మీ బండికి యాక్సిడెంట్ కావొద్దంటే ఇలా చేయాలట! - రోడ్డు ప్రమాదాలకు "హిప్నోసిస్" కారణంగా తేల్చిన పోలీసులు!
- రెప్పపాటులో చూస్తుండగానే ఘోర ప్రమాదాలు - ఇలా అడ్డుకోవాలని సూచన
Road Hypnosis (ETV Bharat)

Published : June 4, 2025 at 3:45 PM IST
Road Hypnosis : దేశంలో ప్రతిఏటా లక్షలాదిగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. మరి, ఈ పరిస్థితికి కారణం ఏంటి? అని అడిగితే పోలీసులు ఆసక్తికర విషయం వెల్లడిస్తున్నారు. అదే "రోడ్ హిప్నోసిస్"! దీని కారణంగానే మెజారిటీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయట! మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
- వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు, తమ బాడీ కండీషన్‌ను గుర్తించలేకపోయే స్థితినే "రోడ్డు హిప్నోసిస్" అంటారు. దీన్నే "హైవే హిప్నోసిస్", ఇంకా "వైట్ లైన్ ఫీవర్" అని కూడా అంటారు.
- డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు డ్రైవర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి దిగజారుతూ పోతుందట. అలా కంటిన్యూస్‌గా రెండున్నర గంటలు దాటిన తర్వాత రోడ్డు హిప్నోసిస్ కండీషన్లోకి వెళ్లిపోతారట!
- ఈ స్థితిలో డ్రైవర్ కళ్లు తెరిచే ఉంటాయి. రోడ్డును చూస్తూనే ఉంటారు. కానీ బ్రెయిన్ మాత్రం ఎదురుగా కనిపించే వాటిని సరిగా రికార్డు చేయదట.
- దీనివల్ల తన ముందు ప్రయాణిస్తున్న వాహనాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో, పక్కన వెళ్తున్న వెహికిల్స్ స్పీడ్ ఎలా ఉందనే విషయాలను అంచనావేయలేకపోతారట. ఈ కారణంగానే ముందువెళ్తున్న వాహనాలను, రోడ్డుమీద ఆగి ఉన్న వెహికిల్స్‌ను ఢీకొంటారట.
- రోడ్ల చిరలో ఉన్న పొడవు తెల్ల గీతలను కంటిన్యూస్‌గా చూడటం, ఒకే టైపు దృశ్యాలను అదేపనిగా చూస్తూ ఉండటం, పక్కన మాట్లాడే వారు ఎవరూ లేకపోవడం, ఇంకా నిద్రలేమి, అలసట వంటివన్నీ "రోడ్డు హిప్నోసిస్"కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
- ఈ పరిస్థితి నిద్ర మత్తువేళలో రాత్రి, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
నేషనల్ హైవేపై యాక్సిడెంట్, ఇంధనం అయిపోయినా డోంట్ వర్రీ! - ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చాలు
ఇలా అడ్డుకోవచ్చు :
- ఈ రోడడ్డు హిప్నోసిస్ ప్రమాదకరమైనదే అయినప్పటికీ దాన్ని అడ్డుకోవడం సాధ్యమేనంటున్నారు.
- ఇందుకోసం డ్రైవర్ ప్రతి 2, 3 గంటలకు ఒకసారి కచ్చితంగా బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
- బండి దిగి కనీసం 5 నుంచి 6 నిమిషాలు నడవాలని చెబుతున్నారు. నిద్ర వస్తుంటే తప్పకుండా వాహనాన్ని ఆపి కాసేపు పడుకోవాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో అవగాహన :
- ఈ సమస్యపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రక్షకభటులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని హైద్రాబాద్-భూపాలపట్నం, హైద్రాబాద్-బెజవాడ నేషనల్ హైవేల్లో జరుగుతున్న ప్రమాదాలను గమనిస్తే "రోడ్డు హిప్నోసిస్"తోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నట్టు అర్థమవుతోందని చెబుతున్నారు. అందుకే, నిద్ర ఇబ్బంది పెడుతున్నా, అలసట వేధిస్తున్నా వెంటనే బండిని ఆపేసి, రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
విజయవాడ, హైదరాబాద్ హైవేపై ఘోరం - ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

