవాలి.
  • అలా పొడుగ్గా చేసుకున్న తర్వాత దాన్ని చేతి వేలుకుని చుట్టుకుని చెగోడీలు షేప్​లో చేసుకుని రెండు అంచులను ఊడిపోకుండా అతికించాలి.
Rice Flour Chegodilu
Rice Flour Chegodilu (ETV Bharat)
  • ఇలా చేసిన చెగోడీలను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చెగోడీలుగా చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి ముందుగానే చేసుకున్న చెగోడీలను వేసి ఓ రెండు నిమిషాల వరకు కదపకుండా ఫ్రై చేసి, ఆ తర్వాత నిదానంగా కలుపుతూ రెండు వైపులా గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా చెగోడీలన్నింటినీ నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే కరకరలాడుతూ సూపర్​ టేస్టీగా ఉండే బియ్యప్పిండి చెగోడీలు రెడీ.
  • నచ్చితే మీరూ ఇవి తయారు చేసి మీ పిల్లలకు తినిపించండి.
Rice Flour Chegodilu
Rice Flour Chegodilu (ETV Bharat)

టిప్స్​:

  • కొంతమంది పిండిలో కొద్దిగా ఇంగువ కూడా వేస్తారు, ఇది మంచి రుచిని ఇస్తుంది.
  • నూనె సరైన వేడిలో ఉండాలి. మరీ తక్కువ వేడిలో వేస్తే మెత్తగా వస్తాయి, మరీ ఎక్కువ వేడిలో వేస్తే త్వరగా రంగు మారి లోపల పచ్చిగా ఉంటాయి.
  • వేయించిన చెగోడీలను నూనె నుండి తీసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోండి. ఇది అదనపు నూనెను పీల్చుకుంటుంది.
  • చెగోడీలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.
Rice Flour Chegodilu
Rice Flour Chegodilu (ETV Bharat)

"వెల్లుల్లి కారం బొరుగులు" చిటికెలో చేసుకోండి - ఈవెనింగ్​ స్నాక్స్​కు బెస్ట్​ ఆప్షన్​ - పిల్లలైతే ఇష్టంగా తింటారు!

ఐపీఎల్ చూస్తూ చెత్త చిప్స్ తింటున్నారా? - ఈ హెల్దీ "స్నాక్స్" ముందు పెట్టుకోండి - థ్రిల్​ డబుల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.