ETV Bharat / offbeat

పచ్చిమామిడితో అద్దిరిపోయే "మామిడికాయ సాంబార్" - ఇలా చేస్తే అందరూ లొట్టలేసుకుంటూ తింటారంతే! - MAMIDIKAYA SAMBAR RECIPE

- ఒక్కసారి తింటే వన్స్​మోర్ అనాల్సిందే!

Mamidikaya Sambar at Home
Mamidikaya Sambar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 17, 2025 at 12:24 PM IST

3 Min Read

Mamidikaya Sambar Recipe : చాలా మంది ఎక్కువ ఇష్టపడే రెసిపీలలో సాంబార్ ఒకటి. ఇంట్లో ఏ కర్రీ చేయకపోయినా కేవలం సాంబార్​ ఉంటే చాలు ఆ పూట తృప్తిగా భోజనం చేయొచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల వెరైటీల్లో సాంబార్​ ట్రై చేస్తుంటారు. అలాకాకుండా ఓసారి ఇలా "మామిడికాయ సాంబార్" చేసుకోండి. దీన్నే మామిడికాయ ముక్కల పులుసు అని కూడా అంటారు.

ఈ వేసవి సీజన్​లో పచ్చి మామిడికాయలు విరివిగా లభిస్తుంటాయి. సో, ఈ సమ్మర్​లో తప్పకుండా ట్రై చేయండి. ఇది లంచ్​, డిన్నర్​ రెండింట్లోకి అద్భుతంగా ఉంటుంది. ఈ పప్పుచారుతో సైడ్​ డిష్​గా అప్పడాలను నంజుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. మరి, ఈ సూపర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు - అర కప్పు(100 గ్రాములు)
  • పసుపు - పావుటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఆయిల్ - 2 టీస్పూన్లు
  • మామిడికాయ - 1 (మీడియం సైజ్​ది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • పచ్చిమిర్చి - 4
  • టమాటా - 1
  • చింతపండు రసం - 2 టేబుల్​స్పూన్లు
  • సాంబార్ పొడి - 1 టీస్పూన్

తాలింపు కోసం :

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • ఉల్లిపాయ తరుగు - కొద్దిగా
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - కొద్దిగా

వారెవ్వా అనిపించే "మునక్కాడ మజ్జిగ చారు" - ఎండల్లో ఒంటికి ఎంతో చలువ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కుక్కర్​లో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని వాటర్ పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత అందులో పసుపు, కరివేపాకు, నూనె వేసుకొని బాగా కలిపి మూతపెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు తాజా పుల్లని పచ్చి మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పీలర్ సహాయంతో పై చెక్కును తొలగించుకోవాలి. ఆ తర్వాత మునక్కాడ ముక్కల మాదిరిగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పప్పుని కుక్కర్​లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుగుత్తి లేదా గరిటెతో లైట్​గా మాష్ చేసుకోవాలి.
  • అనంతరం అందులో ఉప్పు, కారం, పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, చింతపండు రసం వేసుకోవాలి. అలాగే, రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే, పప్పుచారు కాబట్టి కాస్త పలుచగానే ఉండేటట్లు చూసుకోవాలి.
  • ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ 5 నుంచి 6 నిమిషాలపాటు మరిగించుకోవాలి.
  • ఆ విధంగా మరిగించుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పడు తాలింపు కోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి.
  • అవి కాస్త వేగాక ఉల్లిపాయ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త రంగు మారాక ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసి చక్కగా వేయించాలి.
  • తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు చారులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
  • ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి మూతపెట్టి 5 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "మామిడికాయ సాంబార్" రెడీ!

ఉడుపి స్టైల్​ "బీరకాయ సాంబార్" - ఇలా చేశారంటే ఘుమఘుమలాడిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.