ETV Bharat / offbeat

'అవన్నీ మర్చిపోండి!' ఇదొక్కటి చాలు - అందం, ఆరోగ్యానికి సూపర్!

నెయ్యి వాడకంతో జ్ఞాపకశక్తి పెంపు - వృద్ధాప్య ఛాయలకూ చెక్

benefits_of_pure_pure_ghee
benefits_of_pure_pure_ghee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 29, 2025 at 12:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Benefits of Pure Pure Ghee : వంద పదార్థాలు చేయలేని పని ఒకే ఒక్క నెయ్యితో సాధ్యమంటున్నారు పోషకాహార నిపుణులు. స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందానికి కూడా ఉపకరిస్తుందని చెప్తున్నారు. దెబ్బలు, కాలిన గాయాలకు మందులా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తి పెంపొందిస్తుందని, వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుందని పేర్కొంటున్నారు. నెయ్యి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా!

తెలుగు వారి భోజనంలో నెయ్యి తప్పనిసరి. వేడి వేడి అన్నంలోకి ముద్ద పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది నెయ్యి విష పదార్థంలా భావిస్తున్నారు. అసలు నెయ్యి మంచిదా చెడ్డదా అనేది తెలుసుకుందాం.

ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!

స్వచ్ఛమైన నెయ్యి వల్ల లాభాలు :

  • నెయ్యి అందానికి, ఆరోగ్యానికి సహజ వనరులా ఉపయోగపడుతుంది.
  • నెయ్యి సహజ మాయిశ్చరైజర్​లా పనిచేస్తుంది. పొడి బారిన చర్మానికి లోతుగా తేమను అందించి మెరిసేలా చేస్తుంది.
  • పగిలిన పెదాలకు రోజూ రాత్రి నెయ్యి రాస్తే తేమ అందుతుంది. సహజ లిప్​బామ్​లా పెదవులను లేత గులాబీ రంగులో మెరిపిస్తుంది.
  • గోరు వెచ్చని నెయ్యిని పొడిబారిన, చిట్లిన జుట్టుకు రాయడం వల్ల వెంట్రుకల డ్యామేజ్ తగ్గుతుంది.
  • ఆయుర్వేద వైద్యంలో, థెరపీల్లో, బాడీ మసాజ్​లో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల ఒత్తిడి తగ్గి కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
  • గోరు వెచ్చని నెయ్యితో కళ్ల చుట్టూ, కంటి రెప్పలపైన గుండంగా మసాజ్ చేయాలి. దీంతో కళ్ల మంటలు, కళ్ల కింద నల్లటి వలయాలూ తగ్గుతాయి.
  • నెయ్యిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటి ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దెబ్బలు, కాలిన గాయాలపై నెయ్యి రాస్తే వేగంగా నయమవుతాయి.
  • నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. రోజూ ఆహారంలో నెయ్యిని తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
  • మలబద్ధకం ఉన్న వారు పడుకునే ముందు గ్లాసు గోరు వెచ్చని పాలల్లో చెంచా నెయ్యి వేసి తాగితే సమస్య తగ్గుతుంది. జీవ క్రియ రేటు మెరుగుపడుతుంది.
  • నెయ్యి తరచూ ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉండే నల్లటి మచ్చలు, ముడతలు, తగ్గుతాయి. యాంటీ ఏజింగ్​గా పనిచేసి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
  • మేకప్ వేసుకున్న ముఖానికి నెయ్యిని రాసుకోవాలి. తర్వాత కాటన్​తో చర్మాన్ని తుడవాలి. అలా సహజ మేకప్ రిమూవర్​గానూ నెయ్యి ఉపయోగపడుతుంది.
  • నెయ్యి అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక పదార్థం. ఇది వంటలకు అదనపు రుచి కల్పించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

'భారత సంస్కృతి, సంప్రదాయంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. యజ్ఞ, యాగాదుల్లో, భోజనంలో తప్పనిసరి చేయడం వెనుక ఉన్న ప్రయోజనాలను మనం గమనించవచ్చు. జీవనవిధానాన్ని శాసించిన ఆయుర్వేదంలోనూ నెయ్యి ప్రయోజనాలు పేర్కొన్నారు. శరీరానికి అవసరమైన విటమిన్ 'డి'తో పాటు జీవన ప్రమాణం, ఆరోగ్యం, తెలివితేటలు, శారీరక బలం, మేథాశక్తి పెంచే సుగుణాలున్నాయి. అయితే, నెయ్యి తయారీ విధానం చాలా ఇంపార్టెంట్. నేరుగా పాలను వేడి చేసి కాకుండా పెరుగు నుంచి తీసే నెయ్యి మాత్రమే ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోవాలి' - డాక్టర్ శంకర్ ప్రసాద్, జనరల్ సర్జన్

నెయ్యి వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు:

  • నెయ్యి వాడకం వల్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపర్చడంతోపాటు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  • నెయ్యిలోని E, A విటమిన్ పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా చేస్తాయి. ముడతలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
  • నెయ్యిలో మంచి కొవ్వులు హృదయ ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. ఎల్​డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హెచ్​డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
  • కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపర్చడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరానికి శక్తిని ఇచ్చి, అలసటను తగ్గిస్తుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మైగ్రేన్​ వేధిస్తోందా? ఎసిడిటీ బాధిస్తోందా? - ఈ వాటర్​ ట్రై చేసి చూడండి!

అతి ప్రాచీన వంటకం 'కుంభకోణం సాంబార్' - జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే!