ETV Bharat / offbeat

చపాతీ, పులావ్​లోకి అద్దిరిపోయే "సోయా చుక్కా" - మటన్​ ఫ్లేవర్​తో యమాటేస్టీగా ఉంటుంది!

- మీల్ మేకర్​తో ఘుమఘుమలాడే రెసిపీ - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టపడతారు!

Meal Maker chukka masala curry
Meal Maker chukka masala curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2025 at 10:19 AM IST

2 Min Read
Choose ETV Bharat

meal maker chukka masala : చపాతీ, పులావ్​ లోకి సరైన కర్రీ ఉంటేనే లంచ్, డిన్నర్ పర్ఫెక్ట్​గా ఉంటాయి. లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది. మనసారా తిన్నామనే భావన కనిపించదు. అందుకే మీకోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే "సోయా చుక్కా". రెగ్యులర్​ కర్రీలైన పప్పు, వేరే కర్రీలు తినేవారికి ఇది సరికొత్త రుచిని, చక్కటి అనుభూతిని అందిస్తుంది. ఈసారి చపాతీ, పులావ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ సోయా చుక్కాను ట్రై చేయండి. మరి, ఈ రెసిపీ తయారీకి ఏ పదార్థాలు కావాలి? ఎలా ప్రిపేర్ చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

meal maker chukka masala
meal maker chukka masala (ETV Bharat)
  • మీల్ మేకర్ - 2 కప్పులు
  • 2 ఇంచుల దాల్చిన చెక్క
  • 1/2 స్పూన్ సోంపు,
  • 1 స్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ మిరియాలు
  • 4 లవంగాలు
  • 4 యాలకులు
  • రాతి పువ్వు - చిన్నది
  • 1 స్పూన్ ధనియాలు
  • 10 టేబుల్ స్పూన్ల ఆయిల్
  • అర కప్పు ఉల్లిపాయ తరుగు
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 3 టమాటాలు
  • పావు స్పూన్ పసుపు
  • 1 స్పూన్ కారం
  • కప్పున్నర వేడి నీళ్లు
  • రుచికి తగినంత ఉప్పు
meal maker chukka masala
meal maker chukka masala (ETV Bharat)

కప్పు బొంబాయి రవ్వతో క్రంచీ "చిట్టి చేగోడీలు" - ఇలా చేస్తే గుల్లగా, క్రిస్పీగా! - పైగా నూనె పీల్చవు!

తయారీ విధానం :

  • ముందుగా వేడి వేడి నీళ్లలో మిల్​ మేకర్స్​ను 30 నిమిషాలపాటు నానబెట్టాలి.
  • ఈలోపు చుక్కా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టౌమీద పాన్ పెట్టి, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, రాతి పువ్వు, ధనియాలు వేసి సన్నని మంట మీద కాసేపు ఫ్రై చేసుకోవాలి. సోంపు సువాసన వచ్చేంత వరకు ఉంచి, ఆ తర్వాత మిక్సీ జార్​లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టిన మిల్​ మేకర్​ లోనుంచి నీరంతా పోయేలాగా పిండేయాలి.
  • తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో ఆయిల్ వేయాలి. వేడెక్కిన తర్వాత రెండు చిటికెళ్ల సోంపు వేసి చిటపటలాడనివ్వాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. వాటితోపాటుగానే కరివేపాకు రెబ్బలు కూడా వేసి, ఉల్లిగడ్డ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్​ కలర్​ లోకి మారేదాకా ఫ్రై చేయాలి.
meal maker chukka masala
meal maker chukka masala (ETV Bharat)
  • ఆనియన్స్ రంగు మారుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేదాకా కుక్ చేయాలి.
  • ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసేయండి. ఈ ముక్కలు గుజ్జుగా మారే దాకా కుక్ చేసుకోవాలి.
  • టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత నీరు పిండుకున్న మిల్​ మేకర్స్ వేసి చక్కగా కలుపుకోవాలి.
meal maker chukka masala
meal maker chukka masala (ETV Bharat)
  • మిశ్రమం మొత్తం మిల్​ మేకర్స్ కు పట్టిన తర్వాత కప్పున్నర వేడివేడి నీళ్లు పోసి ఉడికించాలి. 80 శాతం నీరు ఇగిరిపోయే దాకా కుక్ చేయాలి. అప్పుడే మసాలా ఫ్లేవర్స్ అన్నీ మిల్​ మేకర్ ముక్కలకు చక్కగా పడతాయని గుర్తుంచుకోండి.
  • ఈ స్టేజ్​లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చుక్కా మాసాలా వేసి టాస్ చేయాలి.
  • ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరి. అద్దిరిపోయే సోయా చుక్కా రెడీ అయిపోతుంది.
  • ఈ రెసిపీని చపాతీతోపాటు, పులావ్​లోకి సైతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.

స్పైసీ అండ్​ క్రంచీ "టమాటా చిప్స్"​ - ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు - పిల్లలకు చాలా నచ్చుతాయి!