ETV Bharat / offbeat

ఓట్స్​తో "మసాలా వడలు" - బ్రేక్​ఫాస్ట్​, స్నాక్స్​గా బెస్ట్​ - డీప్​ఫ్రై అవసరం లేదు!

-ఓట్స్​తో ఎప్పుడూ చేసే రెసిపీలు కాకుండా - ఇలా మసాలా వడలు చేసుకోండి, అద్దిరిపోతాయి!

Masala Vada with Oats
Masala Vada with Oats (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : August 7, 2025 at 11:22 AM IST

2 Min Read
Choose ETV Bharat

Masala Vada with Oats: ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఓట్స్​ ఒకటి. అందుకే ప్రస్తుత రోజుల్లో వీటిని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే వీటిని కొంతమంది పాలలో వేసుకొని తింటే, మరికొందరు ఉప్మా, ఇడ్లీ, దోశ, పాయసం వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ రెగ్యులర్​గా చేసేవి కాకుండా, ఓసారి ఇలా మసాలా వడలు చేసుకోండి. అద్దిరిపోతాయి. డీప్​ఫ్రై అవసరం లేకుండా చాలా సింపుల్​గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్​ నుంచి రాగానే వీటిని స్నాక్స్​గా పెడితే ఇష్టంగా తినేస్తారు. తయారు చేయడం కూడా వెరీ ఈజీ. మరి లేట్​ చేయకుండా కమ్మగా ఉండే ఓట్స్​ మసాలా వడలు ఎలా చేయాలో చూసేయండి.

Oats
ఓట్స్​ (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • ఓట్స్​ - 1 కప్పు
  • శనగపప్పు - అర కప్పు
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • ఉప్పు - సరిపడా
  • కారం - 1 టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Chana Dal
శనగపప్పు (Getty Images)

తయారీ విధానం:

  • శనగపప్పును ఓ గిన్నెలోకి తీసుకుని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్​ పోసి సుమారు గంట పాటు నానబెట్టుకోవాలి.
  • పప్పు నానిన తర్వాత జల్లెడలో వేసి పక్కన పెట్టాలి. ఈలోపు వడలకు అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి ధనియాలు, వడకట్టిన శనగపప్పు, ఓట్స్​, రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్​ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
Onions
ఉల్లిపాయ ముక్కలు (ETV Abhiruchi)
  • ఇప్పుడు అందులోకి కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, 2 టీస్పూన్ల నూనె వేసి సాఫ్ట్​ ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి.
  • ఈ పదార్థాలన్నింటిని ముద్ద వచ్చేలా కలిపిన తర్వాత కొద్దికొద్దిగా తీసుకుంటూ రౌండ్​గా చేసుకుని వడలుగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని ప్రిపేర్​ చేసి ఓ ప్లేట్​లోకి పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి కాకుండా షాలో ఫ్రైకి అవసరమైన మేర నూనె పోసి పాన్​ మొత్తం స్ప్రెడ్​ చేసి వేడి చేసుకోవాలి.
Masala Vada with Oats
మసాలా వడలు (ETV Abhiruchi)
  • నూనె కాస్త వేడెక్కిన తర్వాత ప్రిపేర్​ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా నిధానంగా నూనెలో పెట్టుకోవాలి.
  • మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని రెండు వైపులా లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్​ ఉన్న ప్లేట్​లోకి వేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే నూనెలో వేయించి తీసుకోవాలి.
  • అనంతరం ఓ ప్లేట్​లోకి తీసుకుని టమాటా సాస్​తో తింటే సూపర్​ టేస్టీ అండ్​ క్రంచీ ఓట్స్​ మసాల వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Masala Vada with Oats
ఓట్స్​ మసాలా వడలు (ETV Abhiruchi)

చిట్కాలు:

  • కావాలనుకుంటే మినప్పప్పును కూడా నానబెట్టుకుని ఓట్స్​తో కలిపి గ్రైండ్​ చేసి అయినా ఈ వడలను చేసుకోవచ్చు.
  • అలాగే కేవలం పైన చెప్పిన పదార్థాలు కాకుండా నువ్వులు, క్యారెట్​ తురుము వంటివి కూడా వేసుకుని వడలు ప్రిపేర్​ చేయొచ్చు.

పెసరపప్పుతో ఘుమఘుమలాడే "పులగం" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - ప్రసాదంగా పర్ఫెక్ట్​!

రక్షా బంధన్​ స్పెషల్​​ "మోతీచూర్​ లడ్డూలు" - పక్కా కొలతలతో స్వీట్​ షాప్​​ టేస్ట్​ - పావుగంటలో రెడీ!