ETV Bharat / offbeat

ఇడ్లీ పిండిలో ఇదొక్కటి వేసి "పునుగులు" చేయండి - కమ్మగా, కరకరలాడుతూ భలే రుచిగా వస్తాయి!

- రోజూ ఇడ్లీ పెడితే పిల్లలు తినట్లేదా? - అదే పిండితో కరకరలాడే "పునుగులు" చేసి ఇవ్వండిలా!

New Style Punugulu Recipe
Punugulu Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 6, 2025 at 10:24 AM IST

3 Min Read
Choose ETV Bharat

New Style Punugulu Recipe with Idli Batter : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో చాలా మంది ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, రోజూ ఇడ్లీ అంటే పిల్లలే కాదు పెద్దవాళ్లు తినడానికి ఇష్టపడరు. అందుకే చాలా మంది ఇళ్లల్లో కొన్నిసార్లు ఇడ్లీ పిండి మిగిలిపోతుంటుంది. దాంతో ఏం చేసుకోవాలో తెలియక పక్కన పెట్టేస్తుంటారు. అయితే, ఇకపై అలా చేయాల్సిన పని లేదు. అప్పటికప్పుడు మిగిలిన ఇడ్లీ పిండితో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా "పునుగులు" ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ సమయంలో మంచి రుచికరంగా వీటిని రెడీ చేసుకోవచ్చు. ఇవి కేవలం బ్రేక్​ఫాస్ట్​లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్​గానూ అద్దిరిపోతాయి. వంటసోడాతో పని లేకుండా చేసుకునే కరకరలాడే ఈ పునుగులను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

New Style Punugulu Recipe
Pindi (ETV Bharat)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  • ఇడ్లీ పిండి - మూడు కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • సన్నని పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్​స్పూన్
  • కరివేపాకు తరుగు - రెండు టేబుల్​స్పూన్లు
  • సన్నగా కట్ చేసుకున్న మునగాకు - పావు కప్పు
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • గోధుమపిండి - రెండు టేబుల్​స్పూన్లు
  • బియ్యప్పిండి - మూడు టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - డీప్​ ఫ్రైకి తగినంత

"కజ్జికాయలు" చేసుకునే సరికొత్త పద్ధతి - పీట లేకున్నా ఒక్కరే నిమిషాల్లో ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు!

New Style Punugulu Recipe
Punugulu Making (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ పునుగుల తయారీ కోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన పరిమాణంలో పచ్చిమిర్చి, కరివేపాకు తరుగుని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే, మునగాకుని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • అదేవిధంగా, ఉల్లిపాయలను ఒక కప్పు పరిమాణంలో సన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కాస్త వెడల్పాటి గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఆపై అందులో రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, మునగాకు తరుగు, వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి.
  • అలాగే, బైండింగ్ కోసం గోధుమపిండి, బియ్యప్పిండిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • పిండిని సరైన కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్నాక పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
New Style Punugulu Recipe
Punugulu Recipe (ETV Bharat)
  • ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో పునుగుల మాదిరిగా వేసుకోవాలి.
  • కడాయిలో సరిపడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్​లో రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ షేడ్ వచ్చే వరకు చిల్లుల గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, అప్పటికప్పుడు ఇడ్లీ పిండితో టేస్టీ టేస్టీగా కరకరలాడే కమ్మని "పునుగులు" రెడీ!
  • అనంతరం వీటిని టమాటా చట్నీ లేదా మీకు నచ్చి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుంది! మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా పునుగులు చేసుకోండి. ఇంటిల్లిపాదీ భలే ఇష్టంగా తింటారు.
New Style Punugulu Recipe
Punugulu Recipe (ETV Bharat)

పునుగుల రుచిని పెంచే సీక్రెట్ టిప్స్ :

  • ఈ రెసిపీకి మంచి రుచిని తీసుకొచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ "మునగాకు". ఇది వేసుకోవడం ద్వారా పునుగులకు కమ్మని రుచి రావడంతో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి!
  • ఇక్కడ మీకు మునగాకు వేసుకోవడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్​లో మెంతికూర, కొత్తిమీర వంటివి అయినా తీసుకోవచ్చు. ఇవి వేసుకున్నా పునుగులకు మంచి రుచి వస్తుంది.
  • ఒకవేళ పిండి కాస్త పలుచన అయితే కొద్దిగా బియ్యప్పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇది వేయడం ద్వారా పునుగులు క్రిస్పీగా వస్తాయి. అలాగే, మరీ గట్టిగా అయితే కొద్దిగా వాటర్​ని వేసుకొని కలుపుకోవచ్చు.

అన్నంతో కరకరలాడే "వడలు" - నూనె కూడా పీల్చవు! - చట్నీ లేకుండానే తినేయొచ్చు!

"ఉప్మా" రుచికరంగా రావాలంటే - నీళ్లకు బదులు 'ఇవి' పోసి చేయండి! - పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు!