ETV Bharat / offbeat

కుక్కర్​లో "పల్లీ చట్నీ" - పావుగంటలో రెడీ - పిల్లలతై ఇష్టంగా తినేస్తారు!

-పల్లీ చట్నీని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా - కుక్కర్​లో ఉడికించి చేయండి - సూపర్​ టేస్టీగా ఉంటుంది!

Peanut Chutney in Cooker
Peanut Chutney in Cooker (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 6, 2025 at 1:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Peanut Chutney in Cooker: ఇడ్లీ, దోశ, వడ, బోండా, ఊతప్పం ఇలా టిఫెన్​ ఏదైనా అందులోకి పల్లీ చట్నీ కచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే నచ్చిన టిఫెన్​ను చట్నీలో ముంచుకుని హ్యాపీగా తినేస్తారు. అయితే పల్లీ చట్నీని చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు. కొద్దిమంది నార్మల్​గా ఫ్రై చేస్తే, మరికొద్దిమంది ఆయిల్​లో వేయించి పచ్చడి ప్రిపేర్​ చేస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా పల్లీలను ఉడకబెట్టి అది కూడా కుక్కర్​లో వేసి చేశారా? లేదంటే మాత్రం ఓసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సింపులే. ఇక ఈ చట్నీని పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు. మరి లేట్​ చేయకుండా కమ్మగా ఉండే పల్లీ చట్నీని ప్రెషర్​ కుక్కర్​లో ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 1 టేబుల్​స్పూన్​
  • పల్లీలు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 8
  • ఉల్లిపాయ - 1
  • టమాటాలు - 3
  • అల్లం ముక్క - కొద్దిగా
  • ఉప్పు - సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొబ్బరి తురుము - గుప్పెడు
Peanuts
పల్లీలు (Getty Images)

తాలింపు కోసం:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • శనగపప్పు - అర టీస్పూన్​
  • మినప్పప్పు - అర టీస్పూన్​
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
Coconut
కొబ్బరి (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా ఈ పచ్చడి కోసం అవసరమయ్యే ఉల్లిపాయ, టమాటాలను మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకోవాలి. అలాగే అల్లాన్ని సన్నని ముక్కలుగా కట్​ చేసి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కుక్కర్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత పల్లీలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి.
  • అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కలిపి ఓ 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
Tomato
టమాటాలు (Getty Images)
  • చివరగా అవి మునిగేంతవరకు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి విజిల్​ సెట్​ చేసి మీడియం ఫ్లేమ్​లో మూడు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • కుక్కర్​ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి పల్లీల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • మిక్సీజార్​లోకి పల్లీల మిశ్రమం, పచ్చికొబ్బరి తురుము వేసుకుని కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న చట్నీని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి.
Peanut Chutney
తాలింపు (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి.
  • తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. చివరగా కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ తాలింపును ముందుగా గ్రైండ్​ చేసుకున్న పల్లీ చట్నీలో యాడ్​ చేసి మిక్స్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ.
Peanut Chutney
పల్లీ చట్నీ (ETV Bharat)

చిట్కాలు:

  • నార్మల్​ పల్లీచట్నీ కోసం వేయించే విధంగా ఎక్కువ సేపు వేయించాల్సిన పనిలేదు. జస్ట్​ ఆయిల్​లో ఓ నిమిషం ఫ్రై చేసి ఆ తర్వాత కుక్​ చేసుకుంటే సరి.
  • పచ్చిమిర్చిని మీరు తినే ఘాటుకు సరిపడేలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరి తురుము ప్లేస్​లో పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు.

పల్లెటూరి స్టైల్ "వంకాయ టమాటా పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

క్రిస్పీ అండ్ టేస్టీ "సేమియా కట్​లెట్స్" - పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!