Make Rava Cake at Home in Telugu : బర్త్ డే, మ్యారేజ్ డే, పార్టీ, ఫంక్షన్, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే కేక్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే! అయితే, నార్మల్‌గా కేక్ కావాలంటే బేకరీకి వెళ్లి తెచ్చుకుంటుంటాం. కానీ, మీకు తెలుసా? ఇంట్లోనే పదే పది నిమిషాల్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ కేక్ రెసిపీ ఉంది. అదే, "నోరూరించే రవ్వ కేక్". దీని తయారీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మైదా, పెరుగు, సోడా, ఎగ్స్ ఇలాంటివి ఏవి లేకుండానే పదే పది నిమిషాల్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
టిప్స్ :
- ఇక్కడ పంచదార వద్దనుకున్నవారు దాని ప్లేస్‌లో అదే పరిమాణంలో బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
- పంచదార లేదా బెల్లంలో ఎలాంటి వాటర్ లేకుండా నెయ్యిలోనే పూర్తిగా కరిగించుకోవాలి. అప్పుడే రవ్వ కేక్‌కి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ(ఉప్మా రవ్వ) - ఒక కప్పు
- నెయ్యి - తగినంత
- కాచి చల్లార్చిన పాలు - 2 కప్పులు
- పంచదార - ముప్పావు కప్పు
- ఉప్పు - రెండు చిటికెళ్లు
- యాలకుల పొడి - 1 టీస్పూన్
- డ్రైఫ్రూట్స్ తరుగు - కొద్దిగా
పాలు, బెల్లం ఉంటే చాలు - నిమిషాల్లో హెల్దీ "లడ్డూలు"! - స్వీట్ షాప్‌కి మించిన టేస్ట్‌తో!

తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- రవ్వలోని పచ్చివాసన పోయి, కాస్త రంగు మారేంత వరకు దోరగా వేయించుకున్నాక దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- అనంతరం అందులో కాచి చల్లార్చిన పాలను పోసుకొని రవ్వ మొత్తం పాలలో కలిసేలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. అది కరిగి వేడయిన తర్వాత పంచదార వేసుకొని కలుపుతూ మరిగించుకోవాలి.
- పంచదార కరిగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు(కేరమిల్ సిరప్ కలర్) సిమ్‌లో పెట్టి నిదానంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి.
- పంచదార కరిగి రంగు మారి సిరప్‌లా అయిన తర్వాత అందులో నానబెట్టుకున్న రవ్వ, పాల మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

- ఆ తర్వాత స్టవ్‌ను మీడియంలో ఫ్లేమ్‌లో ఉంచి రవ్వ మిశ్రమం దగ్గరపడేవరకు గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- రవ్వ మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు అందులో ఉప్పు, యాలకుల పొడి, మరో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలా బాగా కలపాలి.
- ఈ మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా నెయ్యి పైన తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం కేక్ మౌల్డ్ తీసుకుని లోపల మొత్తం నెయ్యి అప్లై చేయాలి. ఆపై అందులో సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ తరుగు వేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులోకి వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకొని అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచాలి.
- ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక కేక్‌ను మౌల్డ్ నుంచి సెపరేట్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆపై దానిని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని "రవ్వ కేక్" ఇంట్లోనే రెడీ!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా కేక్‌ని చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు!
బేకరీ కేక్‌తో పిల్లలకు ముప్పు - కుక్కర్లోనే హెల్దీ "రాగి కేక్" చేసి పెట్టండి! - ఈజీగా అయిపోతుంది
ఎగ్, ఓవెన్ లేకుండానే - నోరూరించే "బ్లాక్ ఫారెస్ట్ కేక్" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!