ETV Bharat / offbeat

చుక్క నూనె లేకుండానే కమ్మని "పప్పు కూర"! - నోరూరించే రుచితో నిమిషాల్లోనే రెడీ!

-సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ జీరో ఆయిల్ "దాల్ తడకా" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు!

No Oil Dal Recipe
No Oil Dal Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : July 6, 2025 at 11:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

No Oil Dal Recipe in Telugu : మనం ఏ కర్రీ చేసుకున్నా అందులో తగినంత నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే ఆ రెసిపీ మంచి రుచికరంగా కుదురుతుంది. ఇక వేపుడు వంటి వంటకాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, వంటకాల్లో నూనెను అతిగా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ క్రమంలోనే చాలా మంది ఆయిల్ లెస్ వంటకాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారికోసమే చుక్క నూనె వేయకుండా చేసుకునే ఒక అద్భుతమైన పప్పు కర్రీని పరిచయం చేస్తున్నాం. టేస్ట్ సూపర్​గా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే అంత కమ్మగా ఉంటుంది. పైగా ఈ కర్రీని అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి, అద్భుతమైన రుచితో వావ్ అనిపించే ఈ జీరో ఆయిల్‌ దాల్‌ తడకా రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Dal Tadka Recipe without Oil
Pappu (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • ఒక కప్పు - కందిపప్పు
  • అర కప్పు - ఉల్లిపాయ తరుగు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • రెండు - వెల్లుల్లి రెబ్బలు
  • ఒక చెంచా - అల్లం పేస్ట్
  • రెండు - పచ్చిమిర్చి
  • అర చెంచా - పసుపు
  • అర టీస్పూన్ - ఆవాలు
  • ఒక చెంచా - ధనియాల పొడి
  • అర చెంచా - గరం మసాలా
  • ఒక చెంచా - జీలకర్ర
  • అర చెంచా - కసూరీ మేథీ
  • తగినంత - కారం
  • నిమ్మరసం - చెంచా
  • చిటికెడు - ఇంగువ
  • ఒకటి - ఎండుమిర్చి
  • పావు కప్పు - కొత్తిమీర తరుగు
  • రెండు - కరివేపాకు రెబ్బలు

అమ్మమ్మల పద్ధతిలో కమ్మని "గోంగూర కోడిగుడ్డు కూర" - ఇలా చేస్తే కనీసం 30 రోజులు నిల్వ!

Dal Tadka Recipe without Oil
Onions (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి.
  • పప్పు మెత్తగా ఉడికే లోపు కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీరను సన్నగా తరుక్కొని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు దాల్ తడకా కర్రీ కోసం స్టవ్ మీద పాన్ ఉంచి ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి , ఉల్లిపాయ తరుగుని వేసుకొని లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించుకోవాలి.
  • ఇలా వేయించుకునే క్రమంలో ఒకవేళ అడుగంటుతున్నట్టు అనిపిస్తే నాలుగు చుక్కల వాటర్ చల్లుకొని లేత గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, టేస్ట్​కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరీ మేథీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుతూ అర నిమిషం సేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మెత్తగా ఉడికిన కందిపప్పుని ఒక బౌల్​లోకి తీసుకొని అందులో ముందుగా వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిపి పక్కనుంచాలి.
Dal Tadka Recipe without Oil
Mirchi (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద మరో పాత్రలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, ఇంగువ, కరివేపాకులను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ సన్నని సెగ మీద చక్కగా వేయించాలి.
  • అవి చక్కగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం ఈ దినుసులను కూడా పప్పులో వేసి కలపాలి.
  • ఇక చివర్లో కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు, నిమ్మరసం యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకుంటే చాలు. అంతే, చుక్క నూనె లేకుండానే కమ్మని రుచితో నోరూరించే "దాల్‌ తడకా కర్రీ" రెడీ అయిపోతుంది!

చికెన్ కర్రీ మిగిలిందా? - ఇలా "బిర్యానీ" చేసుకోండి! - ఒక్కో ముద్ద నోట్లోకి వెళ్తుంటే వహ్వా అనాల్సిందే!

కాల్చిన కొబ్బరి, ఉల్లిపాయలతో "బ్లాక్ మటన్ కర్రీ"! - ఈ ఘుమఘుమలకు మైమరచిపోతారు!