Meal Maker Pakoda Recipe in Telugu : సాధారణంగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీల్మేకర్, రెండు టమోటాలు కట్ చేసి కర్రీ చేస్తుంటారు. మీల్మేకర్-టమోటా కర్రీతో ఆ పూటకి కడుపునిండా తినొచ్చు. ఈ మీల్మేకర్-టమోటా కర్రీ అన్నం, చపాతీల్లోకి ఎంతో బాగుంటుంది. అయితే, మీల్మేకర్తో ఎప్పుడూ కూర వండకుండా ఓసారి ఇంట్లో ఉన్న వాటితో పకోడీలు ట్రై చేయండి. మీల్మేకర్ పకోడీ కరకరలాడుతూ స్పైసీగా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పకోడీ చేయడం కేవలం పది నిమిషాలు సరిపోతాయి! అంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. మరి సింపుల్‌గా మీల్మేకర్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం.
చేపల పులుసు కమ్మగా ఉండాలా - ఈ "మసాలా దినుసులు" యాడ్ చేస్తే అదుర్స్!

కావాల్సిన పదార్థాలు
- 2 కప్పులు - చిన్న మీల్మేకర్
- రుచికి సరిపడా - ఉప్పు, కారం
- పావు టీస్పూన్ - పసుపు
- అరటీస్పూన్ - గరం మసాలా పొడి
- టీస్పూన్ - అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 2 టేబుల్‌స్పూన్లు - శనగపిండి
- 2 టేబుల్‌స్పూన్లు - కార్న్‌ఫ్లోర్
- కరివేపాకు - 2
- పచ్చిమిర్చి - 2
- సరిపడా - ఆయిల్

తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు చిన్న మీల్మేకర్ వేసుకొని ఒకసారి నీటితో శుభ్రంగా కడగండి. వీటిని నానబెట్టాల్సిన పనిలేదు. నీళ్లతో కడిగి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది.
- అనంతరం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పావు టీస్పూన్ పసుపు, అరటీస్పూన్ గరం మసాలా పొడి, టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆపై ఇందులో 2 టేబుల్‌స్పూన్లు చొప్పున శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీల్మేకర్లకు పిండి పట్టనట్లుగా అనిపిస్తే కొన్ని నీళ్లు చిలకరించుకొని కలుపుకోవాలి.

- ఇప్పుడు మీల్మేకర్ పకోడీ వేయించడం కోసం స్టవ్‌పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి.
- ఆయిల్ హీటయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మీల్‌మేకర్లు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

- మీల్మేకర్ కాస్త దోరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ మీల్మేకర్ పకోడీ మీ ముందుంటుంది.
- వేడివేడిగా ఈ మీల్మేకర్ పకోడీ ఉల్లిపాయ ముక్కలతో తింటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. మీల్మేకర్ పకోడీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
కమ్మటి "చల్ల మిరపకాయల కారం పొడి" - ఇడ్లీ, దోసె టిఫిన్లలోకి ఎంతో బాగుంటుంది!
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!