Pedda Punugulu Recipe in Telugu : విజయవాడ స్ట్రీట్ ఫుడ్ అనగానే మనందరికీ చిట్టి చిట్టి పునుగులు గుర్తుకొస్తుంటాయి. వేడివేడిగా చిట్టి పునుగులు టమోటా చట్నీ, ఉల్లిపాయలతో తింటుంటే అబ్బా ఆ రుచి వేరంటారు ఫుడ్ లవర్స్. అయితే, బెజవాడలోనే కొన్ని హోటల్స్‌లో పెద్ద పునుగులు కూడా చేస్తుంటారు. కానీ, ఎక్కువ మంది ఈ పెద్ద పునుగులు తిని ఉండకపోవచ్చు. అలాంటి వారు సింపుల్‌గా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. ఈ కొలతలతో చేస్తే పెద్ద పునుగుల పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా పెద్ద పునుగులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఇవి చేసి పెట్టండి - చాలా సింపుల్, టేస్టీ టైంపాస్ స్నాక్స్!

కావాల్సిన పదార్థాలు :
- మినపగుండ్లు - 1 కప్పు
- బియ్యం - 3 కప్పులు
- మైదా పిండి - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 5
- ఉల్లిపాయలు - 2
- నూనె - డీప్ ఫ్రై కోసం
- టేబుల్‌స్పూన్ - జీలకర్ర
- పుట్నాలపప్పు - పావుకప్పు
- కరివేపాకు - 2
- పుదీనా తరుగు
- కొత్తిమీర తరుగు

తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు మినపగుండ్లు, 3 కప్పులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి.
- ఆపై తగినన్ని నీళ్లు పోసి కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న మినప్పప్పు-బియ్యం నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

- అనంతరం మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు వేసుకొని వెన్నలాగా మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టి, కనీసం 5-6 గంటల పాటు పులియబెట్టాలి.
- పునుగులు తయారు చేసుకునే ముందు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

- ఇప్పుడు పునుగుల పిండిలో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్‌స్పూన్ జీలకర్ర, పుట్నాలపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
- పిండి కాస్త పల్చగా ఉంటే మైదా వేసుకొని బాగా కలపండి.
- అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేయాలి.
- ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ చేతితో పెద్ద పునుగులు వేసుకోవాలి.

- పెద్ద పునుగులు దోరగా పైన క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి.
- పెద్ద పునుగులు మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితో ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ పెద్ద పునుగులు మీ ముందుంటాయి.
- స్ట్రీట్ స్టైల్ పెద్ద పునుగులు టమోటా చట్నీ, పల్లీ చట్నీతో వేడివేడిగా తిన్నారంటే అద్దిరిపోతుంది.
ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!
ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!