Maddur Vada Recipe in Telugu : చల్లని సాయంత్రం వేళ కరకరలాడే మసాలా వడలు తింటుంటే ఎంతో బాగుంటుంది. ఇలా మసాలా వడలు చేయాలంటే మినప్పప్పు లేదా శనగపప్పు కనీసం నాలుగైదు గంటలపాటు నానబెట్టాల్సి ఉంటుంది. అయితే, మీకు వడలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా కర్ణాటక స్పెషల్ 'మద్దూర్ వడ' ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన విధంగా వడలు చేస్తే ఎక్కువ నూనె పీల్చకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.
మీరెపుడైనా "బంగాళాదుంపల కర్రీ" ఇలా చేశారా? - ఈ కొత్త పద్ధతిలో చాలా బాగుంటుంది!

కావాల్సిన పదార్ధాలు :
- ఉల్లిపాయలు - 3 (మీడియం సైజ్‌లో ఉండేవి)
- పచ్చిమిర్చి - 4
- ఉప్పు - రుచికి తగినంత
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లం తరుగు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్
- నీరు - పిండి కలుపుకోవడానికి కావాల్సినంత
- కొత్తిమీర - తరుగు
- గుప్పెడు - పల్లీలు
- గుప్పెడు - నువ్వులు
- కప్పు - బొంబాయి రవ్వ
- ఒకటిన్నర కప్పులు - బియ్యం పిండి
- జీడిపప్పులు - కొన్ని
- టీస్పూన్ - జీలకర్ర

తయారీ విధానం :
- ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా ఉండేట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, గుప్పెడు చొప్పున పల్లీలు, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే కప్పు బొంబాయి రవ్వ, ఒకటిన్నర కప్పులు బియ్యం పిండి, టీస్పూన్ జీలకర్ర, జీడిపప్పులు వేసి బాగా కలుపుకోవాలి.

- ఇక్కడ మీకు నచ్చితే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడలు చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు వడలు మరీ మందంగా, మరీ పల్చగా కాకుండా మీడియంగా తయారు చేసుకుంటే బాగుంటాయి.

- ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
- నూనె హీటయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి వడలు ఒక్కోటిగా వేసుకోవాలి. ఆయిల్లో సరిపడా వడలు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- వడలు ఒక వైపు చక్కగా వేగిన తర్వాత వాటిని మరోవైపు తిప్పి వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా దోరగా, క్రిస్పీగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి.

- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా వడలు రెడీ!
- ఈ వడలు టమోటా, పుదీనా లాంటి చెట్నీలు లేకపోయినా అలానే తిన్నా సూపర్‌గా ఉంటాయి.
పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలాంటి స్వీట్ చేయండి - చాలా ఈజీగా ఎక్కువ మందికి పెట్టేయొచ్చు!
కమ్మని "వెన్న మురుకులు" - సరిగ్గా ఇదే కొలతలతో ట్రై చేయండి - స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతాయి!