ETV Bharat / offbeat

నోటికి సరికొత్త రుచినిచ్చే "మామిడికాయ ఉల్లిగడ్డ పచ్చడి" - వేడి వేడి అన్నంలో ముద్దముద్దకి అమృతమే!

పచ్చిమామిడి, ఉల్లిగడ్డ కాంబినేషన్​లో అద్దిరిపోయే పచ్చడి - ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే!

Mamidikaya Ulli Pachadi
Mamidikaya Ulli Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2025 at 4:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mamidikaya Ulli Pachadi Making Process : మామిడికాయ పేరు చెబితేనే చాలు ఆ పుల్లదనం గుర్తొచ్చి నోట్లో నీళ్లూరుతాయి. పచ్చడి మొదలుకొని పప్పు వరకు మామిడితో చేసే ఏ వంటకమైనా రుచి అద్దిరిపోవాల్సిందే. ముఖ్యంగా పచ్చి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయ్యిందనగానే చాలా మంది దానితో రకరకాల పచ్చళ్లను ట్రై చేస్తుంటారు. అలాంటి వారికోసమే మీరు ఇప్పటి వరకు ట్రై చేయని ఒక బ్రహ్మాండమైన పచ్చడిని తీసుకొచ్చాం. అదే, ఘుమఘుమలాడే "మామిడికాయ ఉల్లిగడ్డ పచ్చడి". పుల్లగా, కారంగా ఉండి నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని చేస్తుంటేనే నోరూరుతుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కాస్త నెయ్యితో కలిపి తింటే ఇక అమృతమే! పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు. మరి, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టిప్స్ :

  • ఈ పచ్చడి తయారీకి మొత్తం ఎండుమిర్చినే వాడుతాం. కాబట్టి, ఇక్కడ చెప్పిన పరిమాణంలోనే కాకుండా మీ కారానికి తగినన్ని వేసుకోవాలి.
  • మామిడికాయ మరి పచ్చిది కాకుండా కాస్త దోరగా ఉన్నది తీసుకోవాలి. అలాంటిదైతే పచ్చడి ఎక్కువగా పుల్లగా ఉండకుండా కొద్దిగా తీపి కూడా కలిసి మరింత రుచికరంగా ఉంటుంది.
  • ఇక్కడ మామిడికాయను తురుములా కాకుండా ముక్కల్లా కట్ చేసుకున్నట్లయితే మిక్సీలో వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసుకునేటప్పుడు మామిడికాయ ముక్కలనూ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
Mamidikaya Ulli Pachadi
Mamidikaya Ulli Pachadi (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • పల్లీలు - పావు కప్పు
  • మెంతి గింజలు - 10 నుంచి 15
  • ఎండుమిర్చి - 15 నుంచి 20(రుచికి తగినన్ని)
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • జీలకర్ర - పావుటీస్పూన్
  • మామిడికాయ - ఒకటి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు - రెండు

ఈ రెండు వేసి "పల్లీ చట్నీ" చేయండి - హోటల్స్​ను మించిన టేస్ట్​ - టిఫెన్​ కాస్త ఎక్కువే తింటారు!

Mamidikaya Ulli Pachadi
Mamidikaya Ulli Pachadi (ETV Bharat)

తయారీ విధానం :

  • ఉల్లి మామిడికాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
  • పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో మెంతులను వేసి కాసేపు వేయించాలి.
  • అవి వేగిన తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. అలాగే, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవన్నీ మంచి రంగు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఈ ఇంగ్రీడియంట్స్ వేయించుకునే క్రమంలో ఆయిల్ సరిపోకపోతే మరో చెంచా నూనె వేసి వేయించుకోవాలి.
  • అవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
Mamidikaya Ulli Pachadi
Mamidikaya Ulli Pachadi (ETV Bharat)
  • ఆ మిశ్రమం చల్లారేలోపు ఒక పుల్లటి మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి పైతొక్కను తొలగించుకోవాలి. ఆపై గ్రేటర్​తో ఒక ప్లేట్​లో చెక్కు తీసిన మామిడికాయను సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దానిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కాస్త మెదిగేలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత అందులో కాస్త పెద్ద సైజ్​లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకొని మరీ మెత్తని పేస్ట్​లా కాకుండా పల్స్ ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అంటే, ఉల్లిపాయలు మరి మెత్తగా మెదిగిపోకుండా మధ్యమధ్యలో కనిపిస్తూ తినేటప్పుడు పంటికి తగులుతూ ఉండేలా చూసుకోవాలి.
  • ఇప్పుడు పచ్చడికి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.

తాలింపు కోసం :

  1. నూనె - 2 టేబుల్​స్పూన్లు
  2. మినపప్పు - 2 టీస్పూన్లు
  3. శనగపప్పు - ఒకటీస్పూన్
  4. కరివేపాకు - కొద్దిగా
  • ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించాలి.
  • తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడుతూ పుల్ల పల్లగా, కారం కారంగా ఉండే "ఉల్లి మామిడికాయ పచ్చడి" రెడీ!

పచ్చి మామిడి, పచ్చి కొబ్బరి - 5 నిమిషాల్లోనే అద్దిరిపోయే తాజా "చట్నీ" - ఈ సీజన్​పోతే దొరకదు!

వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!