ETV Bharat / offbeat

రేషన్ బియ్యంతో కరకరలాడే "పునుగులు" - ఈ పద్ధతిలో చేస్తే నూనె పీల్చవు! - టేస్ట్ సూపర్!

- మైదా, వంటసోడా, పెరుగు లేకుండానే - సింపుల్​గా చేసుకునే పునుగుల రెసిపీ!

New Style Punugulu Recipe
New Style Punugulu Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 24, 2025 at 4:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

New Style Punugulu Recipe : చిరు జల్లులు కురుస్తున్న చల్లని వేళ వేడి వేడిగా ఏమైనా తినాలనిపించడం సహజం. అలా అనిపించినప్పుడు ఎక్కువ మంది ఇంట్లో పకోడీ, మిర్చి బజ్జీ, పునుగులు వంటివి చేసుకుంటుంటారు. వీటిలోనూ పునుగులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే, నార్మల్​గా ఎక్కువ మంది మైదా పిండి, వంటసోడా, పెరుగు వంటివి వేసి పునుగులు చేస్తుంటారు. కానీ, అవేమి లేకుండా రేషన్ బియ్యం, బంగాళదుంపలతో కలిపి ఓసారిలా కొత్తగా "పునుగులను" ట్రై చేయండి. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్​గా చేసుకునే ఈ పునుగులు మంచి క్రిస్పీగా రావడమే కాకుండా బండి మీద అమ్మే వాటిలా భలే రుచిగానూ ఉంటాయి. అంతేకాదు, ఇవి ఆయిల్​ని కూడా అంత ఎక్కువగా పీల్చుకోవు! మరి, తక్కువ నూనెతో ఎక్కువ రుచినిచ్చే ఈ పునుగులను ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

New Style Punugulu Recipe
Rice (Getty Images)

అవసరమైన పదార్థాలు :

  • రేషన్ బియ్యం - రెండు కప్పులు
  • బంగాళదుంపలు - నాలుగు(మీడియం సైజ్​వి)
  • సన్నని అల్లం తరుగు - రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి - నాలుగైదు
  • ఉల్లిపాయలు - రెండు(మీడియం సైజ్​వి)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కరివేపాకు తరుగు - ఒకట్రెండు చెంచాలు
  • జీలకర్ర - రెండు టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఆయిల్ - వేయించడానికి సరిపడా

బోనాల వేళ కొబ్బరి చిప్పలు మిగిలాయా? - ఇలా "కొబ్బరి లడ్డూలు" చేసుకోండి! - పాకంతో పని లేదు!

New Style Punugulu Recipe
Aloo (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రుచికరమైన పునుగుల తయారీకి ముందుగా ఒక బౌల్​లో రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసుకొని మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఇక్కడ మీ వద్ద రేషన్ బియ్యం లేకపోతే వాటి ప్లేస్​లో నార్మల్ రైస్​ని అయినా తీసుకోవచ్చు.
  • బియ్యం నానేలోపు రెసిపీలోకి అవసరమైన బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఆపై వాటి పొట్టు తొలగించి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే, కొద్దిగా అల్లాన్ని పొట్టు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరుక్కొని పక్కనుంచాలి.
New Style Punugulu Recipe
Onions (ETV Abhiruchi)
  • బియ్యం బాగా నానిన తర్వాత మరోసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్​లోకి తీసుకోవాలి.
  • తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, చాలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మరీ ఎక్కువ వాటర్ వేస్తే పిండి జారుగా మారి పునుగులు వేసుకోవడం ఇబ్బంది అవుతుందని గుర్తుంచుకోవాలి.
  • అనంతరం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని ఆపై అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి.
  • అలాగే, జీలకర్ర, టేస్ట్​కి సరిపడా ఉప్పు వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా పునుగులకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకొని ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి.
New Style Punugulu Recipe
Mirchi (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద లోతైన కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి హీట్ చేసుకోవాలి.
  • ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో నెమ్మదిగా పునుగుల్లా వేసుకోవాలి.
  • పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు అలాగే కాలనిచ్చి ఆపై చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్​లో పునుగులు క్రిస్పీగా మారి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేయడం ద్వారా న్యాప్​కిన్ అదనపు ఆయిల్​ని పీల్చేస్తుంది.
  • ఆ తర్వాత టమాటా చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా కరకరలాడే "పునుగులు" మీ ముందు ఉంటాయి!
New Style Punugulu Recipe
Punugulu Recipe (Getty Images)

చిట్కాలు :

  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా అయినట్లయితే కాస్త గట్టిగా అవ్వడానికి ఒకట్రెండు టేబుల్​స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు.
  • నూనె కాగిన తర్వాత మాత్రమే పునుగులను వేసుకోవాలి. లేదంటే ఆయిల్​ని ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.
  • అలాగే, పునుగులను వేయించేటప్పుడు స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లోనే ఉంచి వేయించాలి.

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా కర్రీ" - అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయకుండానే అద్భుతమైన రుచి!

నోరూరించే కొత్తరకం "దోశ" ట్రై చేయండి! - భలే రుచిగా ఉంటుంది!