ETV Bharat / offbeat

కారప్పూసతో కరకరలాడే "తియ్యని లడ్డూలు" - ఐదు పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

- పిల్లలు ఇష్టంగా తినే 'లడ్డూలు' - తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి!

Laddu Recipe with Karapusa
Laddu Recipe with Karapusa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 5, 2025 at 10:44 AM IST

4 Min Read
Choose ETV Bharat

Laddu Recipe with Karapusa : పిల్లలు ఇష్టంగా తింటారని చాలా మంది అమ్మలు ఎక్కువగా ప్రిపేర్ చేసే స్నాక్ రెసిపీలలో ఒకటి 'కారపూస'. కమ్మగా, కరకరలాడే దీన్ని పిల్లలే కాదు పెద్దలూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే, అందరూ ఇష్టపడే కారపూసను ఎప్పుడూ కారంగా, క్రిస్పీగా కాకుండా ఈసారి తియ్య తియ్యని "లడ్డూలు" చేసుకొని ఆరగించండి. ఇవి కూడా తినేటప్పుడు కమ్మగా, కరకరలాడుతూ చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా లాగిస్తారు. అంతేకాదు, ఈ కారపూస లడ్డూలను ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటాయి! పైగా ఈ లడ్డూల తయారీకి ఎక్కువ పదార్థాలతో పనిలేకుండా చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - రెండు కప్పులు
  • నూనె - డీప్ ఫ్రైకి తగినంత
  • బెల్లం తురుము - రెండు కప్పులు
  • యాలకుల పొడి - ఒక టీస్పూన్
  • నెయ్యి - మూడు టీస్పూన్లు

కరకరలాడే "ఉల్లిపాయ చేగోడీలు" - నిమిషాల్లోనే రెడీ! - పిల్లలైతే ఇష్టంగా తింటారు!

Laddu Recipe with Karapusa
శనగపిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ క్రిస్పీ అండ్ టేస్టీ లడ్డూల తయారీ కోసం ముందుగా కారపూసను ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఇందుకోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లో శనగపిండిని తీసుకొని అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తని ముద్దలా కలుపుకోవాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మురుకులకు కావాల్సిన దానికంటే కాస్త సాఫ్ట్​గా పిండిని కలుపుకోవాలి. అంటే, చపాతీ ముద్ద కంటే కొద్దిగా లూజుగా ఉండేలా చూసుకోవాలి.
  • పిండిని సరైన కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనెను పోసుకొని వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యేలోపు జంతికల గొట్టం తీసుకొని సన్నని కారపూస బిళ్లను సెట్ చేసుకోవాలి. ఆపై దాని లోపల కొద్దిగా నూనెను రాసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని సరిపడా పెట్టుకొని పక్కనుంచాలి.
Laddu Recipe with Karapusa
బెల్లం తరుగు (Getty Images)
  • నూనె బాగా కాగిన తర్వాత పిండి కూరుకున్న జంతికల గొట్టంతో నేరుగా కాగుతున్న ఆయిల్​లో కారపూస చుట్టలా వత్తుకోవాలి.
  • కారపూసను వత్తుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా వన్​సైడ్ కాలిన తర్వాత మరో వైపునకు నెమ్మదిగా తిప్పేసుకొని అటువైపు కూడా చక్కగా కాల్చుకోవాలి.
  • అది రెండు వెపులా ఎర్రగా కాలిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్​లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కారపూసలా రెడీ చేసుకోవాలి.
  • బేషన్​లోకి తీసుకున్న కారపూస చల్లారిన తర్వాత చేతితో బ్రేక్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే, మరొక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె అప్లై చేసుకొని పక్కనుంచాలి.

మినపప్పును రుబ్బితేనే కాదు, మిక్సీలో పట్టినా సూపర్ "వడలు" - నూనె పీల్చకుండా వస్తాయి!

Laddu Recipe with Karapusa
బెల్లం పాకం (ETV Bharat)
  • ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో బెల్లం తురుము తీసుకొని, అరకప్పు వాటర్ పోసి పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దాన్ని దింపి పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో కరిగించుకున్న బెల్లం వాటర్​ని వడకట్టి పోసుకొని లో ఫ్లేమ్​లో ఉండ పాకం వచ్చేలా బాయిల్ చేసుకోవాలి.
  • పాకం వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలంటే, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పాకంను వేసి కాసేపటికి చేతితో ఉండలా చేస్తే పర్ఫెక్ట్ షేప్ రావాలి.
  • సరైన పాకం వచ్చిందనుకున్నాక అందులో యాలకుల పొడి, రెండు టీస్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
Laddu Recipe with Karapusa
యాలకులు (Getty Images)
  • ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నని కారపూసను కూడా బెల్లం పాకంలో వేసుకొని పాకం మొత్తం కారపూసకు పట్టేలా చక్కగా కలుపుకోవాలి.
  • అనంతరం చక్కగా కలిపిన కారపూస మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసుకున్న వెడల్పాటి ప్లేట్​లో వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. అంటే, చేతితో పట్టుకోవడానికి వీలుగా గోరువెచ్చగా మారేవిధంగా చల్లార్చుకోవాలి.
  • ఆవిధంగా చల్లార్చుకున్నాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని బెల్లం కారపూస మిశ్రమం నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ మీకు కావాల్సిన షేప్​లో లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి.
  • మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లా చేసుకొని ప్లేట్​లోకి తీసుకొని చల్లారాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో కరకరలాడే "కారపూస లడ్డూలు" మీ ముందు ఉంటాయి!
Laddu Recipe with Karapusa
నెయ్యి (Getty Images)

చిట్కాలు :

  • ఈ రెసిపీలో శనగపిండి తీసుకున్న కప్పునే బెల్లం తురుము, వాటర్ వంటిని తీసుకోవడానికి వాడుకోవాలి.
  • అలాగే, స్వీట్ కాస్త ఎక్కువ తినేవారైతే బెల్లాన్ని ఇక్కడ చెప్పిన దానికంటే కొద్దిగా పెంచి వేసుకోవచ్చు.
  • ఇక్కడ పాకంను పల్లీ ఉండలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండ పాకం వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే కారపూస లడ్డూలు పర్ఫెక్ట్ షేప్​లో మంచి రుచికరంగా వస్తాయి.
  • ఈ రెసిపీలో మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసి కూడా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు.
  • లడ్డూలు చుట్టుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా లైట్​గా వత్తుతూ ఉండలు చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు మరీ గట్టిగా ఉండవని గుర్తుంచుకోవాలి.

పిల్లలు ఇష్టపడే టేస్టీ "బఠాణీ చాట్" - స్ట్రీట్ స్టైల్​లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి!