ETV Bharat / offbeat

గోధుమపిండితో చిట్టి "పునుగులు" - నూనె పీల్చకుండానే కమ్మగా, కరకరా!

- చల్లని వేళ నోరూరించే 'పునుగులు' - గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకోండిలా!

Punugulu Recipe with wheat Flour
Punugulu Recipe with wheat Flour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 28, 2025 at 11:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Punugulu Recipe with wheat Flour : మనందరం ఇంట్లో గోధుమపిండి ఉంటే చపాతీలు, పూరీలు వంటివి చేసుకొని తింటుంటాం. కానీ, మీకు తెలుసా? గోధుమపిండితో కరకరలాడే "పునుగులను" ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు నానబెట్టి, రుబ్బే పనిలేకుండా తక్కువ టైమ్​లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వారందరూ "వన్ మోర్ ప్లేట్ ప్లీజ్" అని అడగడం పక్కా! అంత రుచికరంగా ఉంటాయి ఈ పునుగులు. అలాగే, వీటి తయారీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. మరి, ఇంకెందుకు ఆలస్యం ముసురు పట్టిన వేళ వేడి వేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే గోధుమపిండితో చేసుకునే ఈ రుచికరమైన చల్ల పునుగులపై ఓ లుక్కేయండి.

అవసరమైన ఇంగ్రీడియంట్స్ :

  • గోధుమపిండి - రెండు కప్పులు
  • పెరుగు - ఒక కప్పు
  • ఉప్పు - రుచికి తగినంత
  • జీలకర్ర - పావుటీస్పూన్
  • వంటసోడా - కొద్దిగా
  • నూనె - వేయించడానికి తగినంత

కరకరలాడే "పాలకూర సగ్గుబియ్యం వడలు" - తక్కువ నూనెతో ఎక్కువ రుచి!

Punugulu Recipe with wheat Flour
wheat Flour (Getty Images)

తయారీ విధానం :

  • ఈ స్నాక్ రెసిపీ తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో కాస్త పులిసిన పెరుగు, పావు కప్పు నీళ్లు వేసుకొని ఒకసారి కలపాలి.
  • తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, బేకింగ్ సోడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
  • ఇక్కడ వంటసోడాను చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అది ఎక్కువైనా పునుగులు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.
  • మిశ్రమాన్ని చక్కగా కలిపిన తర్వాత అందులో గోధుమపిండిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి.
  • తర్వాత అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పలుచగా, గట్టిగా కాకుండా పునుగులకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బాగా కలపాలి.
Punugulu Recipe with wheat Flour
Curd (Getty Images)
  • ఆవిధంగా కలిపిన తర్వాత పిండి మిశ్రమాన్ని మూడ్నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చల్ల పునుగులు గుల్లగా, మంచి రుచికరంగా వస్తాయి.
  • పిండిని బాగా బీట్ చేసిన తర్వాత గిన్నెపై మూతపెట్టి రెండు నుంచి మూడు గంటలపాట నాననివ్వాలి.
  • అనంతరం మరొకసారి పిండిని బాగా కలిపి పక్కనుంచాలి.
  • ఇప్పుడు పునుగుల తయారీ కోసం స్టవ్ కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
Punugulu Recipe with wheat Flour
Spices (Getty Images)
  • ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో చిట్టి చిట్టి పునుగుల్లా వేసుకోవాలి.
  • పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపు ఫ్రై అయ్యాక చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్​లో అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, గోధుమపిండితో కమ్మగా, కరకరలాడే "చల్ల పునుగులు" రెడీ అయిపోతాయి!
  • అనంతరం వీటిని టమాటా చట్నీ, కొబ్బరి చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనే విధంగా ఉంటుంది.
Punugulu Recipe with wheat Flour
Jeera (ETV Abhiruchi)

టిప్స్ :

  • ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇదే కొలతలతో ఇంగ్రీడియంట్స్ పెంచి తీసుకుంటే సరిపోతుంది. అంటే, రెండు కప్పుల గోధుమపిండి అన్న దగ్గర బదులుగా 4 కప్పులు తీసుకోవాలన్నమాట.
  • ఇక్కడ మీరు పెరుగు తీసుకున్న కప్పునే గోధుమపిండి, ఇతర ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి.
  • నూనె వేడయిన తర్వాత మాత్రమే పునుగులను వేసుకోవాలి. లేదంటే, ఆయిల్​ని ఎక్కువగా పీల్చుకుంటాయని గుర్తుంచుకోవాలి.

చిలగడదుంపతో కమ్మని "పిజ్జా" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

మొక్కజొన్నతో అద్దిరిపోయే "పొంగలి" - తింటే రుచికి ఫిదా అవ్వాల్సిందే!