RIBBAN PAKODI RECIPE IN TELUGU : కారపూస, రిబ్బన్ పకోడీ లాంటివి స్నాక్స్‌లోకి ఎంతో బాగుంటాయి. పిల్లల లంచ్ బాక్స్ తో పాటు ఇవి కూడా కొద్దిగా పెట్టి పంపిస్తే అన్నంలోకి కలుపుకొని బాక్స్ మొత్తం కంప్లీట్ చేస్తారు. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పిల్లల కోసం రిబ్బన్ పకోడీ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. కరెక్ట్ కొలతలతో క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇపుడు తెలుసుకుందాం.
పాలు విరగకుండా పరమాన్నం - ఈ టిప్‌తో చేస్తే పాయసం ఎన్ని గంటలైనా గట్టిపడదు!
- ఇలా చేయండి :
- బియ్యం పిండి ఎక్కువగా వాడితే క్రిస్పీగా ఉంటాయి.
- బియ్యం పిండి, శనగ పిండి రెండూ సమానంగా తీసుకోవచ్చు.
- పకోడీ వేయడానికి ముందు నూనె బాగా వేడెక్కాలి.

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం పిండి - 3 కప్పులు
- శనగ పిండి - 1 కప్పు
- పసుపు - పావు టీ స్పూన్
- వాము - టీ స్పూన్
- ఉప్పు - టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- వెన్న లేదా వేడి నూనె - పావు కప్పు

తయారీ విధానం :
- ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 3 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగ పిండి తీసుకోవాలి. మీరు శనగ పిండి ఎక్కువగా తీసుకోవాలనుకుంటే 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగ పిండి తీసుకోవచ్చు. ఇలా రెండింటినీ బాగా జల్లించి తీసుకుని బాగా కలుపుకోవావాలి.

- ఆ తర్వాత మొత్తం అంతా కలిపేసి అందులో నుంచి 3 టేబుల్ స్పూన్ల పిండిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులో పసుపు, వాము, జీలకర్ర, ఉప్పు, కారం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకున్న పిండిలో పోసుకుని బాగా కలుపుకోవాలి. వాము, జీలకర్ర మాత్రమే వేస్తే సరిగ్గా మెదగదు కాబట్టి ఇలా కలిపి మిక్సీ పట్టుకుంటే మంచిది.

- ఇపుడు వెన్న లేదా పావు కప్పు నూనె వేడి చేసి పిండిలోకి వేసి బాగా పట్టించాలి. చేతితో రబ్ చేస్తూ కలుపుకుంటే క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా మర్దనా చేస్తూ కలుపుకోవాలి.
- ఆ తర్వాత పిండిపై తడి క్లాత్ కప్పి పెట్టుకుని కడాయిలో ఫ్రైకి సరిపడా నూనె పోసి హై ఫ్లేమ్‌లో వేడి చేయాలి.

- ఈ లోగా మురుకుల గొట్టం తీసుకుని లోపల నూనెరాసి ఒక వాయికి సరిపడా పిండి ముద్ద నింపుకొని నూనెలో కాల్చుకోవాలి.
- ఒక వైపు కాల్చుకున్న తర్వాత రెండోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి.
- టేస్ట్ కోసం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని కలుపుకోవాలి.
హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!
కరకరలాడే "షిష్ ఫ్రై" -ఇలా చేస్తే పప్పుచారు, సాంబార్‌తో తినొచ్చు -కారంగా రుచి బాగుంటాయి!