ETV Bharat / offbeat

మూడే మూడు పదార్థాలతో రుచికరమైన "బొరుగు ముద్దలు" - ఇలా చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! - PERFECT MURMURA LADDU RECIPE

స్వీట్ షాప్ స్టైల్​లో కమ్మని మరమరాల లడ్డూలు తయారు చేసుకోండిలా!

Maramaralu Laddu
Maramaralu Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 22, 2025 at 9:00 AM IST

3 Min Read

Maramaralu Laddu Making Process : మరమరాలు వీటినే పేలాలు, బొరుగులు, బొంగు పేలాలు, ముర్ముర్లు, మురీలు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. అయితే, మీరు ఇప్పటి వరకు మరమరాలతో రకరకాల స్నాక్ రెసిపీలు ప్రిపేర్ చేసుకొని ఉంటారు. కానీ, వీటితో ఎప్పుడైనా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నారా? లేదు అంటే ఓసారి తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. దీన్నే "బొరుగుల లడ్డూ, బొరుగుల ముద్ద" అని కూడా అంటారు. ఇది చేయడం చాలా సింపుల్. కానీ, కొన్ని టిప్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ టేస్ట్​తో వస్తాయి. పిల్లలైతే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు

  • మరమరాలు - 100 గ్రాములు
  • బెల్లం తురుము - 200 గ్రాములు
  • నెయ్యి - అర చెంచా

కమ్మని కలర్​ఫుల్ "కొబ్బరి లడ్డూలు" - ఫుడ్ కలర్స్ లేకుండానే! - పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు!

తయారీ విధానం

  • ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి మరమరాలను లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో బెల్లం తురుము, 100ఎంఎల్ వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లాన్ని మరిగించుకునేటప్పుడు అందులో నెయ్యి వేసుకోవాలి.
  • బెల్లం పూర్తిగా కరిగి నురగ నురగగా మారి, ముదురు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.
  • అయితే, పర్ఫెక్ట్ పాకం వచ్చిందని తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. అదేంటంటే, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో గరిటెతో కొద్దిగా పాకాన్ని వేసుకోవాలి. కాసేపటికి అది ముద్ద కట్టాలి.
  • అంతేకాదు, ఈ రెసిపీ కోసం ముదురు పాకం కనుక పట్టకపోతే మరమరాలు రెండు మూడు రోజులకే పొడిపొడిగా విడిపోతాయి.
MURMURA LADDU RECIPE
MURMURA LADDU RECIPE (ETV Bharat)
  • అలా పర్ఫెక్ట్ పాకం వచ్చిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మరమరాలను పాకంలో వేసి మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి.
  • మరమరాలు, పాకం రెండు చక్కగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక అది కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఎందుకంటే, మిశ్రమం చల్లారితే లడ్డూలు సరిగ్గా రావు.
  • అందుకే, మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతులకు కాస్త నెయ్యి రాసుకొని మీకు లడ్డూలు కావాల్సిన పరిమాణంలో మరమరాల మిశ్రమాన్ని తీసుకొని గట్టిగా వత్తుతూ లడ్డూలు చుట్టుకోవాలి.
  • అలా మిశ్రమం మొత్తం చుట్టుకొని చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "బొరుగుల ముద్దలు" రెడీ!

టిప్స్ :

  • ఈ రెసిపీ కోసం ఉప్పు లేని మరమరాలు తీసుకోవాలి.
  • ఈ లడ్డూ తయారీ కోసం మరమరాలను తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మరమరాలు ఎక్స్​ట్రా క్రిస్పీగా అవుతాయి. దాంతో లడ్డూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
  • పాకంలో నెయ్యి యాడ్ చేసుకోవడం ద్వారా లడ్డూలు రుచికరంగా ఉండడమే కాకుండా మంచి టేస్ట్ వస్తుంది.
  • అలాగే, పాకం కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఎందుకంటే చల్లారితే లడ్డూలు సరిగ్గా రావని గుర్తుంచుకోవాలి.
  • అలాగని, మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే చేతులు కాలుతాయి. కాబట్టి, పట్టుకోవడానికి వీలుగా కాస్త వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి.
  • అయితే, ఆఖరున మిశ్రమం చల్లారినప్పుడు పాకం గట్టిపడిపోయి లడ్డూలు చుట్టుకోవడానికి రాదు. అలాంటి టైమ్​లో పాన్​ని 30 సెకన్ల పాటు స్టవ్ మీద ఉంచితే పాకం కరుగుతుంది. దాంతో లడ్డూలు చుట్టుకోవడం తేలిక అవుతుంది.

పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

బొప్పాయిని నేరుగా తినడమే కాదు - ఇలా "లడ్డూలు" చేసుకోండి! - ఒకటి తింటే వాటి ప్రేమలో పడిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.