ETV Bharat / offbeat

సీజన్ స్పెషల్ : నోరూరించే "మొక్కజొన్న మెంతికూర కర్రీ" - వేడివేడి అన్నంలోకి అద్భుతం!

- రెగ్యులర్ కర్రీలను మించిన టేస్ట్ - అన్నం, చపాతీ, రోటీల్లోకి సూపర్ కాంబో!

Mokkajonna Menthikura Curry
Mokkajonna Menthikura Curry (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : August 31, 2025 at 3:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mokkajonna Menthikura Curry Recipe : ప్రస్తుతం మనకు మార్కెట్లో ఎక్కడ చూసిన మొక్కజొన్నలు విరివిగా కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది వీటిని చల్లని వేళ నిప్పులపై కాల్చకొని తినడమో లేదంటే ఉడికించుకొని తినడమో చేస్తుంటారు. అలాగే, మరికొందరు గారెలు, పకోడీ అంటూ రకరకాల స్నాక్స్ తయారు చేసుకొని ఆరగిస్తుంటారు. అవి మాత్రమే కాదు మొక్కజొన్న గింజలతో కమ్మని కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెంతికూరతో కలిపి ఇలా కర్రీని తయారు చేశారంటే టేస్ట్ నెక్ట్ లెవల్​లో ఉంటుంది. ఇది వేడివేడి అన్నంతో పాటు చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటిల్లోకి అద్దిరిపోతుంది. పైగా దీన్ని ఎవరైనా చాలా సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఘుమఘుమలాడేలా కుక్ చేయొచ్చు. మరి, ఈ సీజనల్ స్పెషల్ సూపర్ టేస్టీ మొక్కజొన్న మెంతికూర కర్రీ తయారీకి అవసరమైన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Mokkajonna Menthikura Curry
Mokkajonna (Getty Images)

కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • మొక్కజొన్న కంకి - ఒకటి
  • మెంతికూర ఆకులు - ఒక చిన్న కప్పు
  • నూనె - తగినంత
  • ఆవాలు - ఒకటీస్పూన్
  • జీలకర్ర - ఒకటీస్పూన్
  • పచ్చిమిర్చి - మూడ్నాలుగు
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
  • జీలకర్ర పొడి - కొద్దిగా
  • ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
  • కారం - రుచికి సరిపడా
  • టమాటాలు - రెండు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

అమ్మమ్మల పద్ధతిలో "చామగడ్డ గోంగూర పులుసు" - పుల్ల పుల్లగా, కమ్మగా భలే ఉంటుంది!

Mokkajonna Menthikura Curry
మెంతికూర (Getty Images)

తయారీ విధానం :

  • ఈ కర్రీ తయారీ కోసం ముందుగా తాజా మెంతికూరను తీసుకొని కాడల నుంచి ఆకులను ఒక కప్పు పరిమాణంలో తుంచుకొని గిన్నెలో వేసుకోవాలి. ఆపై శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడకట్టి పక్కనుంచాలి.
  • అదేవిధంగా, రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి.
Mokkajonna Menthikura Curry
ఉల్లిపాయలు (Getty Images)
  • ఇప్పుడు కర్రీ తయారీకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
  • అవి వేగాక సన్నని పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

అచ్చం టిఫెన్ సెంటర్ రుచితో "బోండాలు" - మైదా, వంటసోడా లేకుండానే!

Mokkajonna Menthikura Curry
Spices (Getty Images)
  • ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అల్లంపేస్ట్​లోని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు కలుపుతూ వేయించాలి.
  • ఆపై శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూర ఆకులను వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి మెంతికూరను అందులోని పచ్చి పోయేంత వరకు కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వాలి.
  • మెంతికూర మగ్గేలోపు తాజా మొక్కజొన్న కంకిని తీసుకొని చాకుతో గింజలను కట్ చేసుకోవాలి లేదా చేతితో ఒలుచుకోవాలి.
Mokkajonna Menthikura Curry
మొక్కజొన్న మెంతికూర క్రరీ (ETV Abhiruchi)
  • మెంతికూర చక్కగా మగ్గిన తర్వాత మొక్కజొన్న గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, టేస్ట్​కి తగినంత కారం వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలిపి మొక్కజొన్న గింజలు కాస్త మగ్గే వరకు కుక్ చేసుకోవాలి.
Mokkajonna Menthikura Curry Recipe
మొక్కజొన్న మెంతికూర క్రరీ (ETV Abhiruchi)
  • ఆవిధంగా ఉడికించుకున్నాక టమాటా ముక్కలు వేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్​లో పైన లైట్​గా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఆరేడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునే క్రమంలో మధ్యమధ్యలో మూత తీసి కలుపుతుండాలి.
  • ఆ మిశ్రమం చక్కగా మగ్గి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, కమ్మగా నోరూరించే "మొక్కజొన్న మెంతికూర కర్రీ" తయారవుతుంది!
Mokkajonna Menthikura Curry
మొక్కజొన్న మెంతికూర క్రరీ (ETV Abhiruchi)

అన్నం వార్చిన గంజితో సూపర్ టేస్టీ "అట్లు" - అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు!