Thotakura Masala Vadalu in Telugu : మనలో చాలా మందికి రోడ్ సైడ్ బండి మీద చేసే మసాలా వడలు ఎంతో ఇష్టం. స్ట్రీట్ స్టైల్లో చేసే మసాలా వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. కొంతమంది ఈ వడలు చేయడానికి ఇంట్లో పిండి కలిపితే అంత క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తుంటాయి. అయితే, ఇక్కడ చెప్పిన విధంగా ఒక సీక్రెట్ పిండి కలిపితే క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. అలాగే ఈ తోటకూర మసాలా వడలు నూనె కూడా ఎక్కువ పీల్చవు. మరి సింపుల్‌గా తోటకూర మసాలా వడలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
"కొబ్బరి పచ్చడి"లో గుప్పెడు ఇవి వేసి చేయండి - రుచి అద్భుతంగా ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు:
- శనగపప్పు - 1 కప్పు
- తోటకూర - 2 కట్టలు
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- 2 టేబుల్‌స్పూన్లు - బియ్యం పిండి
- టీస్పూన్ - అల్లం-వెల్లుల్లి పేస్ట్
- టీస్పూన్ - జీలకర్ర
- ఉల్లిపాయ - 2
- అరటీస్పూన్ - గరం మసాలా
- డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్

తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడగండి. ఆపై సరిపడా నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- శనగపప్పు నానిన తర్వాత నీటిని వంపేసి ఓ గుప్పెడు పప్పు బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మిగిలిన శనగపప్పును మిక్సీ జార్‌లోకి వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ పిండిని బౌల్లోకి తీసుకోండి. ఇందులో 2 టేబుల్‌స్పూన్లు బియ్యం పిండి, టీస్పూన్ చొప్పున అల్లం-వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, తోటకూర తరుగు, అరటీస్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.

- ఈ వడల తయారీలో కొద్దిగా బియ్యప్పిండి వేయడం వల్ల వడలు క్రిస్పీగా వచ్చి నూనె పీల్చవు.
- ఈ మసాలా వడలు పిండి కలపడం కోసం వాటర్ యాడ్ చేయకూడదు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- అనంతరం కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడలు చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు వడలు మరీ మందంగా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి.
- స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి.
- ఆయిల్ హీటయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి వడలు ఒక్కోటిగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

- ఈ వడలు దోరగా వేగడానికి కాస్త టైమ్ పడుతుంది. అంత వరకు నిదానంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి.
- చక్కగా కాల్చుకున్న మసాలా వడలను ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన వడలను ఇలా సింపుల్‌గా వేయించుకుంటే సరిపోతుంది.
- ఈ మసాలా వడలు వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్స్ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
ఈ చిట్కాలు పాటిస్తూ "సన్న కారపూస" చేయండి - అచ్చం స్వీట్‌షాప్‌లో కొన్నట్లు కరకరలాడుతుంది!
"పెసర గారెలు" ఇలా చేస్తే అస్సలు నూనె పీల్చవు - ఇదొక్కటి వేసి చూడండి కొత్త ఫ్లేవర్ అద్దిరిపోతుంది!