Munakkaya Curry : కొబ్బరి పాలతో చేసే మునక్కాయ, స్వీట్ కార్న్ కర్రీ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ రుచి మాత్రమే కాదు తయారీ కూడా భిన్నంగా ఉంటుంది. మసాలాలు లేకుండా కారం, ఉప్పు చాలా తక్కువగా వేసుకుని చేసే ఈ కర్రీ ఎవ్వరైనా సరే ఎంజాయ్ చేస్తారు. అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది.
టూర్ వెళ్తున్నపుడు "పులిహోర" ఇలా కలపండి - ఉప్పు, పులుపు పక్కా కొలతల్లో!
కావాల్సిన పదార్థాలు :
- మునక్కాయలు - 4
- స్వీట్ కార్న్ - పావు కప్పు
- కొబ్బలి పాలు - పావు కప్పు
గ్రేవీ కోసం :
- కొబ్బరి ముక్కలు - పావు కప్పు
- పచ్చిమిర్చి - 5
- వెల్లుల్లి - 8
కర్రీకి కావాల్సిన పదార్థాలు :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 2 టీ స్పూన్లు
- పచ్చి శనగ పప్పు - టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి - 2
- జీలకర్ర - అర టీ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- అల్లం తురుము - 1 స్పూన్
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- పసుపు - పావు టీ స్పూన్
- ఉప్పు - పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

కర్రీ తయారీ విధానం :
- 4 మునక్కాయలను పీచు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇపుడొక కడాయిలో మునక్కాయ ముక్కలు, కప్పున్నర నీళ్లు పోసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పావు కప్పు స్వీట్ కార్న్ వేసి మరో 4 నిమిషాలు ఉడికించుకుని వడగట్టి పక్కకు పెట్టుకోవాలి.

- మునక్కాడ, కార్న్ ఉడికించిన నీళ్లతో కప్పు కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టు కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి.
- ఇపుడు మిక్సీ జార్లో పావు కప్పు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకుని మెత్తని పేస్ట్ రెడీ చేసుకోవాలి.

- ఇపుడు కర్రీ కోసం కడాయిలో నూనె వేసి, ఆవాలు వేసి చిటపటలాడించిన తర్వాత పచ్చి శనగ పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుని తాలింపు రెడీ చేయాలి. ఇందులోనే కరివేపాకు, అల్లం తరుగు వేసుకుని ఫ్రై చేసి ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. మరీ ఎక్కువగా మగ్గించకుండా రంగు మారే వరకు వేయించి ఉడికించిన ములక్కాడ, కార్న్ వేసుకుని కలపాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మూతపెట్టి ఉడికించాలి.

- నాలుగైదు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి కూర దగ్గర పడిన తర్వాత కొబ్బరి పాలు పోసుకుని కలిపి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత చివరగా పావు టీ స్పూన్ ఉప్పు, కొత్తిమీర తరుగు చల్లి దించుకోవాలి.

"మృగశిర కార్తె"తో చేపలకి ఉన్న లింక్ ఏంటి? - ఆ రోజున "జల పుష్పాలు" ఎందుకు తింటారో తెలుసా!
"బలమైన పోషకాహారం" - మీ పిల్లలకు వారంలో ఒకసారైనా ఇలా పెట్టండి బలంగా ఉంటారు!