ETV Bharat / offbeat

రేషన్​ కార్డు లబ్ధిదారులకు బిగ్​ అలర్ట్ - ఈ నెలలోనే ఆఖరి తేదీ - మిస్సయితే అంతే! - RATION CARDS E KYC LAST DATE

- రేషన్​ కార్డు వినియోగదారులకు కీలక సూచనలు చేసిన ప్రభుత్వం - గడువులోగా కేవైసీ చేయించుకోవాలని సూచన

Ration Cards e KYC Last Date
Ration Cards e KYC Last Date (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 9, 2025 at 10:28 AM IST

2 Min Read

Ration Cards e KYC Last Date: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రేషన్​ కార్డుల జాతర కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ, రేషన్​కార్డుల్లో పేర్లు యాడ్​ చేయడం వంటి పనులు వేగంగా సాగుతోన్నాయి. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ దారిద్రరేఖను కేంద్రంగా చేసుకునే ప్రవేశపెడుతుంటాయి. అందుకే ఈ పథకాలకు లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అవసరమే. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఉంటుంది. తాజాగా రేషన్‌‌కార్డుదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. మీ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ఓ పని చేయాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. లబ్ధిదారులంతా తప్పకుండా e KYC ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం చెప్పుకొచ్చింది. ఎందుకంటే, కొందరు రేషన్ కార్డులను తప్పుడు మార్గంలో వినియోగించడం, నకిలీ కార్డులు తయారు చేయడం, లబ్ధిదారు చనిపోయిన తర్వాత కూడా వారి పేరు తొలగించకుండా బియ్యం తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి మోసాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం e KYCని తప్పనిసరి చేసింది.

లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే: రేషన్​ కార్డ్​ ఈ కేవైసీ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. గతంలో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడానికి మార్చి 31, 2025 చివరి తేదీగా నిర్ణయించింది. కానీ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులు e KYC పూర్తి చేయలేకపోయారు. దీంతో ఈ గడువును మరొక్కసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025, జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ తేదీ దాటితే ఈసారి ప్రభుత్వం గడువు పెంచదని సమాచారం. కాబట్టి ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ డేట్​లోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేస్తోంది. జూన్​లో సరుకులు తెచ్చుకుంటే ఆగస్టు వరకు రేషన్ షాపులకు వెళ్లే అవసరం లేదు. కానీ ఈకేవైసీ గడువు జూన్​ 30 వరకు మాత్రమే. కాబట్టి అంతకుముందే ఈ కేవైసీ చేయించుకోవడం మంచిది. లేదంటే మళ్లీ సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

e KYC ఎలా చేయాలి:

  • రేషన్​ కార్డుల్లో పేర్లు కలిగిన వారు మీకు దగ్గరలోని రేషన్ షాప్​కు వెళ్లాలి.
  • రేషన్ షాపులో ఉన్న పీఓఎస్ మెషిన్ ద్వారా మీ ఆధార్​ వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తారు.
  • ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ ఆధార్‌తో లింక్ అవుతుంది. దీంతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఆ ప్రాంతాల్లో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లు - స్థలాల అన్వేషణలో సర్కార్!

రోడ్డు ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యం - ఎలాగో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.