ETV Bharat / offbeat

ఈ తెల్లటి "వడలు" ఎప్పుడైనా తిన్నారా? - చుక్క నూనె లేకుండా తయారవుతాయ్! - బరువు తగ్గాలనుకుంటే బెస్ట్​ ఆప్షన్​! - OIL FREE VADA MAKING PROCESS

- మీరు ఉదయాన్నే వడలను ఇష్టంగా తింటారా? - నూనె లేకుండా ఇలా హెల్దీ పద్ధతిలో ప్రిపేర్​ చేసుకోండి!!

Oil Free Vada Making Process
Oil Free Vada Making Process (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 5, 2025 at 1:48 PM IST

2 Min Read

Oil Free Vada Making Process: వడలు అంటే అందరికీ ఇష్టమే. కానీ వాటిని తినాలంటే కొందరు వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే అవి ఆయిల్​ ఫుడ్​ కావడమే కారణం. బరువు పెరగడం నుంచి ఎన్నోరకాల సమస్యలకు ఆయిల్ ఫుడ్ కారణమవుతుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే, వీటిని తినాలనే కోరికను బలవంతంగా ఆపుకుంటారు.

అయితే అలాంటివారు ఇకపై ఎటువంటి టెన్షన్​ లేకుండా హ్యాపీగా వడలు తినేయొచ్చు. అందుకే మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. వీటిని నూనెలో డీప్​ఫ్రై చేసే అవకాశం లేదు. చాలా హెల్దీగా అతి తక్కువ సమయంలో ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఆయిల్​ ప్రీ వడలు ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

Urad Dal
Urad Dal (Getty Images)

కావలసిన పదార్థాలు:

  • మినప్పప్పు - 1 కప్పు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి -3
  • అల్లం - 1/2 అంగుళం
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
Onions
Onions (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా ఓ బౌల్​లోకి మినప్పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత పప్పు పూర్తిగా మునిగే వరకు నీరు పోయాలి. ఈ పప్పును కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి. ఒకవేళ ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెడితే సరిపోతుంది.
  • పప్పు నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా వంపేసి మిక్సీ జార్‌లోకి లేదా గ్రైండర్‌లోకి వేసుకుని గ్రైండ్​ చేసుకోవాలి.
  • పప్పు రుబ్బేటప్పుడు అస్సలు నీరు కలపకూడదు. అవసరమైతే ఒకటి లేదా రెండు టీస్పూన్ల చల్లటి నీటిని మాత్రమే వేయాలి.
  • పిండిని గట్టిగా, నునుపుగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే వడలు క్రిస్పీగా వస్తాయి. ఇలా రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇందులోకి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదారాలన్నీ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి రెండు గ్లాసులు నీరు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి.
  • ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్​కి లైట్​గా ఆయిల్​ అప్లై చేసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుని వడులుగా వత్తుకుని ప్లేట్స్​లో పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్లేట్స్​లోకి వేసుకోవాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ రెసిపీలో వడలు ఆవిరి మీద ఉడుకుతాయన్నమాట. అందుకే, అవి తెల్లగా ఉంటాయి.
  • వడలు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 5 నిమిషాలు అలానే వదిలేసి ఈ తర్వాత ప్లేట్​లోకి సర్వ్​ చేసుకుని నచ్చిన చట్నీ, సాంబార్​తో తింటే అద్దిరిపోతుంది. చుక్క నూనె లేని ఈ వడలు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి.
Vada Without Oil
Vada Without Oil (ETV Bharat)

టిప్స్​:

  • పప్పులు ఎంతసేపు నానితే వడలు అంత రుచికరంగా వస్తాయి.
  • పిండిని రుబ్బేటప్పుడు వీలైనంత తక్కువ నీరు ఉపయోగించండి. పిండి గట్టిగా ఉంటే నూనె లేకుండా వడలు చేయడం సులభం అవుతుంది.
  • రుబ్బిన పిండిని 5-10 నిమిషాలు బాగా చేత్తో లేదా విస్క్‌తో కలపండి.
  • వడలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్ లేదా కత్తిని గుచ్చి చూడండి. అది శుభ్రంగా వస్తే ఉడికినట్లు.

ఎగ్ లేదు, ఓవెన్ అవసరమే లేదు - ఇంట్లోనే బేకరీ స్టైల్​ ప్లఫీ ప్లఫీ బ్రెడ్ - చాలా ఈజీగా!

'మైసూర్ బోండా' తయారీలో ఫెయిల్ అయ్యేది అక్కడే - ఈ పద్ధతిలో చేస్తే పిండి ఉడకడంతో పాటు రుచి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.