ETV Bharat / offbeat

ఈ రెండు వేసి "పల్లీ చట్నీ" చేయండి - హోటల్స్​ను మించిన టేస్ట్​ - టిఫెన్​ కాస్త ఎక్కువే తింటారు!

ఈ స్టైల్​లో "పల్లీ చట్నీ" చేసుకోండి - టిఫెన్స్​ని నంజుకొని తినకుండా ముంచుకొని తింటారు!

Peanut Chutney
Peanut Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2025 at 10:28 AM IST

3 Min Read
Choose ETV Bharat

Easy Guide to Make Peanut Chutney : టిఫెన్స్​లోకి ఎక్కువ మంది చేసే చట్నీలలో పల్లీ పచ్చడి ఫస్ట్ ప్లేస్​లో ఉంటుంది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చేస్తుంటారు. పల్లీలను వేయించడం దగ్గర నుంచి అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వరకు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే, మీరూ ఇప్పటివరకు రకరకాల వెరైటీల్లో ఈ చట్నీని ట్రై చేసి ఉంటారు. కానీ, ఈసారి కాస్త స్పెషల్​గా ఈ పద్ధతిలో పల్లీ చట్నీ చేసుకోండి. పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఇలా చేస్తే ఇడ్లీ, దోశ, బోండా వంటివి చట్నీలో నంజుకొని తినకుండా, ముంచి ఒకటికి నాలుగు తింటారు. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! మరి, ఈ సూపర్ టేస్టీ పల్లీ చట్నీ కోసం కావాల్సిన పదార్థాలేంటి, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • పల్లీలు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 5 నుంచి 6
  • నూనె - ఒక టేబుల్​స్పూన్
  • ధనియాలు - ఒక టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - మూడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • బెల్లం - చిన్న ముక్క

వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

Peanut Chutney
Palli Chutney Preparation (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ చట్నీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలను వేసి లో ఫ్లేమ్​లో ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • కొద్దిసేపటికి పల్లీలు వేగి పొట్టు ఊడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అవి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పల్లీలు పూర్తిగా వేగే వరకు మరికాసేపు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఇలా చేయడం ద్వారా వేరుశనగ గుండ్లు మచ్చలు లేకుండా అన్ని ఒకే రంగులో లోపలి వరకు చక్కగా వేగి పచ్చడి రుచి బాగుంటుంది.
  • అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుగుత్తితో ఒకసారి పల్లీలను మెదిపి పొట్టు మొత్తం తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి.
Peanut Chutney
Peanut Chutney (ETV Bharat)
  • ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి.
  • అవి కొద్దిగా వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క వేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో తగినన్ని నీటిని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఈ స్టేజ్​లో ఉప్పు, కారం, పులుపు వంటివి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.
Easy Guide to Make Peanut Chutney
Peanut Chutney (ETV Bharat)

తాలింపు కోసం :

  1. నూనె - 1 టేబుల్​స్పూన్
  2. ఆవాలు - ఒకటీస్పూన్
  3. శనగపప్పు - ఒక టేబుల్​స్పూన్
  4. మినపప్పు - ఒక టేబుల్​స్పూన్
  • అందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
  • అది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీలో వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని "పల్లీ చట్నీ" రెడీ!
  • ఇక్కడ చట్నీ కాస్త పలుచగా ఉంటే ఇష్టపడేవారు మరికొద్దిగా వాటర్​ని యాడ్ చేసుకోవచ్చు.
Palli Chutney Preparation
Palli Chutney (ETV Bharat)

టిప్స్ :

  • ఇక్కడ చట్నీ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చిని కాస్త పెంచి వేసుకోవచ్చు.
  • పల్లీలను వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే అవి లోపలి వరకు చక్కగా వేగి చట్నీ రుచికరంగా వస్తుంది.

ఒంగోలు స్పెషల్​ "గంగాళం ఉప్మా with ఎర్ర చట్నీ" - ఒక్కసారి తింటే జిందగీ ఫుల్​ ఖుష్​!

కొబ్బరి చట్నీలో ఒక్క గుప్పెడు ఇవి వేస్తే చాలు - రుచి అమోఘంగా ఉంటుంది! - ఈ సారి తప్పక ట్రై చేయండి!