ETV Bharat / offbeat

"మటన్​ కీమా బిర్యానీ" ఒక్కసారి కూడా తినలేదా? - ఈ సండే ట్రై చేయండి - ఆత్మారాముడు ఆనంద తాండవమే!

- చికెన్​, మటన్​ బిర్యానీలు రెగ్యులర్​ - ఇలా కీమా బిర్యానీ చేసుకున్నారంటే మైమరచిపోతారు!

Mutton Keema Biryani
How to Make Mutton Keema Biryani (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2025 at 4:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Make Mutton Keema Biryani : బిర్యానీకి ఫ్యాన్​ బేస్​ ఓ రేంజ్​లో ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి ఫ్యానే. అందుకే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బిర్యానీ లాగించేస్తుంటారు జనాలు. ఇక బిర్యానీ అంటే చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​తో చేసినవి​ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి.

మరి మీరు ఎప్పుడైనా మటన్ కీమా బిర్యానీ తిన్నారా? తినకపోతే ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. మీ ఆత్మారాముడు ఆనంద తాండవం చేస్తాడు. కేవలం తక్కువ పదార్థాలతో ఇంట్లోనే చాలా సింపిల్​ అండ్​ టేస్టీగా చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఈ కీమా బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​
  • నూనె - 1 టేబుల్​ స్పూన్​
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిరపకాయ - 1
  • అల్లం వెల్లుల్లి పేస్టు
  • టమాటాలు - 2
  • పసుపు - 1 / 2 టీస్పూన్
  • కారం - 2 టీస్పూన్లు
  • గరం మసాలా పొడి - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • రుచికి సరిపడా ఉప్పు
  • కీమా - 500 గ్రాములు
  • పెరుగు - 1 / 2 కప్పు
  • పుదీనా ఆకులు - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కుంకుమ పువ్వు కలిపిన పాలు - 2 టేబుల్​ స్పూన్లు
  • చపాతీ పిండిముద్ద

ఫ్రైడ్ ఉల్లిపాయలు చేయడానికి కావలసినవి

  • నూనె - 1 /4 కప్పు
  • ఉల్లిపాయలు - 4 (సన్నగా తరిగినవి)

బిర్యానీ తయారుచేయడానికి కావలసినవి

  • నీళ్లు
  • బాస్మతి బియ్యం - 500 గ్రాములు(అరగంట సేపు నానబెట్టాలి)
  • ఉప్పు - 2 టీస్పూన్లు
  • బిర్యానీ ఆకులు - 2
  • యాలకులు - 3
  • నల్ల యాలకులు - 2
  • జాపత్రి - చిన్న ముక్క
  • అనాస పువ్వు - 1
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు
  • నూనె - 1 టీస్పూన్

తయారుచేసే విధానం:

  • ముందుగా ఫ్రైడ్​ ఆనియన్స్​ ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకూ వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే స్టవ్​ మీద మరో గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లలోకి నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు, బిర్యాని ఆకు, యాలకులు, నల్ల యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, నూనె వేసి కలిపాలి. ఆ తర్వాత అన్నాన్ని ముప్పావు శాతం ఉడికించి పక్కన పెట్టాలి.
  • అన్నం ముప్పావంతు ఉడికిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో స్టవ్​ మీద గిన్న పెట్టి అందులో నెయ్యి, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించాలి.
  • ఆ తర్వాత అందులోకి టమాటా ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి ఓ 5 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • కీమా వేసి బాగా కలుపుకుని 15 నిమిషాల పాటు కుక్​ చేసుకోవాలి. అనంతరం ఇందులోకి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 15 నిమిషాలు ఉడికించాలి.
  • ఉప్పు కోసం రుచి చూసి, తగ్గిందనిపిస్తే కొద్దిగా వేసి, ఫ్లేమ్​ను సిమ్​లో పెట్టి కీమాను సమంగా పరచుకోవాలి.
  • ఇందులో పుదీనా ఆకులు, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసి ఆ తరువాత వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి.
  • ఇప్పుడు మళ్లీ దాని పైన పుదీనా ఆకులు, కొత్తిమీర, కుంకుమ పువ్వు కలిపిన పాలు, వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • మూత పెట్టిన తరువాత, చపాతీ పిండిముద్దతో గిన్నెని, మూతని కలిపి మూసేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు దమ్​ చేసుకోవాలి.
  • 10 నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మరో 10 నిమిషాలు అలానే ఉంచాలి.
  • ఆ తర్వాత మూత తీసి జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. అంతే, కీమా బిర్యానీ తయారైపోయింది.
  • దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఈ సండే రోజూ మీరు ట్రై చేయండి.

తమిళ తంబీల​ "దిండిగల్​ మటన్​ బిర్యానీ" - ఓ రేంజ్​లో ఉంటుంది!

ముక్క చెదరకుండా ప్రెషర్​ కుక్కర్​లో "ఫిష్​ బిర్యానీ" - ఇలా చేస్తే సండే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!