ETV Bharat / offbeat

రేషన్ బియ్యంతో "మృదువైన ఇడ్లీలు" - ఇలా చేశారంటే ఎవ్వరూ నమ్మలేరు - అంత బాగుంటాయి! - RATION RICE IDLI

అందరికీ ఇష్టమైన సాఫ్ట్​ ఇడ్లీలు - రవ్వ లేకుండా ఇలా రైస్​తో చేయండి టేస్ట్​ సూపర్​!

Ration Rice Idli
Ration Rice Idli (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 21, 2025 at 10:37 AM IST

2 Min Read

Ration Rice Idli Process in Telugu : సాధారణంగా ఇడ్లీలు చేయడం కోసం రవ్వ నానబెట్టి ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఇడ్లీ రవ్వ లేకపోతే వేరే టిఫిన్ ఏం చేయాలి? అని ఆలోచిస్తారు. అయితే, ఇక్కడ చెప్పిన విధంగా రేషన్​ బియ్యంతో ఇడ్లీలు ట్రై చేస్తే రవ్వ అవసరం ఉండదు. నార్మల్​గా రవ్వతో చేసిన మెత్తని ఇడ్లీల కంటే ఇవి ఏమాత్రం తీసిపోవు. పైగా ఇంట్లో ఉన్న రేషన్ బియ్యాన్ని ఇలా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ పిండితో మీరు కేవలం ఇడ్లీలే కాకుండా దోసెలు, పునుగులు కూడా ట్రై చేయచ్చు! మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా రేషన్​ బియ్యంతో ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసుకుందామా!

కరకరలాడే "మసాలా పప్పు చెక్కలు" - నూనె పీల్చకుండా పక్కా కొలతల్లో ఇలా చేసుకోండి!

Rice
Rice (Getty Images)

ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • రేషన్ బియ్యం - 2 కప్పులు
  • మినప్పప్పు - 1 కప్పు
  • కప్పు - అటుకులు
  • ఉప్పు - తగినంత
  • నూనె - (ఇడ్లీ పాత్రలో రాసుకోవడానికి సరిపడా)
  • కొద్దిగా వంటసోడా
Ration Rice Idli Process
Ration Rice Idli Process (Getty Images)

తయారీ విధానం

  • ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు రేషన్ బియ్యం, కప్పు మినప్పప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు కడగాలి. ఆపై సరిపడా నీళ్లు పోసి 5- 6 గంటలు నానబెట్టుకోవాలి.
  • పిండి రుబ్బుకునే అర గంట ముందు కప్పు అటుకులను ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • అనంతరం బియ్యంలోని నీళ్లను వంపేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు యాడ్​ చేస్తూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిక్సీ గిన్నెలో అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిపై మూతపెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి.
  • ఉదయాన్నే పిండిని ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంటసోడా వేసి మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం స్టవ్​ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి రెండు గ్లాసులు వాటర్​ పోసి మరిగించుకోవాలి.
Ration Rice Idli
Ration Rice Idli (ETV Bharat)
  • ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్​కు కొద్దిగా నూనె​ అప్లై చేసి ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్​లోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి.
  • ఆపై ఇడ్లీ పాత్రలోని నీరు​ మరుగుతున్నప్పుడు ప్లేట్స్​ పెట్టి మూత పెట్టండి. ఈ రేషన్​ బియ్యం ఇడ్లీలను 10 -12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​లో ఉడికించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేయండి.
  • ఇడ్లీలు బాగా ఉడికిన రెండు నిమిషాల తర్వాత తీసి ప్లేట్​లోకి వేడివేడిగా సర్వ్​ చేసుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా రేషన్​ బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్​ ఇడ్లీలు రెడీ. ఈ ఇడ్లీలు టమోటా పచ్చడి, పల్లీ చట్నీతో సూపర్​గా ఉంటాయి.

రోడ్ సైడ్ ఇడ్లీ బండి మీద చేసే "పల్చటి చట్నీ" - కొబ్బరి, పల్లీలు లేకుండా 'ఈ మ్యాజిక్​' చేయండి!

కరకరలాడే "చల్ల మురుకులు" - ఈ పద్ధతిలో చేస్తే గుల్లగా, భలే రుచిగా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.