ETV Bharat / offbeat

బ్యాచిలర్స్ కోసం అద్దిరిపోయే "చికెన్ ఫ్రై" - తక్కువ పదార్థాలతోనే ఘుమఘుమలాడిపోతుంది!

ఒక్కసారి ఈ స్టైల్​లో 'చికెన్ వేపుడు' చేసుకోండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Bachelors Special Chicken Curry
Bachelors Chicken Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 27, 2025 at 3:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bachelors Special Chicken Curry in Telugu : కిచెన్​లో కుకింగ్ ఇంగ్రీడియంట్స్ సరిపడా లేకపోతే మంచి రుచికరంగా కర్రీలు చేయడం పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. అందులోనూ బ్యాచిలర్స్ కష్టాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ముఖ్యంగా నాన్​వెజ్ రెసిపీలైనా చేపలు, మటన్, చికెన్ వంటివి​ వండుకోవాలనుకున్నప్పుడు అందులోకి కావాల్సిన ప్రత్యేకమైన మసాలా దినుసులు, మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అందుబాటులో ఉండవు.

అలాంటి టైమ్​లోనూ చాలా రుచికరంగా చేసుకునే ఒక నాన్​వెజ్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే బ్యాచిలర్స్ స్పెషల్ "చికెన్ వేపుడు". దీన్ని వంటగదిలో అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్​తోనే తక్కువ టైమ్​లో చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే, ఎప్పుడూ రెగ్యులర్ చికెన్ కర్రీలను తిని బోర్ కొట్టిన వారికి సరికొత్త టేస్ట్​ని అదిస్తుంది. ఇలా చేశారంటే నీచు వాసన లేకుండా ముక్క తినేటప్పుడు సాఫ్ట్​గా, మంచి రుచికరంగానూ ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • అరకేజీ - చికెన్
  • నూనె - 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు(తగినంత)
  • రెండు రెమ్మలు - కరివేపాకు
  • నాలుగు - పచ్చిమిర్చి
  • రెండు టీస్పూన్లు - అల్లంవెల్లుల్లి పేస్ట్
  • అరటీస్పూన్ - పసుపు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • మీడియం సైజ్ ఉల్లిపాయలు - రెండు
  • ఒకటి - టమాటా
  • రుచికి తగినంత - కారం
  • ఒకటీస్పూన్ - ధనియాల పొడి
  • అరటీస్పూన్ - గరంమసాలా
  • అరటీస్పూన్ - జీలకర్ర పొడి
  • కొద్దిగా - సన్నని కొత్తిమీర తరుగు
  • జీడిపప్పు పలుకులు - కొన్ని(ఆప్షనల్)

సరికొత్త పద్ధతిలో "టమాటా కోడిగుడ్డు కూర" - ఇలా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చాల్సిందే!

Bachelors Special Chicken Curry
Chicken (Getty Images)

తయారీ విధానం :

  • బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ కూర తయారీ కోసం ముందుగా చికెన్​ని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అలాగే, రెసిపీలో కావాల్సిన టమటా, ఉల్లిపాయలను సన్నగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కర్రీకి అనుగుణంగా ఉండే గిన్నెను పెట్టుకొని తగినంత నూనెను పోసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమంలో నీట్​గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలపాలి.
Bachelors Special Chicken Curry
Onions (Getty Images)
  • తర్వాత స్టవ్​ను మీడియం టూ హై ఫ్లేమ్​కి అడ్జస్ట్ చేసుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపి వేయించాలి.
  • అంటే, చికెన్ ముక్కల నుంచి ఊరే నీళ్లు ఇగిరిపోయి ముక్కలు కాస్త రంగు మారి మిశ్రమంలో నుంచి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి.
  • ఈవిధంగా వేయించుకోవడం ద్వారా చికెన్​లో ఉండే నీచు వాసనంతా పోయి తినేటప్పుడు ముక్క రుచికరంగా ఉంటుంది.
  • అలా చికెన్​ని వేయించుకున్నాక అందులో రుచికి తగినంత ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
Bachelors Special Chicken Curry
Mirchi (Getty Images)
  • అనంతరం గిన్నె​పై మూత పెట్టి స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు నెమ్మదిగా వేయించుకోవాలి.
  • ఇలా వేయించడం ద్వారా ముక్క అనేది గట్టి పడకుండా సాఫ్ట్​గా ఉండడమే పైన ఎర్రగా బాగా వేగుతుందని గుర్తుంచుకోవాలి.
  • పది నిమిషాల అనంతరం మూత తీసి చూస్తే ఉల్లిపాయ, టమాటా చక్కగా ఉడికి, చికెన్ ఎర్రగా వేగి కనిపిస్తుంది.
  • అలా వేగిన తర్వాత ఆ మిశ్రమంలో జీడిపప్పు పలుకులు వేసి కాసేపు వేయించాలి. ఒకవేళ మీకు జీడిపప్పు అందుబాటులో లేకపోతే స్కిప్ చేయొచ్చు.
  • అనంతరం మీరు తినే రుచికి తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా యాడ్ చేసుకొని బాగా కలపాలి.
  • ఆపై అవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా సన్నని సెగ మీదనే మరో మూడ్నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక చివర్లో సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, బ్యాచిలర్స్​తో పాటు ఎవరైనా చాలా సింపుల్​గా చేసుకునే కమ్మని "చికెన్ వేపుడు" మీ ముందు ఉంటుంది!

చింతపండు లేకుండా "మసాలా ఫిష్ కర్రీ" - నీచు వాసనకు తావు లేదు! - హోటల్​ టేస్ట్​ పక్కా!

ఘుమఘుమలాడే "చేపల పచ్చడి" - ఈ కొలతలతో చేస్తే పక్కా మూడు నెలలు నిల్వ!