Easy Guide to Make Motichoor Laddu : మోతీచూర్ లడ్డూ ఇది చాలా మంది ఫేవరెట్ స్వీట్ రెసిపీ. దీన్ని తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్స్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ, మీకు తెలుసా? అదే మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే కేవలం పావుగంటలో రెడీ చేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లోని పదార్థాలతోనే బూందీ గరిటెతో పని లేకుండా చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా స్వీట్ షాప్‌లో అమ్మే దానికి ఏమాత్రం తీసిపోదు. పైగా సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి. అంతేకాదు, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని చాలా ఈజీగా చేసి ఇవ్వొచ్చు. మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
టిప్స్ :
- ఒకవేళ మీకు శనగపిండి వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాక మరీ జారుగా అనిపిస్తే కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- అదేవిధంగా, గ్రైండ్ చేసుకున్న శనగపిండి మరీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. ఎందుకంటే చాలా సేపు ఉడికిస్తే డ్రైగా అయిపోతుంది. దాంతో మనకి మోతీచూర్ లడ్డూ సాఫ్ట్‌గా రావని గుర్తుంచుకోవాలి.

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- పావుకిలో - శనగపిండి
- ఒకటిన్నర కప్పులు - వాటర్(తగినన్ని)
పాకం కోసం :
- చక్కెర - 400 గ్రాములు
- వాటర్ - ఒకటింపావు కప్పులు(300ml)
- పావు టీస్పూన్ - ఆరెంజ్ లేదా యెల్లో ఫుడ్ కలర్
- ఒక టీస్పూన్ - యాలకుల పొడి
- ఒక టేబుల్ స్పూన్ - నెయ్యి
- ఒక టీస్పూన్ - పుచ్చపప్పు
పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పిండిని కలుపుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని శనగపిండిని జల్లించుకోవాలి.
- ఆ తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బజ్జీలా పిండి మాదిరిగా జారుగా కలుపుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకువాలి.
- నూనె కాగాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా గరిటెతో బిస్కెట్ల షేప్‌లో ఆయిల్లో వేసుకోవాలి.
- ఆపై వాటిని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో చక్కెర, నీళ్లు వేసి మంటను హై టూ మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి.
- చక్కెర పూర్తిగా కరిగి లైట్ తీగ పాకం రావాలి. అంటే, గరిటెతో కొద్దిగా తీసుకొని చేతి వేళ్లతో పట్టుకొని చూస్తే బాగా జిగురు జిగురుగా అనిపించాలి. అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చిందని తెలుసుకోవాలి. అంతేకానీ, మరీ ఎక్కువగా తీగ పాకం రావాల్సిన పనిలేదు.
- చక్కెర పూర్తిగా కరిగి సరైన పాకం వచ్చాక స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి అందులో యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.

- ఆ తర్వాత ముందుగా బరకగా మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై స్టవ్‌ను సిమ్‌లోనే ఉంచి పంచదార పాకం మొత్తం శనగపిండి మిశ్రమాన్ని పట్టేలా కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అది కాస్త దగ్గరపడ్డాక అందులో నెయ్యి వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి లడ్డూ మిశ్రమాన్ని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
- లడ్డూ మిశ్రమం కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చపప్పు వేసుకుని కలిపి చేతికి నెయ్యి అప్లై చేసుకొని కావాల్సిన పరిమాణంలో లడ్డూల్లా చుట్టుకోవాలి.
- ఇక చివరగా లడ్డూలపై సిల్వర్ ఫాయిల్, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని "మోతీచూర్ లడ్డూలు" రెడీ!
మూడే మూడు పదార్థాలతో రుచికరమైన "బొరుగు ముద్దలు" - ఇలా చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!
నవరత్నాల్లాంటి పోషకాలను అందించే హెల్దీ "లడ్డూ" - పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే బలంగా తయారవుతారు!