ETV Bharat / offbeat

నెయ్యి లేకుండా మూడే మూడు పదార్థాలతో కమ్మని "మైసూర్ పాక్" - కేవలం అరగంటలో రెడీ! - MYSORE PAK RECIPE NO GHEE AT HOME

ఇంట్లోనే నోరూరించే మైసూర్ పాక్ - ఇలా చేశారంటే స్వీట్​షాప్​ని మించిన టేస్ట్!

Mysore Pak at Home
Mysore Pak (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : April 9, 2025 at 10:36 AM IST

5 Min Read

Mysore Pak Making Process : మైసూర్ పాక్ అంటే ఇష్టపడనివారూ దాదాపుగా ఉండరు. మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు దీనిని టేస్ట్ చేసే ఉంటారు. ఆ రుచి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, చాలా మంది ఎప్పడు తినాలనుకున్నా స్వీట్ షాప్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటుంటారు. కానీ, మీకు తెలుసా? అదే "మైసూర్​ పాక్​"ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నెయ్యి లేకుండానే తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్​ని మించిన రుచి​తో గుల్లగా, పర్ఫెక్ట్​గానూ వస్తాయి.

పైగా దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అలాగే, ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా పట్టవు. 15 నుంచి 20 నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కానీ, మైసూర్ పాక్ చేసే క్రమంలో చివర్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మెత్తగా రావడం, పొడిపొడిగా రావడం జరుగుతుంటుంది. మరి, ఇంకెందుకు ఈ చిన్న చిన్న సీక్రెట్ టిప్స్ ఫాలో అవుతూ కమ్మని మైసూర్ పాక్​ని ఇంట్లోనే చేసుకోండిలా.

ఈ టిప్స్​తో పర్ఫెక్ట్ టేస్ట్ :

  • ఈ రెసిపీ కోసం వీలైనంత వరకు కాస్త మందపాటి పాన్​ని తీసుకోవాలి. ఎందుకంటే, పల్చని పాన్ తీసుకుంటే మైసూర్ పాక్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే, పిండిని తీసుకున్న కప్పుతో చక్కెరను తీసుకోవాలి.
  • ఇక్కడ సన్​ఫ్లవర్ ఆయిల్ తీసుకోవడం ద్వారా స్వీట్ మంచి టేస్టీగా వస్తుంది. అదే, మీరు పల్లీ నూనె, నువ్వుల నూనె వంటివి తీసుకున్నారంటే అదే ఫ్లేవర్ స్వీట్​కి వస్తుంది. అందుకే, ఫ్లేవర్ లేని సన్​ఫ్లవర్ ఆయిల్ తీసుకోవడం బెటర్.
  • తీగ పాకం వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలంటే, కరిగిన పాకాన్ని కొద్దిగా గరిటెతో తీసుకొని రెండు వేళ్లతో పట్టుకుని సాగదీస్తే తీగలా సాగాలి.
  • నూనె సరిగ్గా, వేడిగా లేకపోయినా మైసూర్ గుల్లగా, పర్ఫెక్ట్​గా రాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఆయిల్ అనేది వేడిగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇక్కడ మీరు గిన్నెకు అప్లై చేసుకోవడానికి నూనెకు బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చు.
Mysore Pak
Chickpea Flour (Getty Images)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  1. శనగపిండి - 1 కప్పు
  2. చక్కెర - 2 కప్పులు
  3. సన్​ఫ్లవర్ ఆయిల్ - పావు తక్కువ రెండు కప్పులు
  4. యాలకుల పొడి - అరటీస్పూన్(ఆప్షనల్)

నో షుగర్​, నో మిల్క్​పౌడర్​ - నిమిషాల్లో సూపర్​ టేస్టీ " కుల్పీ" - పైగా ఆరోగ్యం బోనస్​!

HOMEMADE MYSORE PAK
MYSORE PAK (ETV Bharat)

తయారీ విధానమిలా :

  • మైసూర్ పాక్​ని వెంటనే తీసుకోవడానికి ముందుగానే ఒక గిన్నె లేదా మౌల్డ్​ని తీసుకొని లోపల నూనె/నెయ్యిని రాసి సిద్ధంగా ఉంచుకోవాలి.
  • అనంతరం మైసూర్ పాక్ చేయడానికి ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో చక్కెర వేసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత ఒక సాస్ పాన్ తీసుకొని అందులో సన్​ఫ్లవర్ ఆయిల్ పోసుకొని పక్కన ఉంచాలి.
  • ​ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో జల్లించిన శనగపిండిని తీసుకొని అందులో కొలిచి పక్కన పెట్టుకున్న ఆయిల్​లో నుంచి మూడు నాలుగు గరిటెల నూనెను పోసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఎక్కడా ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
  • దీని వలన మనం పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
Mysore Pak
Mysore Pak at Home (ETV Bharat)
  • ఇప్పుడు స్టవ్ ఆన్​ చేసి నూనె ఉన్న సాస్ పాన్​ పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్​ను లో ఫ్లేమ్​కి టర్న్ చేసి ఉంచాలి.
  • అనంతరం మరో బర్నర్ మీద చక్కెర తీసుకున్న పాన్​ని ఉంచి అరకప్పు వరకు వాటర్ పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • చక్కెర పూర్తిగా కరిగి, తీగ పాకం వచ్చాక అందులో ముందుగా నూనెలో కలిపి పెట్టుకున్న శనగపిండిని నెమ్మదిగా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • శనగపిండిని వేసుకునేటప్పుడు స్టవ్​ను మీడియం లేదా లో ఫ్లేమ్​లో ఉంచి వేసుకోవాలి.
  • ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పిండి చక్కగా ఉడికి బుడగలు రావడం స్టార్ట్ అయ్యాక మరో బర్నర్​ మీద సన్నని సెగ మీద కాగుతున్న ఆయిల్​ని ఒక గరిటెడు శనగపిండి మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి.
  • రెండు నిమిషాలయ్యేసరికి శనగపిండి మిశ్రమం నూనె అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్లీ ఉడకడం స్టార్ట్ అవుతుంది.

పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

HOMEMADE MYSORE PAK
MYSORE PAK (ETV Bharat)
  • ఇక్కడ ఒక పక్క శనగపిండిని ఉడికించుకుంటూ, మరో పక్క ఆయిల్​ని వేడి చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే వేడివేడిగా మైసూర్​ పాక్​లో వేసి ఉడికించుకోవచ్చు.
  • అనంతరం మరో గరిటెడు నూనెను శనగపిండిలో వేసుకుంటూ కలుపుతూ ఉడకడం స్టార్ట్ అయ్యాక మళ్లీ ఇంకో గరిటెడు కాగుతున్న ఆయిల్ వేసుకోవాలి. చివరగా ఒక్క గరిటెడు ఆయిల్ మిగిలే వరకు ఇదే​ ప్రాసెస్​ను కంటిన్యూ చేస్తూ కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి.
  • ఈ స్టేజ్​లో మంట అనేది ఎక్కువగా ఉండకుండా లో లేదా మీడియంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటేనే మైసూర్ పాక్ మాడిపోకుండా చక్కగా వస్తుంది.
  • అలాగే, మీరు యాలకుల పొడి వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్​లో యాడ్ చేసుకోవచ్చు.
  • మెయిన్​గా చెప్పాలంటే మైసూర్ పాక్ ఉడికించేటప్పుడు ఎక్కువగా గుల్లగా వచ్చి పాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా వస్తుందంటే మైసూర్ పాక్ రెడీ అవుతుందని అర్థం.
HOMEMADE MYSORE PAK
MYSORE PAK (ETV Bharat)
  • చివరగా రెండు గరిటెల ఆయిల్ ఉనప్పుడు చాలా జాగ్రత్తగా ఫాస్ట్​గా చేసుకోవాలి. అందులో ఒక గరిటెడు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన గరిటెడు నూనె వేసి కలపకుండా అలాగే ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న మౌల్డ్ లేదా గిన్నెలో వేసుకోవాలి.
  • గిన్నెలో వేసుకున్నాక మరీ ఒత్తినట్లు కాకుండా పైపైన స్లోగా గరిటెతో మొత్తం సమానంగా ఉండేలా చేసుకొని రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
  • ఆ తర్వాత చాకుతో నిలువుగా, మీకు కావాల్సిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిని తర్వాత కట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్​లో కట్ చేసుకోవాలి.
  • కట్ చేసుకున్నాక అది పూర్తిగా చల్లారే వరకు గంట లేదా రెండు గంటలు అలాగే పక్కనుంచాలి.
  • మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్​లోకి డీమౌల్డ్ చేసుకొని గాట్లు పెట్టుకున్న వాటిని పీసెస్​గా వీడదీసి తీసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని "మైసూర్ పాక్" ఇంట్లోనే రెడీ అయిపోతుంది!

పెసరపప్పుతో కమ్మనైన "ధారాక్షి స్వీట్" - పైన కరకర, లోపల జ్యూసీగా!

ఆడవాళ్లు తప్పక తినాల్సిన "స్వీట్" - వెయిట్​ లాస్​కి బెస్ట్ ఆప్షన్! - అమ్మమ్మల పద్ధతిలో ఇలా రెడీ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.