ETV Bharat / offbeat

వేసవి తాపాన్ని తీర్చే "పిస్తా మ్యాంగో ఫ్రూట్​ కస్టర్డ్​" - క్షణాల్లో రెడీ - టేస్ట్​ వేరే లెవల్​! - PISTA MANGO FRUIT CUSTARD

రెగ్యులర్​ ఫ్రూట్​ కస్టర్డ్​ను మించిన టేస్ట్​! ఒక్కసారి తింటే జిందగీ ఖుష్​!

Pista Mango Fruit Custard
Pista Mango Fruit Custard (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 25, 2025 at 11:25 AM IST

2 Min Read

Pista Mango Fruit Custard: వేసవిలో మెజార్టీ పీపుల్​ డీహైడ్రేషన్‌ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల తలెత్తే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లీటర్ల కొద్దీ నీటిని తాగడం సహా జ్యూస్​లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా కొన్ని సార్లు ఫలితం ఉండదు. ఈక్రమంలోనే కొద్దిమంది వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటారు. అలాంటి వారు ఓసారి పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్ ట్రై చేయండి. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఎంతో సులభంగా, త్వరగా దీనిని తయారు చేసుకోవచ్చు. పైగా టేస్ట్​ కూడా చాలా బాగుంటుంది. మరి వేసవి తాపాన్ని తగ్గించే ఈ సమ్మర్‌ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Milk
Milk (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్
  • పాలు - అర లీటరు
  • కండెన్స్‌డ్‌ మిల్క్‌- ఒక టేబుల్‌ స్పూన్
  • మామిడి పండు ముక్కలు - అరకప్పు
  • దానిమ్మ గింజలు - టేబుల్‌ స్పూన్
  • పిస్తా పప్పులు - టీస్పూన్
Pista
Pista (Getty Images)

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి కస్టర్డ్​ పౌడర్​, 1 టేబుల్​స్పూన్​ పాలు తీసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి అందులో అర లీటర్​ పాలు పోయాలి. ఆ పాలలో కండెన్స్​డ్​ మిల్క్​ పోసి మీడియం ఫ్లేమ్​లో పాలును మరిగించాలి.
  • పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్​ పౌడర్​, పాల మిశ్రమాన్ని పోసి కలపాలి.
  • పాలు చిక్కబడేంతవరకూ స్పూన్​తో కలుపుతూ మరిగించాలి. మిశ్రమం చిక్కగా మారిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి.
  • ఈలోపు బాగా పండిన మామిడిని శుభ్రంగా కడిగి పై చెక్కు తీసేసి ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన ఉంచాలి. అలాగే దానిమ్మ పొట్టు తీసేసి గింజలు సెపరేట్​ చేసుకోవాలి. అలాగే పిస్తా పప్పులను సన్నగా కట్​ చేసి పక్కన ఉంచాలి.
Mango
Mango (Getty Images)
  • పాల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి తీసుకుని ఓ నిమిషం పాటు బ్లెండ్​ చేసుకుని ఓ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆపై అందులోకి మామిడి పండు ముక్కలు, పిస్తా పప్పులు, దానిమ్మ గింజలు వేసి కలిపి మూత పెట్టి ఓ గంట సేపు ఫ్రిజ్​లో ఉంచాలి. లేదంటే పండ్ల ముక్కలు కలిపి నేరుగా తాగొచ్చు.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్​లోకి తీసుకుని పైన కొన్ని దానిమ్మ గింజలు, పిస్తా పప్పులతో గార్నిష్​ చేసి సర్వ్​ చేసుకుంటే రుచికరమైన పిస్తా మ్యాంగో ఫ్రూట్​ కస్టర్డ్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Pista Mango Fruit Custard
Pista Mango Fruit Custard (ETV Bharat)

చిట్కాలు:

  • కండెన్స్​డ్​ మిల్క్ బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. కాకపోతే కండెన్స్​డ్​ మిల్క్​ వాడటం వల్ల కస్టర్డ్​ అనేది క్రిమీగా వస్తుంది.
  • కేవలం మామిడి, దానిమ్మ మాత్రమే కాకుండా పండిన అరటి, తియ్యటి ద్రాక్ష, యాపిల్​ పండ్ల ముక్కలు కూడా యాడ్​ చేసుకోవచ్చు.
  • ఈ కస్టర్డ్​ కోసం చిక్కటి పాలను ఉపయోగించాలి. అప్పుడే టేస్ట్​తో పాటు క్రిమీగా వస్తుంది.

పిల్లలకు విపరీతంగా నచ్చే "చాకోబార్​ ఐస్​క్రీమ్​" - ఇంట్లోనే ఇలా ప్రిపేర్​ చేసుకోండి!- టేస్ట్​ అదుర్స్​!

రెగ్యులర్​ ఇడ్లీలు తిని బోర్​ కొట్టిందా? - ఇలా "చిట్టి మసాలా ఇడ్లీలు" చేసుకోండి - టేస్టీ అండ్​ స్పైసీ!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.