ETV Bharat / offbeat

పప్పులు నానబెట్టడం, రుబ్బడం లేకుండా - ఈ "పొడి"తో అప్పటికప్పుడు దూది లాంటి మెత్తని ఇడ్లీలు! - NO SOAKING NO GRINDING IDLI RECIPE

- ఈ పౌడర్​తో నిమిషాల్లో చక్కటి ఇడ్లీలు - ఒక్కసారి చేసుకుంటే కనీసం 6 నెలల పాటు నిల్వ!

Instant Soft Idli Recipe
Instant Idli Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : April 9, 2025 at 5:33 PM IST

3 Min Read

Instant idli Recipe without Soaking : ఇడ్లీ చేయాలంటే అదొక పెద్దపనిగా భావిస్తుంటారు మెజార్టీ పీపుల్. ముఖ్యంగా నేటి బిజీబిజీ లైఫ్​లో ఉద్యోగం చేసే మహిళలైతే మార్నింగ్ ఇడ్లీ అంటే అమ్మో ఇడ్లీనా అనేస్తుంటారు. ఎందుకంటే నార్మల్​గా ఇడ్లీలు చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే పప్పు నానబెట్టుకోవాలి. నెక్ట్స్ డే ఉదయం రుబ్బుకొని, రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకే, చాలా మంది మహిళలు మార్నింగ్ బ్రేక్​ ఫాస్ట్​లో ఇడ్లీ తయారీ అంటే వెనకడుగు వేస్తుంటారు.

అలాకాకుండా మీకు టైమ్​ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ "పొడిని" ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. పప్పు నానబెట్టడం, రుబ్బడం వంటి ఎలాంటి హడావుడి లేకుండా ఎప్పటికప్పుడు నిమిషాల్లో సూపర్ సాఫ్ట్​గా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ పొడిని ఫ్రిడ్జ్​లో స్టోర్ చేసుకుంటే కనీసం 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అదే, నార్మల్​గా​ బయట ఉంచితే కనీసం రెండు నెలలైనా నిల్వ చేసుకోవచ్చు. మరి, ఇన్​స్టంట్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన ఆ పౌడర్​ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Idli Making Process
Soft Idli Tips (Getty Images)

ఈ టిప్స్​ తెలుసుకోవాలి :

  • ఇక్కడ మీరు మినపగుండ్లకు బదులుగా మినపప్పుని అయినా తీసుకోవచ్చు.
  • మీకు ఈ పౌడర్ ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఇదే కొలతలతో పదార్థాల పరిమాణాన్ని పెంచి చేసుకోవచ్చు.
  • ఇక్కడ మీరు ఇడ్లీ రవ్వను కావాలనుకుంటే మూడు కప్పుల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు.
Idli Making
Idli (ETV Bharat)

తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  1. మినపగుండ్లు - 1 కప్పు
  2. అటుకులు - 1 కప్పు
  3. ఇడ్లీ రవ్వ - రెండున్నర కప్పులు

10 నిమిషాల్లో ఇడ్లీ పిండితో "వడలు" - టేస్ట్​ వేరే లెవల్​ - ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు!

Soft Idli Recipe
Idli Premix (ETV Bharat)

సింపుల్​గా తయారు చేసుకోండిలా :

  • ఇన్​స్టంట్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పౌడర్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మినపగుండ్లు వేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే దోరగా వేగితే సరిపోతుంది
  • అంతేకానీ, మరీ ఎక్కువగా మినపప్పు కలర్ మారేంత వరకు వేయించుకోవద్దు. తర్వాత వేయించిన మినపగుండ్లను ఒక ప్లేట్​లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • అవి చల్లారేలోపు అదే పాన్​లో అటుకులను వేసి కొద్దిగా వేయించుకొని పక్కకు తీసి చల్లార్చుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మినపగుండ్లను వేసుకొని మెత్తని పౌడర్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్) తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న మినప్పిండిని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి.
  • ఇక్కడ జల్లించుకున్నాక మెదగని రవ్వ ఎక్కువగా వస్తే మరోసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వస్తే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో చల్లారిన అటుకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మినప్పిండి ఉన్న ప్లేట్​లో వేసుకోవాలి. అవసరమనుకుంటే అటుకుల పొడిని కూడా జల్లించుకొని తీసుకోవచ్చు.
  • ఆ తర్వాత మినప్పిండి ఉన్న పాత్రలో ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకొని ఎక్కడా చిన్న చిన్న ఉండల్లాంటివి లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, "ఇడ్లీ ప్రిమిక్స్" రెడీ అయిపోతుంది.
Idli Making At Home
Soft Idli Recipe (Getty Images)
  • ఇక మీరు ఇడ్లీలు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి ఒక మిక్సింగ్​ బౌల్​ తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ మిక్స్ వేసుకోవాలి.
  • ఆపై దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మరికొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకోవాలి. అనంతరం రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూతపెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి.
  • మరుసటి రోజు ఇడ్లీలు చేసుకోవడానికి ముందు పిండిని పై నుంచి కిందికి ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకొని, తగినంత పిండిని ఆ గుంటల్లో నింపుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని ఇడ్లీ పాత్రలో ఉంచి మీడియం ఫ్లేమ్ మీద 10 నుంచి 12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరమైన "మెత్తని దూది లాంటి ఇడ్లీలు" మీ ముందు ఉంటాయి!

కేవలం మూడు పదార్థాలతో సూపర్ సాఫ్ట్ "జొన్న ఇడ్లీలు" - ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు!

రేషన్​ బియ్యంతో 'ఇడ్లీ రవ్వ' - ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండిలా! - ఇడ్లీలు సాఫ్ట్​గా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.