Palakura Pachadi In Telugu : సాధారణంగా మనం పాలకూరతో కమ్మని పప్పు, కూరలు చేస్తుంటాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా పాలకూర పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి రుచి అద్దిరిపోతుంది. ఈ పచ్చడి పాలకూరతో చేశారంటే అస్సలు నమ్మరు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం
ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!

కావాల్సిన పదార్థాలు:
- పాలకూర కట్టలు - 3
- ఉప్పు -రుచికి సరిపడా
- ఎండుమిర్చి - 20
- టేబుల్‌స్పూన్ - శనగపప్పు
- టేబుల్‌స్పూన్ - మినప్పప్పు
- ఉసిరికాయంత - చింతపండు

తాలింపు కోసం కావాల్సినవి :
- నూనె - సరిపడా
- టీస్పూన్ - జీలకర్ర
- టీస్పూన్ - ఆవాలు
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 2
- వెల్లుల్లి - 5

తయారీ విధానం
- ముందుగా పాలకూర శుభ్రంగా కడగాలి. ఇందుకోసం పాలకూర ఆకులు తెంపిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి 5 నిమిషాలు నానబెట్టండి. అనంతరం ఆకులను శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆపై సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పాలకూర తరుగు కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి.

- అలాగే ఉసిరికాయంత చింతపండు ఒసారి కడిగి కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి టేబుల్‌స్పూన్ నూనె వేసి వేడి చేయండి. ఇందులో టేబుల్‌స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.
- చక్కగా వేయించుకున్న పప్పులను మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అదే పాన్‌లో ఎండుమిర్చి వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి.

- ఎండుమిర్చి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. (ఈ పాలకూర పచ్చడి పచ్చిమిర్చితో చేసిన దానికంటే ఇలా ఎండుమిర్చి వేసి చేయడం వల్ల రుచి బాగుంటుంది.)
- అదే పాన్‌లో మరో 2 టేబుల్‌స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర తరుగు వేసి లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
- పాలకూర చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి.

- ఇప్పుడు పప్పులు, ఎండుమిర్చి వేసుకున్న మిక్సీ జార్లో టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న చింతపండు నీళ్లతో సహా వేసుకోండి. అలాగే వెల్లుల్లి, వేయించుకున్న పాలకూర మిశ్రమం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకుంటే పాలకూర పచ్చడి రెడీ.
- ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో జీలకర్ర, ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
- తాలింపు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలకూర పచ్చడి వేసి కలపండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే కమ్మని పాలకూర పచ్చడి మీ ముందుంటుంది.
"మృగశిర కార్తె"తో చేపలకి ఉన్న లింక్ ఏంటి? - ఆ రోజున "జల పుష్పాలు" ఎందుకు తింటారో తెలుసా!
"ఇడ్లీలు" గట్టిగా వస్తున్నాయా? - ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు - దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు వస్తాయి!