Mamidi Panakam Poorilu: చాలా మంది ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లో పూరీ ఒకటి. సాధారణంగా వీటిని పూరీ కర్రీతో తింటుంటారు. అది లేకుంటే చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ కూరలతో తింటుంటారు. అయితే ఇవన్నీ ఎప్పుడూ తినేవే. పైగా పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు సెపరేట్ కర్రీ చేయడమంటే లాంగ్ ప్రాసెస్. అలాంటి సమయంలో ఓసారి మామిడి పానకం పూరీలు చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. వేడివేడి పూరీలను మామిడి పానకంలో ముంచుకుని తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్. పైగా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ మామిడి పానకం పూరీలు ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
మామిడి పానకం కోసం:
- మామిడి పండ్లు - 6
- పంచదార - పావు కప్పు
- యాలకుల పొడి - అర టీస్పూన్
- గోరువెచ్చని పాలు - అర కప్పు
- కుంకుమపువ్వు - చిటికెడు
- డ్రైఫ్రూట్స్ - కొద్దిగా

పూరీల కోసం:
- గోధుమపిండి - 1 కప్పు
- ఉప్పు - చిటికెడు
- నూనె - 2 టీస్పూన్లు

తయారీ విధానం:
- ఓ బౌల్లోకి గోధుమపిండి, ఉప్పు, నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకుని మూత పెట్టి పక్కన ఉంచాలి. అలాగే గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి కలపాలి.
- ఇప్పుడు మామిడి పానకం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మామిడి పండ్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి.

- మిక్సీజార్‌లోకి మామిడి ముక్కలు, పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు కలిపిన గోరువెచ్చని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ బౌల్లోకి తీసుకుంటే మామిడి పానకం రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి.
- ఇప్పుడు ముందుగా కలిపిన గోధుమపిండిని మరోసారి మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఓ ఉండను తీసుకుని లైట్‌గా పొడి పిండి చల్లుకుంటూ పూరీలుగా వత్తుకోవాలి.
- ఇలా చేసుకున్న పూరీలను వేడివేడి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన ఉండలను పూరీలుగా వత్తుకుని కాల్చుకోవాలి.

- పూరీలు చేసుకోవడం పూర్తయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆపై ఫ్రిజ్‌లో పెట్టిన మామిడి పానకాన్ని బయటికి తీసి డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మామిడి పానకం పూరీలు రెడీ.
- పూరీలు వేడిగా ఉన్నప్పుడే మామిడి పానకంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.

టిప్స్:
- బాగా పండిన మామిడి పండ్లు తీసుకుంటే పానకం రుచి బాగుంటుంది. అలాగే పంచదారను మ్యాంగో స్వీట్స్‌కు తగినట్లు తీసుకోవాలి.
- నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీలను వేసి కాల్చుకోవాలి. లేదంటే అవి నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది.
పల్లీలు, చుక్క నూనె లేకుండానే - టిఫెన్స్లోకి "సూపర్ చట్నీ"! - కేవలం 5 నిమిషాల్లో రెడీ!